Big Stories

RK Roja Vs Jabardasth Team: రోజా Vs జబర్దస్త్ టీమ్.. చిన్న ప్రాణాలన్నరోజా.. ఆస్కార్ అవార్డులు కొట్టిందా: ఆర్పీ!

Jabardasth Team on RK Roja: సినిమాలు తగ్గిపోయాక.. టీవీ షోలను నమ్ముకుని చాలా కాలం గడిపారు మంత్రి రోజా.. తనకు గుర్తింపు తెచ్చిన సినీ ఇండస్ట్రీపై సీఎం జగన్ పెత్తనం చేయాలని చూసినా .. ఆమె ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. రాజకీయాల్లో ఐరన్ లెగ్ అని బ్రాండ్ వేయించుకున్న ఆమె ఎట్టకేలకు మినిస్టర్ అవ్వగలిగారు. మరోసారి నగరి బరిలో దిగిన రోజా ఎప్పటిలాగే తన వివాదాస్పద వ్యాఖ్యలతో ట్రోల్ అవుతున్నారు. ఇటీవల ఎన్నికల ప్రచారాల్లో సినీ నటులకు ధీటుగా ఫోకస్ అవుతున్నారు టీవీ స్టార్లు ముఖ్యంగా జబర్దస్త్ ఫేంలు తమ పంచ్ డైలాగ్‌తో ఆకట్టుకుంటున్నారు. ఆ క్రమంలో పవన్ అభిమాని హైపర్ ఆదిని చిన్నచూపు చూస్తూ రోజా చేసిన వ్యాఖ్యలు పెద్ద కాంట్రవర్సీకే దారితీస్తున్నాయి.

- Advertisement -

మినిస్టర్ రోజా టీడీపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మాజీ హీరోయిన్ రోజా .. టీడీపీలో ఆమె అడుగుపెట్టారో లేదో చంద్రబాబుపై అలిపిరి వద్ద బాంబు దాడి జరిగింది. ఆ తర్వాత 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. అప్పటికి 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు మాజీ అయ్యారు. తర్వాత కాంగ్రెస్ వరుసగా రెండో సారి అధికారంలోకి రావడంతో రోజా వైఎస్ పంచకు చేరారు. పాపం అదే సమయంలో హెలికాఫ్టర్ ప్రమాదంలో ఆయన దివంగతులయ్యారు. ఆ ఎఫెక్ట్‌తో రోజాకు ఐరెన్ లెగ్ టాగ్ లైన్ వచ్చేసింది.

- Advertisement -

తర్వాత జగన్ బాటపట్టి 2014లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన రోజా .. వైసీపీ అధికారంలోకి రాకపోవడంతో జబర్దస్త్ షోలు చేసుకుంటూ గడిపేశారు .. సినిమాల కంటే జబర్దస్త్ షోలతోనే ఆమె పాపులర్ అయ్యారన్న టాక్ ఉంది.. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచి టీడీపీ, జనసేనలను టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారామె.. మరీముఖ్యంగా జగన్ మెప్పుకోసం జనసేనానిపై ఒంటికాలితో లెగుస్తుంటారు.. పీకే పవర్‌స్టార్ అసలు పార్టీ ఎందుకు పెట్టారో అర్థం కాదని.. చంద్రబాబు వేసిన కుక్క బిస్కెట్ల కోసం పవన్ తోక ఊపుకుంటూ వెళ్లారని యద్దేవా చేస్తుంటారు.

Also Read: ఉద్యోగులు అటా? ఇటా?

జనసేనానిపై రోజా వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జబర్దస్త్ ఫేం హైపర్ ఆది.. ప్రస్తుతం కూటమి అభ్యర్ధులకు మద్దతుగా మద్దతు కూడ చేస్తున్న ఆది.. పవన్ గురించి మాట్లాడే అర్హత లేని వారు కూడా మాట్లాడుతున్నారని కౌంటర్ ఇచ్చారు. పవన్ వ్యక్విత్వాన్ని ఆకాశానికెత్తేస్తూ మాట్లాడారు. పవన్‌కళ్యాణ్ కులాన్ని తాకట్టుపెట్టారనడాన్ని తప్పుపట్టారు. రోజాకు పవన్ సైతం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. యువగళం సభలో డైమంట్ రాణి అని యద్దేవా చేశారు.

