Big Stories

Hyderabad Biryani @ No. 1 Place: హైదరాబాద్ బిర్యానీ అంటే అట్లుంటది మరి.. దేశంలోనే టాప్ ప్లేస్!

Swiggy Delivered 10 Lakhs Biryani’s in Ramdan Season: కూరల్లోకెల్లా వంకాయకూర రాజు అన్నది ఎలా నానుడో.. ఎన్ని బిర్యానీలున్నా.. అన్నింటిలోకెల్లా హైదరాబాద్ బిర్యానీ స్పెషల్. ముఖ్యంగా హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ పేరు చెప్పీ చెప్పగానే ఎవరికైనా నోరూరుతుంది. ఇతర రాష్ట్రాల నుంచే కాదు.. దేశ, విదేశాల నుంచి నగరానికి వచ్చినవారు కూడా ఇక్కడి బిర్యానీ టేస్ట్ చేయనిదే తిరిగి వెళ్లరంటే అతిశయోక్తి కాదు మరి. అసలు సిసలు హైదరాబాద్ బిర్యానీ తిన్నవారెవరైనా.. ఆ రుచి మరచిపోలేరు. నగరానికి వచ్చినపుడు తినకుండా వెళ్లలేరు. అదీ.. హైదరాబాద్ బిర్యానీ ప్రత్యేకత. అందుకే ఎప్పుడూ టాప్ లో ఉంటుంది.

- Advertisement -

రంజాన్ నెలలో.. నగరవాసులు ఎక్కువగా తిన్న ఫుడ్ ఏంటి అని సెర్చ్ చేస్తే.. బిర్యానీనే అని తేలిందట. ఈ నెలరోజుల వ్యవధిలో ఏకంగా 10 లక్షల పేట్ల బిర్యానీ ఆర్డర్లు వచ్చాయని ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ తెలిపింది. మార్చి 11 నుంచి ఏప్రిల్ 8 వరకూ వచ్చిన ఆర్డర్ల వివరాలను వెల్లడించిన స్విగ్గీ.. నెలరోజుల్లో ఏకంగా 60 లక్షల ప్లేట్ల బిర్యానీలను డెలివరీ చేసినట్లు చెప్పింది. సాధారణంగా జరిగే బిర్యానీ డెలివరీలతో పోల్చితే.. ఇది 15 శాతం అధికం. వీటిలో ఒక్క హైదరాబాద్ లోనే 10 లక్షల పేట్ల బిర్యానీలను డెలివరీ చేసినట్లు పేర్కొంది.

- Advertisement -

Also Read: ఈ నాలుగు రకాల చేపలను తినకండి..?

బిర్యానీతో పాటు హలీమ్ డెలివరీల్లోనూ నగరవాసులు రికార్డు సృష్టించినట్లు చెప్పింది స్విగ్గీ. నెలరోజుల్లో ఏకంగా 5.3 లక్షల హలీమ్ లు ఆర్డర్లు వచ్చినట్లు వెల్లడించింది. ముఖ్యంగా ఇఫ్తార్ విందు జరిగే సమయంలో సాయంత్రం 5.30 గంటల నుంచి 7 గంటల్లో 34 శాతం ఆర్డర్లు పెరిగినట్లు వివరించింది. ఇలా దేశంలోనే స్విగ్గీ అత్యధిక బిర్యానీలు, హలీమ్ లను డెలివరీ చేసిందన్నమాట. ఒక్క స్విగ్గీలోనే ఇన్ని డెలివరీలు ఉంటే.. ఇక జొమాటో ఇతరత్రా ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ ల ద్వారా ఇంకెన్ని లక్షల బిర్యానీలు లాగించేసి ఉంటారో కదూ.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News