Big Stories

Earthquake: మెక్సికోలో భారీ భూకంపం, రిక్టర్‌ స్కేల్‌పై 6.4 తీవ్రత నమోదు

Earthquake In Mexico: మెక్సికోలో భారీ భూకంపం సంభవించింది. గ్వాటెమాల సరిహద్దులో భూ కంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదైంది. ఒక్క సారిగా భూమి కంపించడంతో జనం తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. నష్టానికి సంబంధిచిన సమాచారాన్ని అధికారులు ఇంకా ప్రకటించలేదు.

- Advertisement -

భారీ భూకంపంతో జనాల ఇండ్లలో నుంచి బయటకు పరుగులు తీసారు. సుచియాట్ నగరంలో భూమి కంపించింది. సుచియాట్ నగరం మెక్సికో-గ్వాటెమాల సరిహద్దులో ఉంటుంది. ఇక్కడ సుచియొట్ నది ప్రవహిస్తుంది. అయితే నది సముద్రంలో కలిసే చోటులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. అంతే కాకుండా గ్వాటెమాలాలో పలు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడ్డాయి.

- Advertisement -

క్వెట్జాల్టెనాంగో ప్రాంతంలోని రహదారులపై కొండ చరియలు విరిగిపడ్డాయని జాతీయ విపత్తు నివారణ సంస్థ తెలిపింది. శాన్ మార్కోస్‌లోని ఒక ఆసుపత్రి సమీపంలో భారీగా భూమి కంపించిందని తెలిపారు. శాన్ క్రిస్టోబాల్‌,చికో పట్టణంలోనూ భూకంప తీవ్రత అధికంగా ఉందని అధికారులు వెల్లడించారు. మెక్సికో యొక్క జాతీయ పౌర రక్షణ సంస్థ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. నష్టానికి సంబంధించిన ప్రాథమిక నివేదికలు అధికారులు వెల్లడించలేదు. యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం భూకంపం 47 మైళ్ల (75 కిలోమీటర్లు) లోతులో 6.4 తీవ్రతను కలిగి ఉంది.

Also Read: బాలుడి మృతదేహాన్ని వదిలి.. పేరెంట్స్ ను తీసుకెళ్లిన విమానం

1985, 2017 సంవత్సరాల్లో మెక్సికోలో భారీ భూకంపాలు నమోదయ్యాయి.సెప్టెంబర్ 19, 1985లో మెక్సికో నగరంలో 8.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. అప్పుడు దాదాపు 10 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు నేలమట్టం అయ్యాయి. 2017 లో 7.1 తీవ్రతతో భూమి కంపించగా..370 మంది మరణించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News