Air India Express: సాముహిక సిక్ లీవ్ లో ఉన్న ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ సిబ్బంది విధుల్లో చేరారు. దీంతో విమాన సేవలు మెరుగుపడే అవకాశం ఉందని.. మంగళవారం నాటికి తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటామని సంస్థ వెల్లడించింది.
అనారోగ్య కారణాలతో సాముహిక సెలవులు తీసుకున్న క్యాబిన్ సిబ్బంది విధుల్లో చేరుతున్నట్లు ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రకటించింది. కంపెనీ షెడ్యులింగ్ సాఫ్ట్ వేర్ లోపం కారణంగా సిబ్బంది సిక్ లీవ్ లో ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు.
టాటా గ్రూప్ యాజమాన్యంలో ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ప్రతి రోజు సుమారు 380 విమానాలను నడిపిస్తోంది. సిబ్బంది సిక్ లీవ్ పెట్టడంతో దాదాపుగా 100 విమాన సర్వీసులు రద్దు చేశారు. ఆదివారం కూడా అధికారులు 20 విమానాలను రద్దు చేశారు.
Also Read: ఢిల్లీలో హై అలర్ట్.. ఎయిర్‌పోర్ట్, 10 ఆసుపత్రులకు బాంబు బెదిరింపు..
ఇదిలా ఉంటే గురువారం ఢిల్లీలో చాఫ్ లేబర్ కమిషనర్ ఏర్పాటు చేసిన సమావేశం తర్వాత క్యాబిన్ సిబ్బంది తమ సమ్మెను విరమించారు. దీంతో సిబ్బందికి జారీ చేసిన టెర్మినేషన్ లేఖను ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉప సంహరించుకున్నట్లు ప్రకటించింది. తిరిగి మంగళవారం నాటికి పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే అవకాశం ఉందని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ అధికారులు తెలిపారు.