BigTV English

Pawan Fans Serious on NTR: తారక్.. ఇది పద్ధతి కాదు.. పవన్ ఫ్యాన్స్ ఫైర్!

Pawan Fans Serious on NTR: తారక్.. ఇది పద్ధతి కాదు.. పవన్ ఫ్యాన్స్ ఫైర్!

Pawan Fans Serious on Jr. NTR: టాలీవుడ్ స్టార్ హీరోల మధ్య ఎప్పుడు ఆరోగ్యకరమైన పోటీ ఉంటుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. సినిమాలు పరంగా థియేటర్ లో ఏమైనా పోటీ పెడతారేమో కానీ, వ్యక్తిగతంగా అందరు స్నేహితులుగా , అన్నదమ్ములుగా ఉంటారు. ఒకరి పుట్టినరోజున మరొకరు విషెస్ చెప్పుకుంటూ ఉంటారు. రిప్లైలు ఇచ్చుకుంటూ ఉంటారు. ఇది చూసి ఇరు హీరోల ఫ్యాన్స్ మురిసిపోతూ ఉంటారు. కానీ, ఒకరు విష్ చేస్తే .. మరొకరు రిప్లై ఇవ్వకపోతేనే ఎక్కడ లేని అనుమానాలు పుట్టుకొస్తాయి.


తాజాగా ఎన్టీఆర్ – పవన్ అభిమానుల మధ్య ఇలాంటి వాతావరణమే నెలకొంది. నిన్న ఎన్టీఆర్ బర్త్ డే అన్న విషయం తెల్సిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు కూడా బర్త్ డే విషెస్ తెలిపారు. అందులో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్.. సినీ, రాజకీయ ప్రముఖుల పుట్టినరోజులును గుర్తుపెట్టుకొని మరీ బర్త్ డే విషెస్ చెప్పుకొస్తున్నారు. అలాగే నిన్న తారక్ కు కూడా బర్త్ డే విషెస్ తెలిపారు.

“ప్రముఖ కథానాయకుడు శ్రీ ఎన్టీఆర్ గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆస్కార్ పురస్కారాలు అందుకున్న ‘ఆర్.ఆర్.ఆర్.’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో సినీప్రియుల మెప్పు పొందారు. తనదైన అభినయం, నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న శ్రీ ఎన్టీఆర్ గారు మరిన్ని విజయాలు అందుకోవాలని, సంపూర్ణమైన సంతోషాన్ని పొందాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను” అంటూ రాసుకొచ్చారు.


Also Read: Kajal Aggarwal: హీరోయిన్‌కు చేదు అనుభవం.. అతడు నేరుగా వ్యాన్‌లోకి వచ్చి చొక్కా విప్పేసరికీ..

ఇక నిన్నటి నుంచి ఏ సెలబ్రిటీ విష్ చేసినా కూడా ఎన్టీఆర్ వెంటనే రిప్లై ఇస్తూ వచ్చాడు. కానీ, పవన్ ట్వీట్ కు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. ఎందుకు తారక్ ఇలా చేస్తున్నావ్.. ఇది పద్దతిగా లేదు. రాజకీయాలకు అతీతంగా ఉంటున్నావ్ సరే .. ఇదేమీ రాజకీయం కాదు. కేవలం ట్వీట్ నే కదా.. రిప్లై ఎస్టీ ఏమౌతుంది అంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఇక దీనికి ఎన్టీఆర్ అభిమానులు.. తప్పుగా అనుకోకండి బ్రో.. చాలా ట్వీట్స్ లో ఇదొక్కటి మిస్ అయ్యి ఉంటుంది.. ఇందులో ఏముంది.. తారక్ చూసి ఉంటే కచ్చితంగా రిప్లై ఇచ్చేవాడు అని చెప్పుకొస్తున్నారు. మరి తారక్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక మతలబు ఏంటి అనేది తెలియాల్సి ఉంది.

Related News

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

The Big Folk Night 2025 : ఎల్బీ స్టేడియంలో జానపదాల ఝల్లు.. ‘బిగ్ టీవీ’ ఆధ్వర్యంలో లైవ్ ఫోక్ మ్యూజికల్ నైట్ నేడే!

Social Look: నీటి చినుకుల్లో తడిచి ముద్దయిన దీప్తి.. రాయల్ లుక్‌లో కావ్య.. బికినీలో ప్రగ్యా!

Jr NTR controversy: జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే కామెంట్స్.. నారా రోహిత్ స్పందన ఇదే!

Venuswamy: గుడి నుంచి తరిమేశారు… వేణు స్వామికి ఘోర అవమానం.. ఎక్కడంటే ?

Sitara Ghattamaneni : అది నేను కాదు… దయచేసి నమ్మి మోసపోకండి

Big Stories

×