BigTV English

Bihar Teacher: దారుణం.. విడవకుండా విచక్షణారహితంగా.. అలా చేసి చంపేశాడు

Bihar Teacher: దారుణం.. విడవకుండా విచక్షణారహితంగా.. అలా చేసి చంపేశాడు

Man stabs woman teacher to death: వివాహ కార్యక్రమం ఎంతో గొప్పది. అందుకే ధర్మేచ, అర్థేచ, కామేచ, నాతి చరామి అంటూ అగ్ని సాక్షిగా ఏడడుగులు వేసి ఒక్కటవుతుంటారు. ఆ ఏడడుగులకు ఒక్కో అర్థం దాగి ఉంటుంది. దంపతులుగా మారుతున్న వారిద్దరూ జీవితాంతం ఆనందంగా ఉండాలనేది వాటి అర్థం. అంతేకాదు.. వారి మధ్య ఎలాంటి విబేధాలు వచ్చినా వాటిని పరిష్కరించుకుంటూ మంచిమనసుతో ముందుకెళ్లి అన్యోన్యంగా ఉండాలనేది కూడా వాటి అర్థం.


సుఖ సంతోషాలే కాదు.. బాధ్యతలు, బాధలు, దుఖాలు, పిల్లలు ఇలా అన్ని విషయాలలోనూ బాధ్యతగా ఉండాలని సూచిస్తారు పెళ్లి సమయంలో. అందుకే పెళ్లి అంటే మహోన్నతమైన కార్యక్రమంగా పరిగణిస్తారు. కానీ, ఓ వ్యక్తి వీటన్నిటినీ మరిచిపోయి దారుణంగా ప్రవర్తించాడు. కృూరమృగంలా ప్రవర్తించి భార్యను అతిదారుణంగా హత్య చేశాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భార్యపై కత్తితో దాడి హత్యా చేశాడు. అంతేకాదు..ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. భార్య పూజ చేసేందుకు గుడికి వెళ్తున్న క్రమంలో భర్త ఇలా దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.

ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తూర్పు బీహార్ లోని కతిహార్ కు చెందిన ఓ మహిళ స్కూల్ టీచర్ గా పనిచేస్తూ ఉంది. అయితే, ఆమె మంగళవారం తెల్లవారుజామున పూజ చేసేందుకు అని గుడికి వెళ్తూ ఉంది. ఈ క్రమంలో ఆమె భర్త అడ్డగించాడు. అనంతరం కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమె ప్రతిఘటించినా కూడా వదలకుండా విచక్షణారహితంగా ముఖంపై, కడుపు, మెడపై కత్తితో పొడిచి హత్య చేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. దుండగుడు అంతటితో ఆగకుండా ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.


Also Read: ఎన్నికల వేళ బ్రిజ్‌ భూషణ్‌‌కు భారీ షాక్ !

విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడైనటువంటి ఆమె భర్తను అదుపులోకి తీసుకున్నారు. అయితే, గత కొద్దిరోజులుగా వారి మధ్య గొడవులు జరుగుతున్నాయని, ఈ క్రమంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఆమెపై కత్తితో అతడు దాడి చేశాడని, అయితే స్వల్ప గాయాలతో ఆమె బయటపడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఆరోజు అతడి నుంచి తప్పించుకున్న ఆమెపై మంగళవారం ఇలా అతి దారుణంగా కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఈ ఘటన స్థానికులను కలిచివేసింది.

Tags

Related News

Kiren Rijiju: కేంద్ర మంత్రి కిరణ్ రిజిజుకు తృటిలో తప్పిన ప్రమాదం.. ఇదిగో వీడియో

Jammu Kashmir: భారీ వర్షాలు.. విరిగిపడిన కొండచరియలు, స్పాట్‌లో ఐదుగురు మృతి

Crime: భార్యలను చంపుతున్న భర్తలు.. అసలు కథ ఇదే..!

Anantapur News: అనంతలో ట్రయాంగిల్‌ లవ్‌‌.. ప్రియురాలి బెదిరింపులు, మరో యువతి సూసైడ్

Medipally News: కాళ్లు, చేతులు, తల లేకుండానే స్వాతి అంత్యక్రియలు..

Hyderabad News: నడిరోడ్డుపై రెచ్చిపోయారు.. క్రికెట్ బ్యాట్‌తో బైకర్స్‌పై దాడి చేసి, మేటరేంటి?

Big Stories

×