Big Stories

KKR Vs SRH Qualifier-1 Highlights: కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ తడ’బ్యాటు’.. 13.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించిన కోల్‌కతా

IPL 2024 Qualifier-1 KKR won By 8 Wickets Against SRH: గుజరాత్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతున్న తొలి క్వాలిఫైయర్ మ్యాచ్‌లో కోల్ కతా ఘనవిజయం సాధించింది. కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ బ్యాటర్లు చేతులెత్తేశారు. క్వాలిపైయర్-1 మ్యాచ్‌లో160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్ కతా 13. 4 ఓవర్లో లక్ష్యాన్ని చేధించింది. శ్రేయాస్ అయ్యర్ (58*, 24 బంతుల్లో), వెంకటేశ్ అయ్యర్ (51*, 28 బంతుల్లో) రాణిచడంతో ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని చేధించింది కేకేఆర్. ఈ మ్యాచ్ గెలిచి కేకేఆర్ ఫైనల్‌కు చేరుకుంది.

- Advertisement -

అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్ హైదరాబాద్ తడబడింది. త్రిపాఠి(55), క్లాసెన్(32), కమిన్స్(30) రాణిచడంతో SRH 19.3 ఓవర్లలో 159 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. కోల్ కతా ముందు 160 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.

- Advertisement -

160 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ దూకుడుగా ఇన్నింగ్స్‌ను ఆరంభించింది. తొలి వికెట్‌కు గుర్భాజ్, సునీల్ నరైన్ 3.2 ఓవర్లలోనే 44 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జంటను నటరాజన్ విడదీశాడు.

Also Read: Rahul Tripathi emotional tears: రాహుల్ కంటతడి.. మరో ఛాన్స్ ఉందంటూ..

  • పవర్ ప్లే ముగిసేసరికి కోల్ కతా వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది.
  • కమిన్స్ వేసిన 7వ ఓవర్ తొలి బంతికి ఫోర్ కొట్టిన నరైన్(21) రెండో బంతికి అవుట్ అయ్యాడు. దీంతో 7 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ స్కోర్ 74/2
  • వియస్కాంత్ వేసిన 8వ ఓవర్ రెండో బంతికి వెంకటేశ్ అయ్యర్ భారీ సిక్సర్ కొట్టాడు. దీంతో 8 ఓవర్లు ముగిసే సరికి కేకేఆర్ స్కోర్ 85/2
  • కమిన్స్ వేసిన ఇన్నింగ్స్ 9వ ఓవర్లో 11 పరుగులు రావడంతో కేకేఆర్ స్కోర్ 96/2
  • వియస్కాంత్ వేసిన 10వ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ అవుట్ నుంచి తప్పించుకున్నాడు,. కానీ చివరి బంతికి వెంకటేశ్ అయ్యర్ సిక్స్ బాదాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ స్కోర్ 107/2
  • నటరాజన్ వేసిన 11వ ఓవర్లో 4 పరుగులు రాగా.. హెడ్ వేసిన 12వ ఓవర్లో 10 పరుగులు వచ్చాయి. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ స్కోర్ 129/2
  • నితీశ్ రెడ్డి వేసిన 13వ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ ఫోర్ బాదాడు. సిక్స్ తో వెంకటేశ్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో 13 ఓవర్లు ముగిసేసరికి కేకేఆర్ స్కోర్ 142/3

హెడ్ వేసిన 14వ ఓవర్లో శ్రేయాస్ అయ్యర్ 6,4,6,6 బాదడంతో టార్గెట్ చేధించింది. ఈ క్రమంలోనే శ్రేయాస్ అయ్యర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.

Also Read: IPL 2024 Eliminator, RR vs RCB Match Preview: నేడే ఎలిమినేటర్.. బెంగళూరు జోరుకు రాజస్థాన్ బ్రేకులు వేస్తుందా..?

