Big Stories

Overseas Education Tension: విదేశాల్లో చదువు.. గుండెల్లో గుబులు.. స్వదేశానికి పయనం అవుతున్న స్టూడెంట్స్!

Advantages and Disadvantages of MBBS Abroad for Indian Students: దూరపు కొండలు నూనుపు.. సామెత పాతదే అయినా.. చాలా అర్థం ఉంది ఇందులో.. ఇప్పుడీ సామెత విదేశాల్లో చదువుతున్న స్టూడెంట్స్‌కు పక్కాగా సూటవుతోంది. ఎస్పెషల్‌గా మెడికో స్టూడెంట్స్‌కు ఇది పక్కాగా సూటవుతుంది. నీట్‌లో ఇక్కడి మెడికల్ కాలేజీల్లో సీట్లు రాక.. ఉక్రెయిన్, కిర్గిస్థాన్‌, తజకిస్థాన్‌, చైనా లాంటి దేశాల్లో మెడిసిన్ చేస్తున్న వారి పరిస్థితి. ప్రస్తుతం కొంచెం ఇబ్బందికరంగా మారింది. ఎందుకీ మాట చెప్పాల్సి వస్తుంది. అది తెలుసుకోవాలంటే ఈ విషయాలు మీరు తెలుసుకోవాల్సిందే.. కిర్గిస్థాన్.. మెడిసిన్ చదివేందుకు చాలా మంది విద్యార్థులు ఈ కంట్రీకి వెళుతుంటారు.

- Advertisement -

బట్ ఇప్పుడు పరిస్థితి ఎలా మారింది. అలర్లు జరుగుతున్నాయి. స్థానిక విద్యార్థులు.. విదేశీ విద్యార్థులపై దాడులు చేశారు. ఓ భయానక పరిస్థితులను సృష్టించారు. దీనికి సంబంధించి వీడియోలు చాలా వైరల్‌గా మారాయి. దీంతో విదేశాంగశాఖ అలర్ట్ అయ్యింది.. అందరికి ధైర్యం చెప్పింది. ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సూచించారు.. ఆ దేశ ప్రతినిధులతో సంప్రదింపులు జరిపారు. ప్రస్తుతం సిట్యూవేషన్‌ కంట్రోల్‌లోనే ఉంది. బట్ ఈ ఇంపాక్ట్ అక్కడ చదివే వారిపై మాత్రం చాలా కాలం పాటు ఉండనుంది.

- Advertisement -

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైనప్పుడు కూడా ఇదే సిట్యూవేషన్‌.. రష్యా మిసైళ్ల వర్షం కురిపిస్తుంటే ఏం చేయాలో అర్థంకాని సిట్యూవేషన్ ఇండియన్ స్టూడెంట్స్‌ది. అప్పుడు అక్కడ మెడిసిన్ చదువుతున్న ఇండియన్ స్టూడెంట్స్‌ను వెనక్కి తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పడ్డ తంటాలు అన్నీ ఇన్నీ కావు.. ఎట్టకేలకు అందరినీ క్షేమంగా దేశానికి తీసుకొచ్చారు. కిర్గిస్తాన్‌ అయినా.. ఉక్రెయిన్‌ అయినా.. లేదా మరేదేశమైనా.. మనకు ఇస్తున్న మెస్సేజ్ ఏంటనేది ఇక్కడ ఆలోచించాలి.. నిజానికి నీట్‌ రాయడం పూర్తైన వెంటనే స్టూడెంట్స్.. వాళ్ల పేరెంట్స్.. ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

Also Read: Pune Accident Latest Updates: ఒక యాక్సిడెంట్.. అనేక ప్రశ్నలు

ఏ దేశంలో తక్కువ ఖర్చుతో మెడిసిన్ పూర్తి చేయవచ్చో వెతుకుతున్నారు. అందులో చేరుతున్నారు. ఇలాంటి వారి సంఖ్య ప్రతి ఏటా 3 నుంచి 4 వేల మంది స్టూడెంట్స్‌ విదేశాల్లో MBBS చేస్తున్నారంటే నమ్ముతారా..? కానీ ఇదే నిజం. అయితే మరో నమ్మలేని నిజం ఏంటంటే.. వీరిలో సగం మంది అండర్ గ్రాడ్యుయేట్లుగానే మిగిలిపోతున్నారు. ఎందుకిలా జరుగుతుంది? ఈ ప్రశ్నే ఇప్పుడు విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు.. భవిష్యత్తులో విదేశాలకు తమ పిల్లల్ని పంపాలనుకుంటున్న పెరేంట్స్ ఆలోచించాలి.

