Big Stories

Rave Parties: రేవ్‌ పార్టీలు.. గొప్పోళ్ల గలీజ్ పార్టీలు

Tollywood Actors in Bangalore Rave Party: ఎక్కడ డ్రగ్స్ పార్టీలు.. రేవ్‌ పార్టీలు జరిగినా.. దాని మూలాలు హైదరాబాద్‌లో కనిపించడం ఇప్పుడు కామన్‌ అయిపోయింది. లెటెస్ట్‌గా బెంగళూరులో రేవ్ పార్టీ జరిగితే.. మళ్లీ మన తెలుగు ఇండస్ట్రీవాళ్లే కనిపించడం ఇప్పుడు హాట్‌ టాపిక్.. ఇంతకీ అసలు బెంగళూరులో ఏం జరిగింది? అందులో ఉన్న తెలుగు ప్రముఖులు ఎవరు?

- Advertisement -

హోరెత్తించే మ్యూజిక్.. మిణుకు మిణుకుమనే లైటింగ్స్.. లైట్ల వెలుగుల్లో వేసే డ్యాన్స్ లు.. విజువల్ ఎఫెక్ట్స్.. ఫాగ్ మెషీన్ల మధ్య తాగుతూ.. తూగుతూ లోకం తెలియకుండా ఎంజాయ్ చేసేదే రేవ్ పార్టీ.. ఇందులో అప్పుడప్పుడు డ్రగ్స్ కూడా వాడుతుంటారు. వీటికి శివారు ప్రాంతాలు ఫామ్‌హౌస్‌లు వెన్యూలు.. మరి అందరికి వెల్‌కమ్ చెబుతారా..? నో.. ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్.. డబ్బున్నవారికి మాత్రమే ఎంట్రీ.. ఈ పార్టీలు 24 గంటల నుంచి మూడు రోజుల దాకా నాన్ స్టాప్‌గా సాగుతుంటాయి.

- Advertisement -

ఇప్పుడీ కల్చర్‌లో ఓ అడుగు ముందుకు పడింది. డ్రగ్స్‌తో పాటు.. అశ్లీల నృత్యాలు చేరాయి. అసభ్య పనులకు కేరాఫ్‌గా మారాయి. సింపుల్‌గా చెప్పాలంటే ఎంత డబ్బుంటే అంత ఎంజాయ్‌మెంట్.. ఇలాంటి పార్టీనే ఇప్పుడు లెటెస్ట్‌గా బెంగళూరులో జరిగింది. అక్కడ దొరికిన వారంతా తెలుగు వీఐపీలు.. పలువరు మోడల్స్.. అయితే ఇందులోకొందరు వీవీఐపీలు ఉండటమే ఇప్పుడు హైలేట్.. మొత్తం వంద మందిలో 70 మంది మేల్స్.. 31 మంది ఫీమెల్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

Also Read: Karate Kalyani: నన్నుపేకాట ఆడానని చెప్పింది.. బెంగుళూరు రేవ్ పార్టీలో హేమ ఏం చేసింది.. దులిపేసిన కరాటే కళ్యాణి

బెంగళూరులో నిర్వహించిన రేవ్ పార్టీపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు రెయిడ్స్ చేశారు. ఇందులో దొరికిన వారిలో ఇప్పటి వరకు ఓ తెలుగు నటి.. పలువరు రాజకీయ నేతలు ఉన్నారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలోని ని GR ఫామ్ హౌస్‌లో నిర్వహించారు ఈ రేవ్ పార్టీ.. కాన్ కార్డ్ యజమాని గోపాల్ రెడ్డికి చెందినదని ఈ ఫామ్ హౌస్.. తనిఖీల్లో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు సీసీబీ పోలీసులు.. దాదాపు వంద మంది పాల్గొన్నారు ఈ పార్టీలో.. అయితే సీసీబీ పోలీసులు.. చాలా మందిని మీడియా కంట పడకుండా చేశారు. అయితే మూవీ ఆర్టిస్టు హేమ అందులో ఉన్నారన్న ప్రచారం జరిగింది.అయితే ఆమె దీనిని కొట్టి పారేశారు.

