Big Stories

Black Raisins: నల్ల ఎండు ద్రాక్షతో ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

 

- Advertisement -

Black Raisins: నల్ల ద్రాక్షను తినడం వల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాత్రంతా నీళ్లలో నానబెట్టిన ఎండుద్రాక్షను ఉదయాన్నే తినడం వల్ల దృష్టి మెరుగుపడుతుందట. అంతే కాదు కంటి సమస్యలను చాలా వరకు నివారించడంలో ఎండు నల్ల ద్రాక్ష కీలక పాత్ర పోషిస్తుంది. అయితే ఉదయాన్నే ద్రాక్షను తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా, జుట్టు మూలాలు బలంగా మారుతాయట.

- Advertisement -

రేచికటి వంటి ప్రమాదాన్ని కూడా తగ్గించేందుకు నల్ల ఎండు ద్రాక్ష ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్లు, ఖనిజాలు,పాలీఫెనాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, డైటరీ ఫైబర్స్ వంటి పుష్కలంగా ఉండడం వల్ల వీటిని తీసుకుంటే శరీరానికి అనేక ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల రక్త పోటు వంటి ప్రమాదాల నుంచి నివారణ కలిగిస్తుంది.

ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఎండు ద్రాక్షను తినడం వల్ల మలబద్ధకం నుంచి నివారనిస్తుంది. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎండు ద్రాక్షలోని ఐరన్, విటమిన్ బి కాంప్లెక్స్ వంటివి ఎర్ర రక్తకణాలను వృద్ధి చేస్తుంది. ఎండు ద్రాక్ష చర్మ ఆరోగ్యానికి కూడా తోడ్పడుతుంది. చర్మ రంధ్రాల లోపల ఉండే టాక్సిన్స్, కాలుష్య కారకాలు వంటి పేరుకుపోకుండా చేస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News