Big Stories

BRS Leaders Migrate: కారులో ఉక్కపోత.. కాంగ్రెస్ గూటికి మరో ఎమ్మెల్యే..!

BRS Leaders Migrate: లోక్‌సభ ఎన్నికలయ్యేలోపు కారు పార్టీ ఖాళీ అవుతుందని కాంగ్రెస్ నేతలు  బలంగా చెబుతున్నమాట. నేతలు అన్నట్లుగానే రోజుకో నేత ఆ పార్టీకి బై బై చెప్పేస్తున్నారు. ఈ జాబితాలో చాలామంది నేతలు ఉన్నట్లు సమాచారం. గురువారం ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి వంతు కాగా ఇప్పుడు రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్‌‌గౌడ్ వంతు కానుంది.

- Advertisement -

తెలంగాణలో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో విపక్ష బీఆర్ఎస్ నుంచి నేతలు వలస పోతున్నారు.
ముఖ్యంగా ఆ పార్టీలోని సీనియర్లు, ఎమ్మెల్యేలు, మాజీలు ఇప్పటికే కొందరు కాంగ్రెస్ వైపు, మరికొందరు కమలం వైపు మొగ్గుచూపుతున్నారు. ఇందుకు కారణాలు చాలానే ఉన్నాయి. ఎవరినీ సంప్రదించకుండా అధినేత నిర్ణయాలు తీసుకోవడమే దీనికి కారణంగా చెబుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు కనీసం  ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ దొరకని పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి రాంరాం చెప్పేస్తున్నారు.

- Advertisement -
BRS MLA Prakash Goud Joining to Congress party soon
BRS MLA Prakash Goud Joining to Congress party soon

ఎన్నికల ముందు పార్టీ‌ మారకపోతే ఆ తర్వాత లైఫ్ ఉండదని భావించారు బీఆర్ఎస్ పార్టీలోని కొందరు నేతలు. ఈ క్రమంలో కాంగ్రెస్ ముఖ్యనేతలతో భేటీ తర్వాత ముఖ్యమంత్రి సమావేశం అవుతున్నారు. జనవరి నాలుగోవారంలో రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్.. సీఎం రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. ఇరువురు నేతల మధ్య దాదాపు అరగంటకు పైగానే భేటీ జరిగింది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్ త్వరలో కాంగ్రెస్ గూటికి చేరడం ఖాయమని వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆ వార్తలను ఆయన వర్గీయులు ఖండించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికు అభినందనలు చెప్పడానికి వెళ్లారని, అందులో ఏమీలేదని చెప్పుకొచ్చారు.

Also Read: ప్రసాదం ప్రభావం.. చిలుకూరులో భారీగా ట్రాఫిక్ జామ్

తాజాగా బిగ్ టీవీకి అందుతున్న సమాచారం మేరకు రేపోమాపో ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్.. సీఎం రేవంత్  సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. అందుకు గ్రౌండ్ వర్క్ పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ నాటికి కారు పార్టీ ఖాళీ అయినా ఆశ్చర్యపోనర్కర్లేదని అంటున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News