Big Stories

TSRTC : రేపటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఫ్రీ.. కండీషన్లు ఇవే..!

TSRTC : తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం మహలక్ష్మి పథకాన్ని అమల్లోకి తీసుకొస్తోంది. శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటల నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించనుంది. సోనియా బర్త్ డే సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం మహలక్ష్మి పథకం అమలుకు శ్రీకారం చుడుతోంది.

- Advertisement -

మహిళా ప్రయాణికుల ఛార్జీల మొత్తాన్ని ఆర్టీసీకి ప్రభుత్వం చెల్లిస్తుంది. మహాలక్ష్మి పథకంపై ఉత్తర్వులు జారీ చేసింది. సిటీ, ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం అవకాశం కల్పించనున్నారు. బాలికలు, మహిళలు, ట్రాన్స్‌జెండర్లకు ఈ పథకం వర్తిస్తుంది.

- Advertisement -

రేపు అసెంబ్లీ ఆవరణలో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర పరిధిలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చు. కండక్టర్ కు ఆధార్, ఓటర్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ చూపిస్తే చాలు. పథకం అమలకు సంబంధించిన మార్గదర్శకాలను టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు.

మహలక్ష్మి పథకం మార్గదర్శకాలను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. శనివారం మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు అసెంబ్లీ ప్రాగంణ నుంచి ఈ పథకాన్ని ప్రారంభిస్తామని ప్రకటించారు. మహిళా మంత్రులు, సీఎస్, ఎమ్మెల్యేలు, మహిళా ఉద్యోగులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కోవిడ్ ప్రభావంతో వ్యక్తిగత వాహనాల సంఖ్య బాగా పెరిగిందని వివరించారు. ఈ క్రమంలోనే ట్రాఫిక్ సమస్యలు పెరిగాయన్నారు. ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ట్రాఫిక్ సమస్యలు తగ్గుతాయన్నారు.

రూల్స్ ఇవే..
పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ , మెట్రో ఎక్స్ ప్రెస్ బసుల్లో మహిళు రాష్ట్ర సరిహద్దు వరకు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణించవచ్చని సజ్జనార్ తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఏదో ఒక స్థానిక ధ్రువీకరణ గుర్తింపుకార్డు చూపిస్తే సరిపోతుందన్నారు. ప్రయాణ సమయంలో మహిళా ప్రయాణికులకు జీరో టిక్కెట్ ఇస్తామన్నారు. వారంరోజుల్లో ఎలక్ట్రానిక్ మిషన్ ద్వారా జీరో టిక్కెట్ ప్రింటింగ్ చేస్తామని చెప్పారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సులను పెంచుతామన్నారు. ప్రస్తుతం 7200 సర్వీసులును మహలక్ష్మి పథకం కోసం ఉపయోగిస్తామని సజ్జనార్ వెల్లడించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News