Election Commission Serious on Jagan’s Stone Attack: సీఎం జగన్ దాడి ఘటనపై ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. రాష్ట్రంలో జీరో వయొలెన్స్ ఎన్నికలే టార్గెట్ గా ఉన్న ఈసీ.. సీఎం జగన్ పై రాళ్లదాడి జరగడంతో సీరియస్ అయింది. జగన్ పై దాడి జరిగిన ప్రాంతాన్ని, స్కూల్ భవనాన్ని పరిశీలించింది. దాడి ఘటనపై ఒక్కరోజులో నివేదిక ఇవ్వాలని సీపీ కాంతిరాణాను ఆదేశించింది. ఈసీ ఆదేశాల మేరకు సీపీ నేడు నివేదికను అందించనున్నారు.
మరోవైపు.. ఈ దాడి ఘటనపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. డీజీపీ రాజేంద్రనాథ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు కేసు విచారణ చేస్తున్నాయి. దాడికి జరిగిన స్కూల్ భవనంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. స్కూల్ ఆవరణలో మెట్లపై అడుగడుగునా సీసీ కెమెరాలుండటంతో.. దాడికి పాల్పడిందెవరో గుర్తించే పనిలో పడ్డారు. ఇప్పటి వరకైతే దాడికి పాల్పడిందెవరో తెలియరాలేదు. సీఎం జగన్, వెల్లంపల్లికి తగిలిన రాయి ఒక్కటేనా లేక వేర్వేరా అన్నదానిపై విచారణ చేస్తున్నారు.
Also Read: CM జగన్ పై రాళ్లదాడి.. టిడిపి రియాక్షన్ పై వైసీపీ కీలక ప్రకటన
మరోవైపు.. జగన్ పై దాడి జరిగిన ఘటనపై టిడిపి చేస్తున్న పోస్టులు నీఛ రాజకీయాలను తలపిస్తున్నాయని వైసీపీ వాపోతుంది. 2019లో కోడికత్తి, ఇప్పుడు రాయి దాడి డ్రామాలు ఆడుతున్నాడని టిడిపి Xలో వరుస పోస్టులు చేసింది. కంటికి గాయమైతే.. డాక్టర్లు కాళ్లతో నడవవద్దన్నారని, అందుకే ప్రచారానికి విరామం ఇచ్చారని వ్యంగ్యంగా మాట్లాడింది టిడిపి. టిడిపి తీరుపై వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నారు. పార్టీ అధిష్టానం సంయమనం పాటించాలని సూచించడంతో.. వైసీపీ కార్యకర్తలు మిన్నకుండిపోయారు.