Big Stories

Remedies for White Beard: తెల్ల గడ్డంతో ఇబ్బంది పడుతున్నారా..? ఇవి ట్రై చేయండి!

Turn White Beard to Black with these Home Remedies: చాలా మందికి వయసుతో సంబంధం లేకుండా తెల్ల వెంట్రుకలు వస్తున్నాయి. ఈ తరుణంలో మార్కెట్లో దొరికే క్రీములను వాడి జుట్టును మరింత పాడు చేసుకుంటున్నారు. మార్కెట్లోని ప్రొడక్ట్స్ లలో రసాయనాలు జుట్టు, చర్మంపై ఎఫెక్ట్ అయి సమస్యలు తీసుకువస్తాయి. అయితే వీటన్నింటిని తరిమికొట్టాలంటే వంటింట్లో దొరికే పదార్థాలతోనే తెల్ల గడ్డాన్ని నల్లగా మార్చుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

ఆమ్లా ఆయిల్..

- Advertisement -

చిన్న వయస్సులోనే తెల్ల గడ్డం సమస్యతో బాధపడేవారికి ఆమ్లా ఆయిల్ ఓ మంచి ఛాయిస్ అని చెప్పాలి. ఉసిరిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటితో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోడానికి సులభవతుంది. అంతేకాకుండా జుట్టు, చర్మంపై ఎటువంటి చెడు ప్రభావం చూపకుండా ఉంటుంది. అందువల్ల ఉసిరి నూనెను గడ్డానికి తరచూ రాసుకుని మసాజ్ చేసుకోవాలి. ఇలా రాత్రంతా చేసుకుని తెల్లవారుజామున స్నానం చేసే సమయంలో వాష్ చేసుకోవాలి. ఈ మేరకు ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ డెర్మటాలజీ లో 2016లో ఓ నివేదిక విడుదలైంది. 6 నెలల పాటు రోజు గడ్డానికి రెండుసార్లు ఆమ్లా ఆయిల్ రాసుకోవడం వల్ల గడ్డం నల్లగా మారుతుందట. అంతేకాకుండా గడ్డం పెరుగుదల, రంగుల్లోను త్వరగా మార్పులు వస్తాయని తేలింది.

Also Read: Summer Hair Care Tips : సమ్మర్.. ఈ చిట్కాలతో మీ జుట్టు సేఫ్!

బ్లాక్ టీ..

బ్లాక్ టీని తరచూ గడ్డానికి రాయడం వల్ల తెల్ల గడ్డం నల్లగా మారుతుంది. ప్రతీ రోజు చల్లారిన బ్లాక్ టీని గడ్డానికి అప్లై చేసుకోవాలి. ఇలా దాదాపు 30 నిమిషాల పాటు ఉంచేసి ఆ తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల తెల్ల గడ్డం నల్లగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఉల్లి రసం..

ఉల్లి రసాన్ని తయారు చేసుకుని గడ్డానికి రాసుకోవాలి. ఇలా దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచుకుని గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కూడా గడ్డం నల్లగా మారుతుంది. ఉల్లి రసంలో ఉండే సల్ఫర్ వంటి అనేక పోషకాలు గడ్డాన్ని నల్లగా మార్చేలా తోడ్పడుతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News