Big Stories

PM Modi’s Failures: మోడీ జీ.. అవి ఒకే.. కానీ వీటి సంగతేంటి మరి..?

Narendra Modi Govt Promises Unfulfilled in Ten Years Tenure: నరేంద్రమోడీ.. పదేళ్ల పాటు దేశాన్ని నడిపించిన నేత.. ఆయన ఈ పదేళ్లలో దేశాన్ని చాలా ముందుకు నడిపించారు. ఇందులో ఎలాంటి క్వశ్చన్‌ లేదు. చెప్పినవే కాదు.. చెప్పనవి కూడా చాలా చేశారు. బట్‌ కొన్ని క్వశ్చన్స్‌ మాత్రం ఇంకా మిగిలే ఉన్నాయి. ఇవి కూడా చేసి ఉంటే బాగుండేది అనే ఫిలింగ్ ప్రజల్లో ఉంది. మరి ఆయన చేయనివి ఏంటి? ఏయే రంగాల అభివృద్ధిలో మోడీ వెనకబడిపోయారు..? మోడీ ఇంకా ఏమేం చేస్తే బాగుండేది..? ఆర్టికల్ 370 రద్దు.. సర్జికల్ స్ట్రైక్స్.. ట్రిపుల్‌ తలాక్ రద్దు.. పౌరసత్వ సవరణ చట్టం, అయోధ్యలో రామాలయ నిర్మాణం.. నిజానికి ఇవి జరుగుతాయని ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ నరేంద్రమోడీ తన పాలనలో చేసి చూపించారు. బట్‌ కొన్ని విషయాల్లో మాత్రం మోడీ సర్కార్ పెట్టాల్సినంత ఫోకస్ పెట్టలేదేమో అనిపిస్తోంది. నిజానికి దేశాన్ని పాలించే పార్టీకి ఉండాల్సింది దూరదృష్టి..

- Advertisement -

తీసుకునే పాలసీ డెసిషన్స్ తాత్కాలికంగా లబ్ధి చేకూర్చడమే కాదు.. వచ్చే అనేక సంవత్సరాలకు కూడా పనిచేయాలి. మరింత ముందుకు నడిపించేలా ఉండాలి. అలాంటి డెసిషన్స్‌ మోడీ సర్కార్ చాలానే తీసుకుంది. బట్ కొన్నింటిలో మాత్రం ప్రజలు ఇంకా సాటిస్ఫై కాలేదు. లైక్ పెట్రోల్, డీజిల్ ధరలు చూడండి. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చినప్పుడు పెట్రోల్, డీజిల్‌ ధరలు ఎలా ఉండేవి..? 2014లో లీటర్ పెట్రోల్‌ ధర 66 రూపాయలు.. ఇక డీజిల్ ధర 52 రూపాయలు. మరి ఇప్పుడు పెట్రోల్‌, డీజిల్ ధరలు సెంచరీ దాటేశాయి. ఇందులో ఎలాంటి కాంట్రవర్సీలు మేం క్రియేట్ చేయడం లేదు. అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి..? ఇప్పడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? చాలా తేడా ఉంది.

- Advertisement -

Also Read: AP Election 2024: తుది దశకు ప్రచారాలు.. ఓటర్లకు ప్రలోభాల ఎర.?

అందుకే రేట్లు పెరిగాయి. ఓకే.. బట్ సామాన్యుడి బతుకు బండి నడవాలంటే ఈ ఇంధనాలు ఓ నిత్యావసర సరుకు లాంటివి.. మరి అలాంటి ఇంధన ధరలను కట్టడి చేయడంలో మోడీ సర్కార్ కాస్త విఫలమైందనే చెప్పాలి. మరోవైపు నిత్యావసరల ధరలు కూడా ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఉప్పు, పప్పుతో పాటు ఇంట్లో వాడే ప్రతి సరుకు ధరలు అమాంతం పెరిగాయి. ఇది మధ్య తరగతి వ్యక్తి జేబుకు చిల్లు పడే వ్యవహారం.. ఈ విషయంలో కూడా మోడీ కాస్త విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. బియ్యం, ఉప్పు, కారం, ఇలా ప్రతిదీ పెరిగింది. ఫర్ ఎగ్జాంపుల్.. 2002లో వారానికి సరిపడా కావాల్సిన ఐటమ్స్‌కి 484 రూపాయలు ఖర్చు పెడితే.. 2012 వచ్చే సరికి వెయ్యి రూపాయలకు చేరింది.. ఇప్పుడు ఏకంగా 2 వేల వరకు వచ్చింది ఈ ఖర్చు..

