BigTV English

Gun fire @ Salman Khan’s Home: స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల కలకలం.. జరిపించింది ఇతడేనా..?

Gun fire @ Salman Khan’s Home: స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పుల కలకలం.. జరిపించింది ఇతడేనా..?

Gun fire @ Actor Salman Khan’s Home: బాంద్రాలోని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇల్లు గెలాక్సీ అపార్ట్‌మెంట్ బయట ఈరోజు ఉదయం 5 గంటల సమయంలో కాల్పులు జరిగాయి. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు సల్మాన్ ఖాన్ ఇంటి బయట నాలుగు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఆ ఇద్దరు బైక్ పై వచ్చి నాలుగు రౌండ్లు జరిపి పరారయ్యారు. ఈ కాల్పులలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయం తెలిసి సల్మాన్ ఖాన్ ఇంటి వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.


ఈ కాల్పుల తర్వాత ముంబై క్రైమ్ బ్రాంచ్‌తో పాటు బాంద్రా పోలీసుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది. దీంతో పాటు ఫోరెన్సిక్ బృందం కూడా ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టింది. గెలాక్సీ అపార్ట్‌మెంట్ వెలుపల రోడ్డుకు ఇరువైపులా అమర్చిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. డీసీపీ కూడా సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు సమాచారం.

Also Read: Salman Khan Ramdan Treat: సల్మాన్ ఖాన్, మురుగదాస్ కొత్త సినిమా.. రంజాన్ సర్‌ప్రైజ్ అదిరిపోయింది!

గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సల్మాన్ ఖాన్‌ను చంపేస్తానని చాలాసార్లు బెదిరించిన విషయం తెలిసిందే. ఇటీవల లారెన్స్ బిష్ణోయ్ కెనడాలోని నటుడు, గాయకుడు గిప్పీ గ్రేవాల్ ఇంటిపై కూడా దాడి చేశాడు. దాడి తర్వాత సల్మాన్ ఖాన్‌తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని.. అందువల్లనే ఆయనపై దాడి చేశారన్నారు.

కాగా గతేడాది కూడా బిష్టోయ్ గ్యాంగ్ నుంచి సల్మాన్ కార్యాలయానికి బెదిరింపు కాల్స్, ఇమెయిల్స్ వచ్చినవిషయం తెలిసిందే. అప్పుడు కూడా ఈ బెదిరింపు కాల్స్ తర్వాత పోలీసులు సల్మాన్ ఖాన్ భద్రతను పెంచారు. అయితే మరి ఇప్పుడు కూడా బిష్ణోయ్ గ్యాంగే ఈ కాల్పులు జరిపి ఉంటారని కొందరు భావిస్తున్నారు. కాగా పోలీసులు ప్రస్తుతం సల్మాన్ ఖాన్‌కు వై ప్లస్ భద్రతను కల్పించారు.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×