Big Stories

AP Elections 2024: ఆ మిత్రుడే జగన్ ని ఓడిస్తున్నాడా..?

PM Modi Target CM Jagan to Defeat in AP Assembly Elections 2024: అత్యధిక ఎంపీ స్థానాలిస్తే .. కేంద్రం మెడలు వచ్చి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తా.. ఇదీ గత ఎన్నికల ప్రచారంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన హామీ .. ఎన్నికల్లో గెలవగానే అలవోకగా దాన్ని మర్చిపోయారాయన.. మళ్లీ ఇప్పుడు ప్రచారంలో హోదా గురించి మాట్లాడుతున్నారు. తన మేనిఫెస్టో కంటే టీడీపీ మేనిఫెస్టోనే ప్రచారంలో ఎక్కువ ఫోకస్ చేస్తున్న జగన్‌లో తడబాటు స్పష్టంగా కనిపిస్తుంది .. నవరత్నాలను మాత్రమే నమ్ముకున్న జగన్‌కు ఇప్పుడు రైల్వేజోన్ ఉచ్చు గట్టిగానే బిగుసుకుంటున్నట్లు కనిపిస్తుంది.

- Advertisement -

ఏపీలో ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ సీట్లు తమకిస్తే .. కేంద్రం మెడలు వంచి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తానని గత ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు జగన్ .. ఆ హామీని నమ్మి 22 ఎంపీ సీట్లు కట్టబెట్టారు రాష్ట్ర ప్రజలు.. అయిదేళ్లు పూర్తైనా ఆ హామీ ఊసే ఎత్తడం లేదు ముఖ్యమంత్రి.. సీన్ కట్ చేస్తే .. ప్రత్యేక హోదా అంశాన్ని అటకెక్కించేసిన బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికల సమరంలోకి దిగాయి టీడీపీ , జనసేనలు.. ఎన్డీఏ కూటమి నేతలతో పాటు వైసీపీ నేతలు కూడా స్పెషల్ స్టేటస్ డిమాండ్ వినిపించడం లేదు. ఒక్క కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు మాత్రమే హోదాపై మోడీని నిలదీస్తున్నారు.

- Advertisement -

మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని ప్రకటించిన జగన్ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కనీసం ఆ డిమాండ్ కూడా చేయడం లేదు.. బీజేపీ ప్రత్యర్ధిగా మారినా హోదాపై ప్రశ్నించలేకపోతున్నారు. పైపెచ్చు అయిదేళ్లు అధికారంలో ఉన్న ఆయన … చంద్రబాబు ప్రత్యేక హోదాను అమ్మేసారని విమర్శలు గుప్పిస్తున్నారు.

Also Read: జగన్ దత్త పుత్రుడేనా ! చిచ్చు పెట్టిన షర్మిల..

సంక్షేమ పథకాలనే నమ్ముకుని ఎన్నికల యుద్దంలోకి దిగిన జగన్‌ ప్రస్ట్రేషన్‌లో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ప్రధాని మోడీ స్వయంగా జగన్‌ని టార్గెట్ చేస్తున్నారు.. ప్రధానికి కౌంటర్ ఇచ్చే పరిస్థితిలేని వైసీపీ ఇప్పుడు అయోమయంలో పడ్డట్లు కనిపిస్తుంది. ఎప్పటిలాగే చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తున్న జగన్.. తనపై అవినీతి ముద్ర వేసిన ప్రధానిని పల్లెత్తు మాట అనే సాహసం చేయలేదు. 2014 నాటి టీడీపీ మ్యానిఫెస్టోని వెంట పెట్టుకుని తిరుగుతున్న సీఎం.. అప్పుడు టీడీపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయని విచిత్రంగా ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు.

మరోవైపు ఏపీలో కీలక అధికారులపై ఈసీ వేటు వేస్తుంది. జగన్ ఏరికోరి నియమించకున్న ఏపీ డీజీపీ, ఇంటలిజెన్స్ డీజీలపై కూడా బదిలీ వేటు పడింది. ఇక ఇప్పుడు మోడీ ఎదురుదాడి మొదలైంది. ఆ క్రమంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ వాయిస్ మారిపోయింది. ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయన్న నమ్మకం పోతుందని.. అధికారులను ఇష్టానుసారం మార్చేస్తున్నారని వాపోతున్నారు. వైసీపీలో అలజడి మొదలైందనడానికి అదే నిదర్శనం అంటున్నారు విశ్లేషకులు..

Also Read: Sajjala Ramakrishna Reddy: వీళ్లు అసలు మనుషులా..? పిశాచాలా..? : సజ్జల రామకృష్ణారెడ్డి

ఈ పరిస్థితికి తోడు ఎన్నికల టైంలో వైసీపీకి విశాఖ రైల్వే జోన్‌ ఉచ్చు బిగుసుకుంది. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అంటున్న జగనే జోన్‌ రాకుండా అడ్డంపడ్డారన్న ప్రచారం మొదలైంది. గతంలో కేంద్ర మంత్రి రైల్వే జోన్‌కు రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించలేదని ప్రకటించగానే .. వైసీపీ మంత్రులు మీడియా సమావేశాలు పెట్టి మరీ కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేశారు. అయితే తాజాగా ప్రధాని నరేంద్ర మోడీనే రైల్వే జోన్‌ విషయంలో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపై విమర్శలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది.

విశాఖలో రైల్వే ముఖ్య కార్యాలయానికి భూమి అడిగితే ఇవ్వలేదని ప్రధాని తేల్చి చెప్పారు. రైల్వే జోన్‌ స్థలంపై కేంద్ర మంత్రి అబద్ధం చెప్పారని మంత్రి బొత్స వివరణ ఇచ్చిన రోజుల వ్యవధిలోనే .. వైసీపీ డబుల్ గేమ్ అడుతుందనన్న విషయాన్ని ప్రధాని స్పష్టం చేశారు. విశాఖ రాజధాని అంటూ సీఎంఓ కార్యాలయం పేరుతో ప్యాలెస్‌ నిర్మాణానికి రుషికొండనే తవ్వించేసిన జగన్ సర్కారు రైల్వే కార్యాలయానికి ఇవ్వడానికి స్థలం చూపించలేక పోయారా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News