Big Stories

17 Killed in Russian Missile Attack: ఉక్రెయిన్ పై రష్యా మిస్సైల్ అటాక్.. 17 మంది మృతి!

Ukraine Says 17 killed in Russian Missile Attack on Chernihiv: ఉక్రెయిన్ – రష్యా యుద్ద దాడులు కొనసాగుతున్న వేళ.. తాజాగా ఉక్రెయిన్ లోని చెర్నివ్ సిటీపై రష్యా 3 మిస్సైల్స్ తో విరుచుకు పడింది. రష్యా క్షిపణి దాడిలో కనీసం 17 మంది మరణించారు. ఎనిమిది అంతస్తుల బిల్డింగ్ పై మాస్కో క్షిపణులు ప్రయోగించడంతో.. ఈ దాడిలో ముగ్గురు చిన్నారులు సహా 60 మంది పైగా గాయపడ్డారని ఉక్రెయిన్ ఎమర్జెన్సీ సర్వీస్ పేర్కొంది.

- Advertisement -

చెర్నిహివ్ రష్యా , బెలారస్ సరిహద్దుకు సమీపంలో రాజధాని కైవ్‌కు ఉత్తరాన 150కిమీ (90 మైళ్ళు) దూరంలో ఉంది. అందులో దాదాపు 250,000 మంది జనాభా ఉన్నారు. ఉక్రెయిన్ జరుగుతున్న యుద్ధం మూడవ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఇప్పటికీ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ యుద్దంలో రష్యా మాత్రం తన సత్తాచాటుతుంది.

- Advertisement -

Also Read: ఆమెని వదలను.. ఆర్మీ చీఫ్‌కు ఇమ్రాన్ వార్నింగ్

కాని ఉక్రెయిన్ మాత్రం ఆయుధాల కొరతతో ఇబ్బంది పడి దాడులకు వెనకడుగు వేస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చెక్ రిపబ్లిక్ ప్రధాని పీటర్ ఫియాలా తాము ఉక్రెయిన్ కు ఐదు లక్షల ఫిరంగి షెల్స్ ను పంపించనున్నట్లు ఆయన తెలిపారు.

ఈ దాడిలో భవనాలు, కార్లు, మునిసిపల్ మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని ఇహోర్ క్లైమెన్కో పేర్కొన్నారు. ఈ దాడిలో ఎక్కువమంది ప్రజలు గాయపడ్డారని ఆయన తెలిపారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని ఆయన తెలిపారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News