Big Stories

Munugode Result: హుజురాబాద్ vs మునుగోడు.. ఓడారా? గెలిచారా?

Munugode Result: మునుగోడులో టీఆర్ఎస్ గెలిచింది. ధూంధాంగా సంబరాలేమీ జరగలే. గులాబీ నేతలెక్కడా విజయ గర్వం ప్రదర్శించలే. ఓ చిన్న ప్రెస్ మీట్ తో కేటీఆర్ సరిపెట్టారు. హుజురాబాద్ లో ఓడినప్పుడూ ఇంతే చిన్న రియాక్షన్ ఇచ్చారు. మునుగోడు ప్రచారాన్ని సవాల్ గా తీసుకున్న కేసీఆర్.. గెలిచాక సైలెంట్ అయిపోయారు. మీడియా ముందుకు వచ్చి.. బీజేపీని ఉతికి ఆరేస్తారనుకుంటే.. అలాంటిదేమీ జరగలే. ఏం? ఎందుకలా? గులాబీ దళంలో మునుగోడు గెలుపు ఉత్సాహం కనిపించలేదేం? సాధించిన మెజార్టీ సంతృప్తి ఇవ్వలేదా? భవిష్యత్తు ఊహించి భయం మొదలైందా? హుజురాబాద్ మాదిరే మునుగోడులోనూ హోరాహోరీ సంగ్రామం జరగ్గా.. అక్కడ ఓడి, ఇక్కడెలా గెలిచారు? ఇవన్నీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్.

- Advertisement -

హుజురాబాద్ ఉప ఎన్నిక కేసీఆర్ కు అత్యంత ప్రతిష్టాత్మకం. తప్పక గెలవాల్సిన పోరులో దారుణంగా ఓడిపోయారు. ఈటల రాజేందర్ కు స్థానికంగా గట్టి పట్టు ఉండటం, ఆయన్ను బలిపశువు చేశారనే సింపతీ రావడం, ఆర్థికంగా బలమైన నాయకుడు కావడం, కేసీఆర్ సర్కారుపై ప్రజా వ్యతిరేకత, దళితబంధు.. ఇలా అనేక కారణాలతో అధికార పార్టీ ఓటమి పాలైంది. సేమ్ టు సేమ్ మునుగోడులోనూ అలాంటి పరిస్థితే.

- Advertisement -

రాజేందర్ లానే రాజగోపాల్ రెడ్డికి అంగ, అర్థ బలం ఎక్కువే. అక్కడా ఇక్కడా రాజీనామాతోనే ఉప ఎన్నిక వచ్చింది. అచ్చం హుజురాబాద్ స్ట్రాటజీనే మునుగోడులోనూ అమలు చేసింది టీఆర్ఎస్. యావత్ అధికార గణాన్ని మోహరించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గ్రామాల బాధ్యతలు అప్పగించింది. మద్యం, ధనం ఏరులై పారించారు. కానీ….

హుజురాబాద్ లో 20వేలకు పైగా ఓట్లతో టీఆర్ఎస్ ఓడిపోగా.. మునుగోడులో మాత్రం 10 వేల పైచిలుకు మెజార్టీతో విజయ కేతనం ఎగరవేసింది. రెండు చోట్లా గులాబీ వ్యూహాలు ఒకేలా ఉన్నా.. గెలుపోటములు మాత్రం తారుమారు కావడం ఆసక్తికరం. ఎక్కడ తేడా కొట్టింది అంటే.. ఈటలకు సానుభూతి కలిసొచ్చింది. కేసీఆర్ చేతిలో అవమానాలకు గురయ్యారనే మెసేజ్ ప్రజల్లోకి వెళ్లింది. ప్రగతిభవన్ కు బుద్ధి చెప్పాలని ప్రజలు భావించారని అంటారు. అందుకే, కేసీఆర్ కు చిన్న షాక్ ఇవ్వాలనే ఈటల రాజేందర్ ను గెలిపించారని చెబుతారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డికి అంత సానుభూతి రాలేదు. 18వేల కోట్ల కాంట్రాక్టు కోసమే ప్రజలపై బలవంతంగా రుద్దిన ఉప ఎన్నికగా భావించారు. ఫలితం.. రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా వచ్చింది.

మునుగోడులో గెలిచినా గులాబీ శ్రేణుల్లో ఆ జోష్ కనిపించలేదంటున్నారు. అంతగా డబ్బు, మద్యం, దావత్ లు ఇచ్చినా.. గ్రామానికో బడా లీడర్ ను పెట్టినా.. అధికార బలాన్ని ప్రయోగించినా.. వచ్చింది కేవలం 10 వేల ఆధిక్యం. ఒక్కచోటే ఎన్నిక కాబట్టి.. అంతగా ఫోకస్ పెట్టి.. ఎలాగోలా గెలిచామని.. అదే సార్వత్రిక ఎన్నికలైతే.. ఒకేసారి అన్నిచోట్ల ఎలక్షన్ ఉంటుంది కాబట్టి.. ఇంతటి పోల్ మేనేజ్ మెంట్ అప్పుడు చేయడం కష్టం అవుతుంది. అంటే, ఇంత గట్టి ప్రయత్నం చేయలేకపోతే గెలవడం సాధ్యమేనా? అనే భయం టీఆర్ఎస్ శ్రేణులను ఆవహించిందని.. అందుకే గెలిచినా తెగ సంబరపడే పరిస్థితి లేదని అంటున్నారు. గులాబీ శ్రేణులు గమ్మునుండటానికి ఇదే రీజన్ అని చెబుతున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News