E-Paper
Advertisement

Vikarabad Psycho Killer | వికారాబాద్ లో సైకో కిల్లర్ అరెస్ట్.. మహిళలను అడవి తీసుకెళ్లి హత్యలు!

Vikarabad Psycho Killer | వికారాబాద్ లో సైకో కిల్లర్ పోలీసుల చేతికి చిక్కాడు. ఓ మిస్సింగ్ కేసును విచారిస్తున్న క్రమంలో.. సైకో కిల్లర్ ను పోలీసులు పట్టుకున్నారు. కూలీ పనులు చేసుకునే వారే టార్గెట్ గా హత్యలు చేస్తున్న నిందితుడు. మిస్ అయిన మహిళను కూడా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ హత్యతో కలిపి నిందితుడు మొత్తం ఏడు హత్యలను చేసినట్లు పోలీసులు కనుగొన్నారు.

Vikarabad Psycho Killer | వికారాబాద్ లో సైకో కిల్లర్ అరెస్ట్.. మహిళలను అడవి తీసుకెళ్లి హత్యలు!
Advertisement

Vikarabad Psycho Killer | వికారాబాద్ లో సైకో కిల్లర్ పోలీసుల చేతికి చిక్కాడు. ఓ మిస్సింగ్ కేసును విచారిస్తున్న క్రమంలో.. సైకో కిల్లర్ ను పోలీసులు పట్టుకున్నారు. కూలీ పనులు చేసుకునే వారే టార్గెట్ గా హత్యలు చేస్తున్న నిందితుడు. మిస్ అయిన మహిళను కూడా హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే ఈ హత్యతో కలిపి నిందితుడు మొత్తం ఏడు హత్యలను చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. ఈ కిరాతకుడిపై ఇప్పటికే ఆరు కేసులు నమోదు కాగా… ఐదు కేసులను కోర్టు తొలగించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మరో కేసులో ఈ సైకో నిందితుడిగా కొనసాగుతున్నాడు.

వికారాబాద్ జిల్లా తాండూర్ కు చెందిన సర్వబీ.. గత నెల 29న.. కూలీ పని నిమిత్తం వెళ్ళి అదృశ్యం అయ్యింది. ఆమె కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో ఈ నెల 1వ తేదీన తాండూర్ పట్టణ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఫిర్యాదు మేరకు సీసీ కెమెరాలు ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. మహిళ మరో వ్యక్తితో మాట్లాడుతున్నట్టు గుర్తించారు. నిన్న సర్వబీ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు.. అక్కడే శవపరీక్ష కూడా నిర్వహించారు.

Advertisement

కాగా హత్యగా భావించిన పోలీసులు.. ఆమెతో మాట్లాడిన సదరు వ్యక్తి గురించి విచారణ చేపట్టారు. ఆ వ్యక్తిని ధరూర్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన మాల కిష్టయ్యగా పోలీసులు గుర్తించారు. కిష్టయ్యను అరుపులోకి తీసుకొని తమదైన శైలిలో పోలీసులు విచారించగా అతడి నేరాలు వెలుగులోకి వచ్చాయి.

మృతి చెందిన మహిళకు కూలి పని ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి పెద్దేముల్ మండలం తాట్టేపల్లి అడవిలోకి తీసుకెళ్లిన నిందితుడు…. ఆమె చీర కొంగు మెడకు బిగించి హత్య చేసినట్లు భావిస్తున్నారు. కాగా ఒంటిపై ఆభరణాల కోసమే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. ఇక నిందితుని దగ్గర నుంచి 1000 రూపాయలు ఒక ఫోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×