Election Commission Gave Permission to Telangana Cabinet: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ సమావేశానికి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. పలు సూచనలు చేస్తూ కేబినెట్ సమావేశం నిర్వహించుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ లో అత్యవసరమైన విషయాలపై మాత్రమే చర్చించాలని కండిషన్ పెట్టింది. అదేవిధంగా ఎన్నిక విధుల్లో ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ భేటీలో పాల్గొనకూడదని సూచించింది. వీటితోపాటు పలు సూచనలు కూడా చేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు రైతు రుణమాఫీ, ఉమ్మడి రాజధాని అంశాలను వాయిదా వేయాలని పేర్కొన్నది.
అత్యవసరమైన విషయాలు, తక్షణం అమలు చేయాల్సిన అంశాలకు సంబంధించిన ఎజెండాపైనే కేబినెట్ భేటీలో చర్చించాలని కేంద్ర ఎన్నికల సంఘం షరతు విధించింది. జూన్ 4వ తేదీ లోపు చేపట్టాల్సినటువంటి అత్యవసర అంశాలు, ఆ తేదీ వరకు వేచి ఉండేందుకు వీలులేని అంశాలపై మాత్రమే చర్చించాలని ఈసీ సూచించింది. లోక్ సభ ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేవరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అంశం, రైతు రుణమాఫీ అంశాలను వాయిదా వేయాలని షరతులు విధిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర కేబినెట్ భేటీకి అనుమతి ఇచ్చింది.
అయితే, రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సమావేశాన్ని శనివారం రోజు నిర్వహించాలనుకున్నది. కానీ, ఈసీ నుంచి పర్మిషన్ రాకపోవడంతో చివరకు వెయిట్ చేసి వాయిదా వేయడం జరిగింది. ఈసీ నుంచి అనుమతి వచ్చినంక సమావేశాన్ని నిర్వహించాలని నిర్ణయించింది.
Also Read: భూ వివాదం.. మాజీ మంత్రి మల్లారెడ్డి అరెస్ట్
సోమవారం వరకు పర్మిషన్ కోసం వెయిట్ చేస్తామని, అప్పటికి కూడా ఈసీ నుంచి పర్మిషన్ రాకపోతే సీఎంతో సహా మంత్రివర్గమంతా ఢిల్లీ వెళ్లి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ను కలిసి రిక్వెస్ట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ నేపథ్యంలో సడెన్ గా ఈసీ పర్మిషన్ ఇచ్చింది. దీంతో కాస్త ఊరట లభించినట్లయింది. కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించనున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీని నిర్వహించనున్నది.
అయితే, శనివారం నిర్వహించాలనుకున్న కేబినెట్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించినటువంటి వేడుకల నిర్వహణతోపాటు పునర్విభజనకు పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో ఇప్పటివరకు రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలపై కేబినెట్ సమావేశంలో చర్చించాలని, ధాన్యం కొనుగోళ్లు, రైతు రుణమాఫీ, ఖరీఫ్ పంటలకు సంబంధించినటువంటి ప్రణాళికలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అజెండాను తయారు చేసుకుంది.
Also Read: Yadadri Temple New Dress Code: యాదాద్రికి వెళ్లే భక్తులకు గమనిక.. మీకు ఈ విషయం తెలుసా..?
కానీ, ఈసీ నుంచి అనుమతి లేకపోవడంతో ఆయా సంక్షేమ అంశాలు, ఇతర అత్యవసర అంశాలపై చర్చించలేకపోయినట్లయిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం లోగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి రాష్ట్ర కేబినెట్ సమావేశానికి అనుమతి కోసం వెయిట్ చేస్తామని, ఒకవేళ రాకపోతే మంత్రులతో కలిసి నేరుగా ఢిల్లీకి వెళ్లి ఈసీ అనుమతి కోరుతామని ఆయన చెప్పిన విషయం తెలిసిందే. కాగా, ఆదివారం ఈసీ అనుమతి ఇచ్చింది. పలు సూచనలు చేస్తూ రాష్ట్ర కేబినెట్ భేటీకి అనుమతి ఇచ్చింది.