అంతకుముందు టాస్ గెలిచి SRH బ్యాటింగ్ ఎంచుకుంది. ఫామ్‌లో ఉన్న ఇద్దరు ఓపెనర్లు తక్కువ స్కోర్‌కే వెనుదిరిగారు. హెడ్ డకౌట్ అవ్వగా.. అభిషేక్ శర్మ 3 పరుగులు మాత్రమే చేశాడు. SRH ఇన్నింగ్స్ వివరాలు

  • మిచెల్ స్టార్క్ వేసిన తొలి ఓవర్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ డకౌట్ అయ్యాడు. రెండో బంతికే బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత బ్యాటింగ్‌‌కు వచ్చిన త్రిపాఠి రెండో బంతి, ఓవర్ చివరి బంతికి బౌండరీలు సాధించాడు.
  • వైభవ్ అరోరా వేసిన రెండో ఓవర్లో అభిషేక్ శర్మ(3) అవుట్ అయ్యాడు. ఈ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో రెండు ఓవర్లు ముగిసేసరికి SRH స్కోర్ 13/2
  • మిచెల్ స్టార్క్ వేసిన 3వ ఓవర్లో త్రిపాఠి బౌండరీ సాధించి.. ఎల్బీ ప్రమాదం నుంచి  తప్పించుకున్నాడు. దీంతో 3 ఓవర్లు ముగిసేసరికి SRH స్కోర్ 21/2

Also Read: KKR vs SRH Qualifier-1 Highlights: కీలక మ్యాచ్‌లో హైదరాబాద్ తడ’బ్యాటు’.. 13.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించిన కోల్‌కతా..

  • వైభవ్ అరోరా వేసిన 4వ ఓవర్లో త్రిపాఠి నోబాల్ ని ఫోర్ గా మలిచాడు. మరోవైపు నితీశ్ రెడ్డి ఆచితూచి ఆడాడు. మొత్తంగా ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. దీంతో 4 ఓవర్లు ముగిసేసరికి SRH స్కోర్ 33/2
  • మిచెల్ స్టార్క్ వేసిన 5వ ఓవర్ తొలి బంతికే నితీశ్ రెడ్డి ఫోర్ కొట్టాడు. ఇదే ఓవర్లో నితీశ్(9) భారీ షాట్‌కు ప్రయత్నించి అవుట్ అయ్యాడు. ఆ తరువాతి బాల్‌కి షాబాజ్ అహ్మద్ గోల్డెన్ డక్ అయ్యాడు. దీంతో 5 ఓవర్లు ముగిసేసరికి SRH స్కోర్ 39/4
  • హర్షిత్ రాణా వేసిన 6వ ఓవర్లో క్సాసెన్ ఫోర్‌తో ఖాతా తెరిచాడు. పవర్ ప్లే ముగిసేసరికి SRH స్కోర్ 45/4
  • పవర్ ప్లే ముగియడంతో శ్రేయాస్ అయ్యర్ బంతిని స్పిన్నర్ సునీల్ నరైన్ కు అందించాడు. నరైన్ వేసిన 7వ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే వచ్చాయి. దీంతో 7 ఓవర్లు ముగిసేసరికి SRH స్కోర్ 50/4
  • హర్షిత్ రాణా వేసిన 8వ ఓవర్లో త్రిపాఠి SRH ఇన్నింగ్స్‌లో తొలి సిక్స్‌ను కొట్టాడు. మొత్తంగా ఈ ఓవర్లో 12 పరుగులు వచ్చాయి. దీంతో 8 ఓవర్లు ముగిసేసరికి SRH స్కోర్ 62/4
  • టైమౌట్ (Time Out)

Also Read: Shane Watson Apologizes RCB Fans: ‘నా వల్లే అంతా..’ ఆర్సీబీ అభిమానులకు షేన్ వాట్సన్ క్షమాపణలు..

