Big Stories

Manish Sisodia: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎంకు మరోసారి షాక్

Delhi high court denies bail to Manish Sisodia: ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు మరోసారి షాక్ తగిలింది. ఢిల్లీ మద్యం కుంభకోణంపై సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్న కేసుల్లో తనకు బెయిల్ మంజూరు చేయాలని మనీశ్ సిసోడియా దాఖలు చేసిన పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. అదేవిధంగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీశ్ సిసోడియా కీలక సాక్షాధారాలను ధ్వంసం చేశాడని హైకోర్టు పేర్కొన్నది. అయితే, అంతకముందు దిగువ న్యాయస్థానం మనీశ్ సిసోడియా జ్యుడీషియల్ రిమాండ్ ను ఈ నెల ఆఖరు వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారి చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

అయితే, సీబీఐ అరెస్ట్ చేసిన తరువాత ఫిబ్రవరి 26, 2023 నుంచి మనీశ్ సిసోడియా కస్టడీలోనే ఉన్నారు. ఆ తరువాత ఈడీ అతడిని అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 28, 2023న ఆయన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, సిసోడియాతోపాటు కస్టడీలో ఉన్నటువంటి ఇతర నిందితులను జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు హాజరుపరిచారు.

- Advertisement -

మనీశ్ సిసోడియాపై ఉన్న కేసు వివరాలు..

ఢిల్లీ ఎక్సైజ్ పాలసీని సవరించేటప్పుడు అవకతవకలు జరిగాయని, లైసెన్స్ హైల్డర్స్ కు అనవసరమైన ప్రయోజనాలు కల్పించారని, లైసెన్స్ ఫీజు మినహాయింపు లేదా తగ్గింపు, అదేవిధంగా ఎల్- 1 లైసెన్స్ ను కాంపిటెంట్ అథారిటీ అనుమతి లేకుండా పొడిగించారని దర్యాప్తు సంస్థలు ఆరోపించిన విషయం తెలిసిందే.

కాగా, ఇదే కేసు విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు వరుసగా షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. సీబీఐ కేసులో కవితకు జ్యుడీషియల్ రిమాండ్ ను మరోసారి కోర్టు పొడిగించిన విషయం తెలిసిందే. జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ సీబీఐ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్ ను సోమవారం న్యాయం స్థానం పరిగణలోనికి తీసుకుని విచారించింది. విచారణ అనంతరం ఆమెకు ఈడీ, సీబీఐ .. రెండు కేసుల్లో జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, కవిత బెయిల్ కోసం ఆమె తరఫు న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఆమె బెయిల్ పిటిషన్ రిజెక్ట్ అయిన విషయం విధితమే.

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News