ఆ తర్వాత గ్యాస్ సిలిండర్.. గ్యాస్‌ ధరను కూడా కట్టడి చేయడంలో మోడీ సర్కార్ విఫలమైంది. మోడీ హయాంలో కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నంతగా గ్యాస్ ధరలు పెరగకపోయినా ధరలు పెరిగిన మాట వాస్తవం. ఈ ధరాభారం పడుతున్నది సామాన్య ప్రజలపైనే.. ఈ విషయంలో కూడా మోడీ సర్కార్ మరింత చొరవ చూసిస్తే.. ఈ గ్యాస్ బండ బరువు కాస్త తగ్గేది.. సామాన్యుడికి మరింత ఊరటగా ఉండేది.. నెక్ట్స్‌ పన్నులు.. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జీఎస్‌టీ అమల్లోకి తెచ్చింది. వన్ నేషన్.. వన్‌ ట్యాక్స్‌లాగా దీనిని తీసుకొచ్చారు.

Also Read: ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్.. ఇప్పటికైనా ఊరట దక్కేనా ?

తీనే పాన్ నుంచి రాసే పెన్ను వరకు ప్రతి దానిపై పన్ను వసూలు చేస్తున్నారు. ఇలా వచ్చే ప్రతిపైసా దేశాభివృద్ధి కోసమే కాబట్టి ఏం ప్రాబ్లమ్ లేదు. కానీ ప్రజలు కష్టపడి సంపాదించే డబ్బుపై కూడా పన్ను విధించడంపైనే విమర్శలున్నాయి. నిజానికి ఐదు లక్షల వరకు ఉన్న పన్ను మినహాయింపును.. 7 లక్షల వరకు పెంచారు. నిజానికి ఇది మంచి పరిణామమే.. కానీ ఇది సరిపోదు. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులకు ఇంకా పెరగాల్సి ఉంది.

బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ప్రతిసారి ఉద్యోగులంతా ఈ మినహాయింపును మరింత పెంచుతారని ఎదురు చూస్తారు.. కానీ అదేమో జరగడం లేదు. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన మధ్యంత బడ్జెట్‌లో ఈ ప్రకటన ఉంటుందని అంతా ఊహించారు.. కానీ నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇది జస్ట్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ కాబట్టి.. అలాంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకోవద్దని బీజేపీ చెప్పకనే చెప్పింది. సో ఉద్యోగులకు మళ్లీ నిరాశే మిగిలింది. మొన్న ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్‌లో చాలా మంది అకౌంట్లలో డబ్బులు అలా మాయమయ్యాయి.

Also Read: ద హెలిప్యాడ్ స్టోరీ

నిజానికి పన్ను మినహాయిస్తే ప్రతి ఒక్కరి జేబుల్లో డబ్బులు ఉంటాయి. వాటిని ఎవరూ దాచుకోరు.. మళ్లీ ఏదో ఒక విధంగా ఖర్చు చేస్తారు. అలా చేయడం వల్ల డబ్బు మళ్లీ మార్కెట్లోకి వస్తుంది. కొనుగోళ్లు పెరుగుతాయి.. పది మందికి ఉపాధి దొరుకుతోంది. ఇలా జరిగే కొనుగోళ్లపై కూడా పన్ను వసూలు చేయవచ్చు.. మోడీ హయాంలో ద్రవ్యోల్బణం పెరిగింది. నిరుద్యోగం కూడా పెరిగింది. ఎట్ ది సేమ్ టైమ్.. రూపాయి విలువ రోజురోజుకు పడిపోతుంది.

ఇది నిజంగా భారతీయుల విదేశీ కలలకు చిల్లు పెట్టినట్టే అని చెప్పాలి. డాలర్ డ్రీమ్స్‌తో విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఎక్కువ ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. 2014కు ముందు 60 రూపాయలు ఉన్న డాలర్ విలువు ప్రస్తుతం 80 రూపాయలు దాటింది. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే 83 రూపాయల 46 పైసలుగా ఉంది. నిజానికి అంతర్జాతీయంగా పరిస్థితులు మారిపోయాయి. కరోనా ఎఫెక్ట్‌ కూడా ఉంది. కానీ ఏకంగా 20 రూపాయలకు పైగా పడిపోవడం అనేది కాస్త టెన్షన్‌ పెట్టే అంశమే.

Also Read: Palakonda Constituency: పాలకొండలో గెలుపు ఎవరిని వరిస్తుంది?

మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాలో ఉన్నారు నరేంద్ర మోడీ.. అదే నిజమై.. బీజేపీ మళ్లీ అధికారంలోకి వచ్చాకనైనా.. ఈ అంశాలపై ఫోకస్ చేయాలని ప్రతి ఒక్కరూ కొరుతున్నారు. లేదంటే కూటమి అధికారంలోకి వచ్చినా.. ఈ అంశాలపై ఫోకస్ చేయాలి. సామాన్యుడిపై కాస్త కరుణా చూపించాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News