  • సునీల్ నరైన్ వేసిన 9వ ఓవర్లో త్రిపాఠి స్కూప్ ఆడి బౌండరీ సాధించాడు. క్లాసెన్ 5వ బాల్‌కి సిక్స్, చివరి బాల్‌కి ఫోర్ సాధించాడు. మొత్తంగా ఈ ఓవర్లో 18 పరుగులు వచ్చాయి. దీంతో 9 ఓవర్లు ముగిసేసరికి SRH స్కోర్ 80/4
  • రస్సెల్ వేసిన 10వ ఓవర్లో క్లాసెన్ షార్ట్ బాల్‌ని ఫోర్ గా మలిచాడు. ఆ తరువాత కీపర్ మీదుగా త్రిపాఠి అద్భతమైన బౌండరీ సాధించాడు. దీంతో 10 ఓవర్లు ముగిసేసరికి SRH స్కోర్ 92/4
  • వరుణ్ చక్రవర్తి వేసిన 11వ ఓవర్లో త్రిపాఠి బౌండరీతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అలాగే SRH స్కోర్ వంద పరుగుల మార్క్‌ను దాటింది. చివరి బంతికి క్లాసెన్(32) అవుట్ అయ్యాడు. దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి SRH స్కోర్ 101/5
  • నరైన్ వేసిన 12వ ఓవర్లో సమద్ సిక్స్‌తో ఖాతా తెరిచాడు. దీంతో 12 ఓవర్లు ముగిసేసరికి SRH స్కోర్ 110/5
  • వరుణ్ చక్రవర్తి వేసిన 13వ ఓవర్లో కేవలం 5 పరుగులు మాత్రమే రావడంతో 13 ఓవర్లకు SRH స్కోర్ 115/5
  • టైమౌట్ (Time Out)

Also Read: SRH Playoff Performance in IPL History: ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌లో సన్‌రైజర్స్ ప్రయాణం.. రెండో సారి కప్ కొట్టేనా..?

  • టైమౌట్ తర్వాత తొలి బంతికే సమద్ నరైన్ బౌలింగ్‌లో సిక్స్ బాదాడు. ఆ తరువాత బంతికి సమన్వయ లోపంతో త్రిపాఠి రనౌట్ అయ్యాడు. దీంతో SRH ఆరో వికెట్ కోల్పోయింది. ఇంపాక్ట్ సబ్‌గా వచ్చిన సన్వీర్ సింగ్ తొలి బంతికే డకౌట్ అయ్యాడు. 14 ఓవర్లు ముగిసేసరికి SRH స్కోర్ 123/7
  • హర్షిత్ రాణా వేసిన 15వ ఓవర్లో సమద్(16) అవుట్ అయ్యాడు. దీంతో SRH 8వ వికెట్ కోల్పోయింది. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి స్కోర్ SRH 125/8
  • వరుణ్ చక్రవర్తి వేసిన 16వ ఓవర్ చివరి బంతికి భువనేశ్వర్ ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో హైదరాబాద్ 9 వికెట్లు కోల్పోయింది.
  • వైభవ్ అరోరా వేసిన 17వ ఓవర్లో కేవలం కమిన్స్ బౌండరీ సాధించడంతో ఏడు పరుగులు వచ్చాయి. దీంతో 17 ఓవర్లు ముగిసేసరికి SRH స్కోర్ 133/9
  • వరుణ్ చక్రవర్తి వేసిన 18వ ఓవర్ తొలి బంతికే కమిన్స్ సిక్స్ బాదాడు. దీంతో ఈ ఓవర్లో 11 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్లో ముగిసేసరికి SRH స్కోర్ 144/9
  • స్టార్క్ వేసిన 19వ ఓవర్లో కమిన్స్ కీపర్ మీదుగా సిక్స్ కొట్టాడు. దీంతో 19వ ఓవర్ ముగిసేసరికి SRH స్కోర్ 156/9
  • రస్సెల్ వేసిన 20వ ఓవర్లో 3వ బంతికి కమిన్స్ అవుట్ అవ్వడంతో సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ ముగిసింది.

Also Read: IPL 2024 Playoffs: టీ 20 ప్రపంచకప్ కు ఎంపికైన వారిలో.. ఐదుగురే ఐపీఎల్ 2024 ప్లే ఆఫ్ ఆడుతున్నారు!

త్రిపాఠి హాఫ్ సెంచరీతో రాణించడంతో SRH ఆమాత్రం స్కోర్ అయినా చేయగలిగింది. కోల్ కతా బౌలర్లలో స్టార్క్ 2, వరుణ్ చక్రవర్తి 2, వైభవ్ అరోరా, రాణా, రస్సెల్, నరైన్ తలో వికెట్ తీసుకున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News