ఆమె చాలా కాన్ఫిడెంట్‌గా తన తప్పేం లేదన్నారు. ఆ పార్టీలో పాల్గొనలేదన్నారు. ఫామ్‌హౌజ్‌లో ఎంజాయ్ చేస్తున్నానన్నారు. బట్ ఆమె బెంగళూరులోని ఓ పోలీస్ స్టేషన్‌లోనే ఉన్నట్టు తేలింది.హేమ రికార్డు చేసిన వీడియోలో ఉన్న డ్రస్‌తోనే పోలీస్ స్టేషన్‌లో కూర్చున్న ఫోటోను బెంగళూరు పోలీసులు రిలీజ్ చేశారు. దీంతో పరువు పోగొట్టుకున్నట్లయ్యింది. అలా ఉంటుంది మన తెలుగు ఆర్టిస్టులతో.. ఇక మరికొందరి వీఐపీల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఇంకా కొందరి పేర్లు కన్ఫామ్ కాలేదు కాబట్టి ఇప్పుడు చెప్పడం లేదు. సోషల్ మీడియాలో మాత్రం రకరకాల పేర్లు జోరుగా ప్రచారం అవుతున్నాయి.

Also Read: రేవ్ పార్టీలో హీరో శ్రీకాంత్.. క్లారిటీ వచ్చేసింది

ఇదీ జరిగింది.. ఇప్పుడు వీరందరికి బ్లెడ్ టెస్ట్‌లు చేశారు. రిజల్ట్స్ వచ్చేవరకు వెయిట్ చేస్తారు. ఫుల్ డిటేయిల్స్ తీసుకొని వారికి బెయిల్‌ ఇచ్చి వదిలేస్తారు. వారికి వచ్చిన పెద్ద ప్రాబ్లమ్ కూడా ఏం లేదు..
ఒకవేళ డ్రగ్స్ వాడినట్టు తెలిసినా కౌన్సిలింగ్ ఇస్తున్నారు. చాలా రేర్‌గా మాత్రమే శిక్షలు పడే అవకాశం ఉంది. అయితే ఇది కాదు అసలు సమస్య.. అసలు సమస్య ఏంటంటే.. ఎందుకు ఈ రేవ్‌ పార్టీల్లో పాల్గొంటున్నారు తెలుగు ఇండస్ట్రీకి చెందినవారు? ఎందుకీ కల్చర్‌ను ఎంకరేజ్ చేస్తున్నారు..?

రేవ్ పార్టీల్లో ఎక్కువగా పాల్గొంటున్నవారు మూవీ ఇండస్ట్రీ వారే ఉంటున్నారు. ముంబై, గోవా, బెంగళూర్, హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో ఈ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతుంది. బర్త్ డేలు.. మ్యారేజ్ డేలు ఇలా ఏదో ఒక అకేషన్ పేరిట పార్టీ ఏర్పాటు చేయడం.. మత్తులో తూగుతూ చిత్తవడం నిషేధిత డ్రగ్స్ వినియోగించడం కామన్ అయిపోయింది. రేవ్ పార్టీల పేరిట ఇండస్ట్రీకి చెందిన వారు పట్టుబడటం కామన్‌గా మారింది. భారీ మొత్తంలో నిషేధిత డ్రగ్స్ కూడా దొరుకుతున్నాయి. పోలీసులు కేసులు పెడుతున్నారు. ఆ తర్వాత ఆ విషయం కనుమరుగవుతోంది.

Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ఏం జరుగుతోంది..? స్పీడ్ తగ్గిందా..? లేక..?

ఇక రీసెంట్‌గా హైదరాబాద్‌ చుట్టుపక్కల కూడా ఈ పార్టీలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా ORR పరిసరాలు, ఎయిర్ పోర్టు ఏరియాల్లో ఫామ్ హౌస్ లు ఉన్నాయి. వాటిలో రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నారు. పోలీసుల రెయిడ్స్‌లో తరచూ పట్టుబడుతున్నారు. అయినా తీరు మారడంలేదు. డబ్బు, అధికారాన్ని ఉపయోగించడం.. బయటపడటం కామన్‌గా మారింది. ఇక హైదరాబాద్‌లో చాల దన్నట్టు
ఇప్పుడు పక్క రాష్ట్రాలకు వెళ్లి అక్కడ కూడా టాలీవుడ్ పరవు తీయడం అవసరమా? దయచేసి ఇప్పటికైనా తీరు మార్చుకొండి.. జీవితాలను నాశనం చేసే ఈ దరిద్రపు కల్చర్‌ను వదలండి. మిమ్మల్ని చూసి ఫాలో అయ్యేవారు చాలా మంది ఉన్నారు. దాన్ని తెలుసుకొని మసులుకోవడం కొంచెం బెటర్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News