Big Stories

Postal Ballot Votes in AP: రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్.. ఏపీ గవర్నమెంట్ ఉద్యోగులు అటా..? ఇటా..?

- Advertisement -

టు బీ ఫ్యాక్ట్ బుధవారంతోనే ఏపీలో పోస్టల్‌ బ్యాలెట్ గడువు ముగిసింది. కానీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు ఈసీని రిక్వెస్ట్‌ చేశారు. ఇంకా ఓటు హక్కు వినియోగించుకునే వారు చాలా మంది ఉన్నారు. సో డెడ్‌లైన్‌ను ఎక్స్‌టెండ్‌ చేయాలని రిక్వెస్ట్ చేశారు. ఈసీ యాక్సెప్ట్ చేసింది. ఉద్యోగులు ఓటింగ్‌ సెంటర్స్‌కు క్యూ కట్టారు. నిజానికి రిజల్డ్స్‌ వచ్చే ముందు రోజు వరకు డేట్‌ను పొడిగించాలన్నారు. బట్ ఈసీ ఈ రిక్వెస్ట్‌ను కొట్టి పారేసింది.

- Advertisement -

నిజానికి ఇది చాలా మంది పరిణామం.. యస్.. ప్రతి ఒక్క ఉద్యోగి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనుకోవడం నిజంగా మంచి పరిణామమే.. అయితే గతంలో లేనట్టుగా ఈసారి తమ ఓటు హక్కును ఎందుకు వినియోగించుకోవాలనుకన్నారు ప్రభుత్వ ఉద్యగులు? ఇంతకీ వారు ఎవరికి ఓటు వేశారు? ఇది మెయిన్ క్వశ్చన్.. ఇదే ఇప్పుడు ఏపీ పొలిటికల్ సర్కిల్స్‌లో జరగుతుఉన్న బిగ్ డిబెట్.. ఓటింగ్ తమకు అనుకూలమంటే.. తమకని అటు కూటమి, ఇటు వైసీపీ నేతుల చెప్పుకుంటున్నారు. కానీ అసలు నిజాలు వేరేలా ఉన్నాయన్న చర్చ జరుగుతుంది.

Also Read: ఆ మిత్రుడే జగన్ ని ఓడిస్తున్నాడా..

ఏపీలో మొత్తం దాదాపు 13 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు 5 లక్షల మంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. ఇందులో 4 లక్షల 30 వేల మంది పోస్టల్ బ్యాలెట్ కోసం రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వీరిలో లక్షా 5 వేల మంది టీచర్లే ఉన్నారు.. 40 వేల మంది పోలీసులు ఉన్నారు. వీరంతా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది డేటా.. ఇప్పుడు డిటెయిల్స్ చూద్ధాం.

2019 ఎన్నికల్లో పోస్టల్ బ్యాలేట్ ఉపయోగించుకున్న వారు 2 లక్షల 38 వేల మంది మాత్రమే.. కానీ ఈ నంబర్‌ ఇప్పుడు డబుల్ అయ్యింది. మాములుగా ప్రభుత్వ ఉద్యోగులు భారీగా ఓట్లు వేస్తున్నారంటే ఎక్కడో తేడా కొడుతుంది. ఎందుకంటే గత అనుభవాలను చూసుకుంటే.. ప్రభుత్వంపై ఉద్యోగులకు పాజిటివ్‌ ఇమేజ్‌ ఉంటే లైట్ తీసుకుంటారు. కానీ వ్యతిరేకత ఉంటేనే తమ కసిని ఓటు రూపంలో చూపిస్తారన్న చర్చ జరుగుతుంది. అందుకే ఓటింగ్ పెరుగుతున్న కొద్ది కూటమి నేతల్లో సంతోషం పెరుగుతుంది. ఇటు వైసీపీ నేతల్లో టెన్షన్‌ కనిపిస్తుందన్న చర్చ జరుగుతోంది.

Also Read: Fighting between Ysrcp vs Tdp cadre: కుప్పంలో దాడులు, పోలీసుల మొహరింపు, ఏం జరుగుతుందోనని..

అయితే బ్యాలెట్ ఓటింగ్‌పై కూడా రాజకీయం మొదలైంది. సైలెంట్‌గా జరిగిపోవాల్సిన ఈ వ్యవహారం.. ఇప్పుడు వివాదానికి కారణమైంది. ఎందుకంటే కొన్ని పార్టీల నేతలు వీరిని కూడా ప్రలోభాలకు గురి చేయాలనుకోవడం.. కొన్ని చోట్ల 5 వేలు.. మరికొన్ని చోట్ల 3 వేలు అంటూ బేరసారాలు నడిచాయి. కొందరికి ఎన్వలప్స్‌లో మరికొందరికి యూపీఐ ద్వారా పేమెంట్స్ అందినట్టు ఆరోపణలు వినిపించాయి. అయితే ఈసీ దీనిపై ఫోకస్ చేసింది.. కొందరు ఉద్యోగులపై చర్యలు కూడా తీసుకుంది.

ఇది నాణేనాకి ఒకవైపు.. మరో వైపు సీన్‌ మరోలా ఉంది. చాలా మంది ఉద్యోగులకు ఫామ్స్‌ అందలేదని తెలుస్తోంది. కావాలనే వారిని తిప్పుతున్నారని.. ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డు పడుతున్నారనేది మరో ఆరోపణ.. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తారన్న భయంతో ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వివాదాలు ఎలా ఉన్నా.. కానీ ఉద్యోగులు చాలా సహనంతో ఆఫీసుల చుట్టు తిరిగారు. అంతే సహనంతో లైన్లలో నిల్చోని ఓట్లు వేశారు. ఇదంతా లోపల ఉన్న అసహనాన్ని బయట పెట్టడానికే అనేది ఇప్పుడు చర్చ.ఇప్పటికే ఈ విషయంపై వైసీపీ నేతల్లో కాస్త టెన్షన్ మొదలైందన్న చర్చ నడుస్తుంది. అయితే వైసీపీ నేతల వాదన మాత్రం మరోలా ఉంది. అధికశాతం ఓట్లు తమకే పోలయ్యాయంటున్నారు ఆ పార్టీ నేతలు. చంద్రబాబు గతంలో ఉద్యోగుల గురించి మాట్లాడిన మాటలు.. చేసిన పనులు అన్నీంటిని వారు మర్చిపోలేదని.. అందుకే మళ్లీ జగన్‌కే జై కొట్టారన్నది వారి మాట.

Also Read: Vote Festival : ఎంత ఖర్చైనా.. ఊరెళిపోదాం మామ.. ఓటేసేద్దాం మామ..

ఎవరి వాదన వారిదే.. ఎవరి నమ్మకాలను వారివే.. ప్రస్తుతం ఉద్యోగుల నిర్ణయం మాత్రం బ్యాలేట్‌ బాక్స్‌ల్లో నిక్షిప్తమైంది. మరి వారి ఓటు ఎవరిని గెలిపిస్తుంది? ఎవరిని విపక్షానికే పరిమితం చేస్తుంది అనేది.. జూన్‌ 4న తేలనుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News