E-Paper
Advertisement

Mohanlal in Kantara: కాంతార 2 కోసం రంగంలోకి మెగాస్టార్..? ఇక రికార్డుల మోతే!

Mohanlal in Kantara: కాంతార  2 కోసం రంగంలోకి మెగాస్టార్..? ఇక రికార్డుల మోతే!
Advertisement

Rishab Shetty Meets Mohanlal: కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి ప్రస్తుతం కాంతార 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. గతేడాది కాంతార చేసిన రచ్చ అంతా ఇంతాకాదు. కన్నడ పరిశ్రమను పాన్ ఇండియా లెవెల్లో తీసుకెళ్లిన సినిమా. కన్నడ సినిమాలను ప్రతి ఒక్క ప్రేక్షకుడు ఆదరించేలా చేసిన సినిమా. రిషబ్ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రీక్వెల్ గా కాంతార 2 రాబోతుంది. అంటే.. కాంతార లో మనం చూసిన కథకు ముందు జరిగిన కథ అన్నమాట. ఈ సినిమా కోసం రిషబ్ చాలా కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.

తాజాగా రిషబ్.. మలయాళ మెగాస్టార్ మోహన్ లాల్ ను కలిశాడు. లెజెండరీ నటుడు మోహన్ లాల్ ను కలవడం చాలా గర్వంగా ఉందని తెలిపాడు. ఆయన ఫ్యామిలీ కూడా ఉండడంతో.. మోహన్ లాల్ ఇంటికి వెళ్లి మరీ రిషబ్ ఆయన భార్య ప్రగతి మీట్ అయ్యినట్లు తెలుస్తోంది. అయితే వారు ఎందుకు కలిశారు అనేది  మాత్రం రిషబ్ చెప్పకపోవడంతో అభిమానులు తమ ఊహాగానాలు అల్లేసుకుంటున్నారు. కాంతార 2 కోసమే మోహన్ లాల్ ను దింపుతున్నాడని చెప్పుకొస్తున్నారు.

Advertisement

Also Read: Maname Teaser: మనమే సినిమాలో శర్వానంద్ కొడుకుగా నటించిన బుడ్డోడు ఎవరో తెలుసా.. ?

Advertisement

ఇక ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం రిషబ్.. మోహన్ లాల్ తో సంప్రదింపులు జరిపినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో నిజం ఎంత అనేది తెలియదు కానీ, ఇది కనుక నిజమైతే.. కాంతార 2 పై అంచనాలు మరింత రెట్టింపు అవుతాయి అని మాత్రం చెప్పొచ్చు. మరి ఈ వార్త నిజమో కాదో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేవరకు వేచిచూడక తప్పదు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×