అయితే ఇందులో పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే..విదేశాల్లో చదువుతున్నారు.. ఎంబీబీఎస్ డిగ్రీ అందుకుంటున్నారు. బట్ ఇండియాలో ప్రాక్టీస్ చేయాలంటే ఇక్కడ మరో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అదే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఎగ్జామ్.. ఇది రాసి.. అందులో పాసైన వారికి మాత్రమే ప్రాక్టీస్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదంటే ఆ ఎంబీబీస్ పట్టా ఎందుకు పనికి రాకుండా పోతుంది. అయితే అత్యంత SAD న్యూస్ ఏంటంటే.. లాస్ట్ ఐదు FMG ఎగ్జామ్స్‌లో కనీసం ఒక్కసారి కూడా పాస్ పర్సంటేజీ 30 పర్సెంట్ దాటలేదు. అంటే గడచిన ఐదేళ్లలో డిగ్రీలు సాధించిన వారిలో 70 శాతం మంది తాము చదివిన చదువులు వేస్ట్ అయ్యాయనే చెప్పాలి.

Also Read: కిర్గిస్తాన్ లో ఆగని హింస.. మళ్లీ పెరిగిన దాడులు

అసలేంటి ఈ FMG ఎగ్జామ్స్.. ఒక్కసారి ఫుల్ డిటేయిల్స్ చూద్ధాం.. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివొచ్చాక FMG ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామ్‌‌‌‌ పాస్ అవకుండా డాక్టర్‌‌‌‌‌‌‌‌గా నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి.. స్టేట్ మెడికల్ కౌన్సిల్ నుంచి రిజిస్ట్రేషన్‌‌‌‌ పొందలేరు. అయితే కెనడా, అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌‌‌‌ దేశాల్లో మెడిసిన్ చేసిన వారికి ఎక్సెప్షన్ ఉంది. ఎందుకంటే అక్కడ మనకంటే ఎక్కువ స్టాండర్డ్స్‌ ఉంటాయి. ఈ ఐదు దేశాలు మినహాయించి.. మరే దేశంలో అయినా మెడిసిన్ చేస్తే..ఎగ్జామ్‌ రాయాల్సిందే.. పాస్ కావాల్సిందే.. మరి పాస్ కాగానే పట్టా ఇచ్చేస్తారా అంటే.. నో అనే చెప్పాలి.. అలా ఎగ్జామ్ పాస్ అయిన వారికి ఇండియాలోనే వన్‌ ఇయర్ ఇంటర్న్‌ షిప్‌ ఉంటుంది. ఈ ఇంటర్న్‌షిప్ పూర్తి చేస్తేనే నేషనల్ మెడికల్ కౌన్సిల్‌ గుర్తింపు ఇస్తుంది. అప్పుడు మాత్రమే స్టేట్ మెడికల్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకొని డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయవచ్చు..

ఈ ఎగ్జామ్ జూన్, డిసెంబర్‌లో ఉంటుంది. 300 మార్కుల పేపర్ ఇస్తారు. 2014 నుంచి 2018 వరకు 64 వేల 647 మంది పరీక్ష రాస్తే.. కేవలం 8 వేల 917 మంది మాత్రమే పాసయ్యారు. ఎన్నిసార్లు రాసినా పాస్ కాలేక మధ్యలోనే వదిలేసిన వారి సంఖ్య వందల మంది ఉంటుంది. మరికొంత మంది ప్రైవేటు, కార్పొరేట్‌‌‌‌ హాస్పిటల్స్‌లో అత్తెసరు జీతానికి క్లినికల్‌‌‌‌ అసిస్టెంట్లుగా, డ్యూటీ మెడికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు…
ఇది కూడా దొంగచాటు ఉద్యోగమే.. ఇలా చేస్తూ దొరికితే హాస్పిటల్స్‌‌‌పై, వారిపై వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవు..

Also Read: Palasa Constituency: సీదిరికి సినిగిపోద్దా? సిత్తరాల సిరపడా!?

సో.. అక్కడ చదవడం ఓ సవాల్.. ఆ సవాళ్లను ఎదుర్కొని ఎలాగో అలాగా పట్టాను సాధిస్తే.. మళ్లీ ఇక్కడకు వచ్చి ప్రాక్టీస్ చేయడం మరో సవాల్.. అందుకే విదేశీ విద్య మోజులో పడే వారంతా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి. మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఉక్రెయిన్ కావొచ్చు.. కిర్గిస్థాన్ కావొచ్చు.. మనకు చెబుతున్న పాఠాలు ఇవే..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News