ఆ క్రమంలో హైపర్ ఆది ఎన్నికల ప్రచారంలో వైసీపీ మంత్రులకు తమ శాఖలేవో తెలియదని వ్యాఖ్యానించారు. దానిపై స్పందించిన రోజా.. పాపం చిన్న ఆర్టిస్టులు.. చిన్న చిన్న షోలు. పాత్రలు చేసుకొనేవారని తెగ జాలి కురిపించారు. వారిపై ఎందుకు ఈ ప్రతాపాలు.. వారి వెనుక ఎవరు ఉండి ఇవన్నీ అనిపిస్తున్నారో వారిని అనాలి. ఎన్నికల సభల్లో చిన్న చిన్న ఆర్టిస్టులను పిలిచి మాట్లాడించుకొనే పరిస్థితికి పవన్ దిగజారిపోయారని వారు కూడా మెగా కుటుంబంతో విరోధం పెట్టుకుంటే ఇండస్ట్రీలో లేకుండా చేస్తారేమో అన్న భయంతో  ఏది మాట్లాడమంటే అది మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. మంత్రులకు అసలు శాఖలే తెలియవు అని అంటే.. శాఖలు తెలియకుండానే మంత్రులు ఎలా అయ్యామని ప్రశ్నించారు.

Also Read: Vote Festival : ఎంత ఖర్చైనా.. ఊరెళిపోదాం మామ.. ఓటేసేద్దాం మామ..

ఇప్పటికే సినీ ఇండస్ట్రీని తొక్కేయడానికి జగన్ చూస్తున్నారన్న విమర్శలున్నాయి. సినిమా టికెట్ల వ్యవహారంలో చిరంజీవి, మమేష్‌బాబు, ప్రభాస్ వంటి స్టార్ హీరోలు తనకు కలవడానికి వచ్చినప్పుడు జగన్ వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది.. దానిపై ఇప్పటికీ సినీ ప్రముఖులు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.. తాజాగా భారతీయుడు లాంటి మెగా హిట్లు నిర్మించిన ప్రొడ్యూసర్ ఏ ఏం రత్నం కూడా జగన్‌ని టార్గెట్ చేశారు. సినిమా పరిశ్రమ తోక్కాలని జగన్ ప్రభుత్వం ప్రయత్నించిందని రత్నం ఆరోపించారు.

మరోవైపు హైపర్ ఆదిపై రోజా చేసిన వ్యాఖ్యలతో ఆమె అందరికీ టార్గెట్ అవుతున్నారు. జబర్దస్త్ ఫేమ్ ఆర్.పి. ఆమెపై ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు. యువరాణి రోజా గొప్ప నటా..? ఆస్కార్ అవార్డులు కొట్టిందా..? కనీసం గెటప్ శీను , ఆది, సుధీర్ వంటి నటుల కోవలో స్కిట్స్ చేయగలదా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. రోజా మాకు గౌరవం ఇస్తే.. మేము గౌరవిస్తాం. తమని చిన్న నటులని చులకన భావనతో మాట్లాడటం రోజాకు ఎంత మాత్రం తగదని హెచ్చరించారు. వైసీపీలో ఓడిపోయే మొదటి అభ్యర్ధి రోజానేనని.. అమెకు డిపాజిట్లు దక్కవని ధ్వజమెత్తారు.

Also Read: జగన్ ప్రభుత్వానికి బిగ్ రిలీఫ్.. ఆ నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్.. కానీ ?

తనకు రాజకీయ అనుభవం లేదంటున్న ఆర్పీ.. నెల్లూరు టీడీపీ ఎంపీ అభ్యర్ధి వేమిరెడ్డి దంపతుల సర్వీస్ నచ్చి వారికి సపోర్ట్‌గా ప్రచారానికి వచ్చానని వెల్లడించారు. వారు వివాద రహితులు, సౌమ్యులు..‌ వారికి సపోర్ట్ చేసే క్రమంలో రాజకీయాలలో తిరుగుతున్నారని జగన్ ఓడిపోబోతున్నారని జోస్యం చెప్పారు.  విజయసాయి రెడ్డి, బొత్స ,అనిల్ యాదవ్ ఓడిపోబుతున్నారని చెప్పుకొచ్చారు.

జబర్దస్ట్ టీంకి ఉన్న ఫాలోయింగ్ ఇప్పుడున్న చాలా మంది సినీ నటులకు కూడా లేదు. వారికి సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉందో వారి డైలాగ్‌లకు వస్తున్న వ్యూసే స్పష్టం చేస్తుంటాయి. అలాంటి వారితో పెట్టుకుని రిటైర్ అయిపోయిన హీరోయిన్ రోజా ఇప్పుడు తెగ ట్రోలింగ్ అవుతున్నారు.

Also Read: Cash Seizure: తవుడు బస్తాల మధ్య 7 కోట్లు.. సినీ తరహాలో తరలింపు.. చివరికి..?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News