Big Stories

Fake Toll Plaza : నకిలీ టోల్ ప్లాజాతో కోట్లు కొల్లగొట్టిన మోసగాళ్లు.. అయిదుగురు అరెస్ట్

Fake Toll Plaza : రహదారిపై దొంగతనంగా టోల్ ప్లాజా నిర్మించి ఆ దారిలో ప్రయాణిస్తున్న వాహనదారుల నుంచి చలానాల పేరుతో కొందరు మోసగాళ్ల కోట్ల రూపాయలు దోచుకున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అయిదుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ సంఘటన గుజరాత్ రాష్ట్రం మోర్బీ జిల్లాలో జరిగింది.

- Advertisement -

నకిలీ టోల్ ప్లాజా కట్టి దాదాపు ఏడాదిన్నర పాటు టోల్ ఫీజు పేరులతో ఓ ముఠా వాహనదారుల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసింది. గుజరాత్ రాష్ట్రం మోర్బీ, కచ్ జిల్లాల మధ్య నేషనల్ హైవే 8ఏపై వాఘసియా టోల్ ప్లాజా ఉంది. ఆ దారిలో వెళ్లితే చలాన్ కట్టవలసి వస్తోందని.. చాలా వాహనదారులు పక్కనే మరో దారి నుంచి వెళ్లడం ప్రారంభించారు. ఇది గమనించింన కొందరు మోసగాళ్లు.. ఒక ప్లాన్ వేశారు. ఆ పక్కన ఉన్న ప్రత్యామ్నాయ దారిలో కొంత డబ్బు ఖర్చు చేసి బైపాస్ రోడ్డులా కనిపించే రోడ్డు నిర్మించారు. అక్కడ సమీపంలోనే నిరుపయోగంగా ఉన్నా ఒక సిరామిక్ ఫ్యాక్టరీలో నకిలీ టోల్ ఆఫీసు పెట్టారు. రోడ్డుపై ఒక నకిలీ టోల్ ప్లాజా నిర్మించారు.

- Advertisement -

ఆ దారిలో వస్తున్న వాహనదారులతో చాలా తక్కువ టోల్ ఫీజు వసూలు చేయడం మొదలుపెట్టారు. లారీల కోసం రూ.20 నుంచి రూ.200 దాకా చలాన్ తీసుకునేవారు. సాధారణంగా టోల్ ప్లాజాలో ఒక లారీకి రూ.110 నుంచి రూ.595 చలాన్ తీసుకుంటారు. ఇటీవలే పోలీసులకు ఈ విషయం తెలిసింది.

పోలీసులు విచారణ చేసి.. అయిదు మందిని అరెస్టు చేశారు. అయిదు మందిలో ఒకరు రిటైర్డ్ సైనికుడని సమాచారం. పట్టుబడిన వారంతా గుజరాత్‌లోని వాంకనేర్ ప్రాంతానికి చెందినవారని పోలీసులు తెలిపారు.

కొన్ని నెలల క్రితమే గుజరాత్‌లో దాహోద్ జిల్లాలో ఆరు నకిలీ ప్రభుత్వ ఆఫీసులను పోలీసులు సీజ్ చేశారు. ఆ ఆఫీసుల నుంచి రూ.8 కోట్ల పట్టుబడ్డాయి. ఈ ఆఫీసులను ఒక రిటైర్డ్ IAS అధికారి నడుపుతున్నారని తెలిసి పోలీసులు అతడిని అరెస్టు చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News