Students Fighting in HCU: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. విద్యార్థుల మధ్య చెలరేగిన చిన్నపాటి ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో స్టూడెంట్స్ గ్రూపుల మధ్య ఫైటింగ్ జరిగింది.
ఈ ఘటనలో పలువురు విద్యార్థులు గాయపడ్డారు. అసలేం జరిగింది? ఘర్షణకు దారితీసిన పరిస్థితులేంటి? రాత్రి ఏబీవీపీ విద్యార్థులు ఏర్పాటు చేసిన చిన్నపాటి కార్యక్రమంలో వివాదం రేగింది. మత విద్వేషాలను రెచ్చగొడుతూ పాటలు పాడడమే ఈ వివాదానికి కారణమని అంతర్గత సమాచారం.
దీంతో ఏబీవీపీ-ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఒకరిపై మరొకరు పంఛ్లు విసురు కున్నారు. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ చివరకు స్టూడెంట్స్ యూనియన్ల వరకు చేరింది.
Also Read: BRS Leaders Migrate: కారులో ఉక్కపోత, కాంగ్రెస్ గూటికి మరో ఎమ్మెల్యే!
పలువురు విద్యార్థులు గాయపడ్డారు. వారిని సమీపంలో ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన విద్యార్థులు కోలుకుంటున్నారు.
హెచ్ సీయూలో విద్యార్థుల మధ్య ఘర్షణ
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ విద్యార్థుల మధ్య ఘర్షణ. ఏబీవీపీ విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెలరేగిన వివాదం. విద్యార్థులకు గాయాలు.. హాస్పిటల్ లో చికిత్స. ఏబీవీపీ,ఎస్ఎఫ్ఐ విద్యార్థులకు సర్దిచెప్పిన పోలీసులు.#HCU… pic.twitter.com/1TSYq8C8P0
— BIG TV Breaking News (@bigtvtelugu) April 18, 2024