Big Stories

Hindupur Assembly Constituency: బాలయ్య హ్యాట్రిక్ కొడితే! ఎట్టా ఉంటాదో తెలుసా?

Hindupur Assembly Constituency Election Result: 30 ఏళ్లు సీఎంగా ఉంటానంటున్న జగన్ కుప్పంలోనూ చంద్రబాబుని ఓడిస్తానంటున్నారు. అలాగే పిఠాపురం, మంగళగిరి, హిందూపురం సెగ్మెంట్లలో విపక్ష దిగ్గజాలకు చెక్ పెట్టడానికి పెద్ద స్కెచ్చే గీశారు. కీలక నేతలైన పవన్, లోకేశ్, బాలక‌ృష్ణలపై వైసీపీ మహిళా అభ్యర్ధులను రంగంలోకి దింపింది. ఆ క్రమంలో హ్యాట్రిక్ విజయంపై ఫోకస్ పెట్టిన బాలయ్య పోటీ చేస్తున్న హిందూపురం సెగ్మెంట్ అందరి దృష్టి ఆకర్షిస్తుంది .. అక్కడ వైసీపీ వేసిన బీసీ మహిళా ఎత్తుగడ ఎంతవరకు ఫలిస్తుంది? పెరిగిన ఓటింగ్ శాతం దేనికి సంకేతం? డీపీ కండుకోట లాంటి హిందూపురంలో వైసీపీ ఆశలు నెరవేరతాయా?

- Advertisement -

రాష్ట్రంలోని కీలక నియోజకవర్గాల్లో ఉమ్మడి అనంతపురం జిల్లాలోని హిందూపురం ఒకటి . తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడ ఏ ఇతర రాజకీయ పార్టీ ఇంతవరకు విజయం సాధించలేదు. 1983లో టీడీపీని గెలిపించిన హిందూపురం ఓటర్లు. 1985 నుంచి వరుసగా 3 సార్లు ఎన్టీఆర్‌ను అసెంబ్లీకి పంపించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కేండెట్ ఎవరైనా టీడీపీకే పట్టం కడుతూ వచ్చారు. 2014 ఎన్నికల్లో ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ నందమూరి బాలకృష్ణ ఇక్కడి నుంచి పోటీచేసి ఘనవిజయం సాధించారు. 2019లో వైసీపీ గాలిని తట్టుకొని మరీ విజయం సాధించి ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపించారు.

- Advertisement -

అయితే తెలుగుదేశం పార్టీలోని కీలక నేతలను ఈ సారి ఎన్నికల్లో ఓడించేందుకు ముఖ్యమంత్రి జగన్ అన్ని అవకాశాలు వాడుకున్నారు. శ్వశక్తులు ఒడ్డారు. ఇందులో భాగంగా హిందూపురం నుంచి బాలయ్యను ఓడించేందుకు బీసీ మహిళ అభ్యర్థి దీపికను రంగంలోకి దింపారు. ఆమె భర్త రెడ్డి సామాజికవర్గానికి చెందినవారు కాగా, ఆమెది బీసీ కేటగిరీకి చెందిన కురుబ సామాజికవర్గం. దీపిక భర్త వేణురెడ్డి 2003 నుంచి వైఎస్ ఫ్యామిలీకి వీరవిధేయుడిగా ఉంటూ వస్తున్నారు. హిందూపురంలో కీలకంగా ఉండే కురుబ ఓటర్లతో పాటు రెడ్డి వర్గం కలిసి వస్తుందన్న అంచనాలతో .. ఆ నియోజకవర్గంలో తొలిసారి మహిళా ప్రయోగం చేశారు జగన్.

వేణురెడ్డి తన అనుచరుడే అవ్వడంతో జిల్లా ఇన్చార్జ్ మంత్రి పెద్దిరెడ్డి స్యయంగా దీపిక పేరును సిఫార్సు చేసి ఓకే చేయించుకున్నారు. దీపిక విజయం కోసం పెద్దరెడ్డి హిందూపురం అంతా కలియతిరిగారు. బాలయ్యను ఓడించే బాధ్యతను జగన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కట్టబెట్టడంతో ఆయన తాను పోటీచేస్తున్న పుంగనూరు కంటే ఇక్కడే ఎక్కువగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఒక విధంగా చెప్పాలంటే అభ్యర్థి దీపికానా లేదా పెద్దిరెడ్డి నా అన్నంత రీతిలో ప్రచారం చేసారు.

Also Read: పెద్దిరెడ్డి పెత్తనమా? మా ప్రతాపమా

హిందూపురంలో హ్యాట్రిక్ విజయాలు సాధించిన ఎన్టీఆర్ తర్వాత.. వరుసగా రెండు సార్లు గెలుపొందిన ఘనత బాలకృష్ణకే దక్కుతుంది. మరోసారి విజయం సాధించి తండ్రి తరహాలో తాను కూడా హ్యట్రిక్ కొడతానని బాలకృష్ణ నమ్మకంతో కనిపిస్తున్నారు. 2014లో తొలిసారి పోటీ చేసినప్పుడు హిందూపురంలో 76.57 శాతం పోలింగ్ జరిగితే బాలయ్య 16, 196 ఓట్ల మెజార్టీతో గెలిచారు. రెండో సారి పోటీ చేసినప్పుడు పోలింగ్ శాతం పెరగకపోయినా ఆయన మెజార్టీ 18 వేలకు పెరిగింది. ఈ సారి 77.82 పోలింగ్ శాతం నమోదవ్వడంతో నందమూరి వారసుడి ఆధిక్యత మరింత పెరగడం ఖాయమంటున్నాయి టీడీపీ శ్రేణులు.

నందమూరి బాలకృష్ణ కు ఈ సారి ఎన్నికల్లో అనేక అంశాలు కలసి వచ్చాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. బాలకృష్ణను ఓడించడానికి మంత్రి పెద్దిరెడ్డి ఎంత కష్టపడినా  వైసీపీలోని వర్గ విభేదాలు టిడిపికి బాగా కలిసి వచ్చాయంటున్నారు. ముఖ్యంగా వైసీపీలో పట్టున్న మైనార్టీ వర్గం నేత మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ ఎన్నికల ముందు టీడీపీలో చేరడంతో వైసీపీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. అదీకాక ఇప్పటికీ హిందూపురం వైసీపీలో వర్గ విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. అక్కడ అధికారపక్ష నేతలు ఏకంగా ఐదు గ్రూపులుగా విడిపోయి ఎవరికి వారి యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.

పెద్దిరెడ్డి చొరవతో ఎన్నికల సమయానికి ఒకటి రెండు గ్రూపులు కలిసినా.. అప్పటికే పుణ్యకాలం గడిచిపోయిందని వైసిపి నేతలే బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. హిందూపురం వైసీపీకి దీపికను ఇన్చార్జిగా ప్రకటించినప్పటి నుంచి అక్కడి నేతలు ధిక్కార స్వరం వినిపించడం మొదలుపెట్టారు. ముఖ్యంగా నాన్ లోకల్ కావడం ఎక్కడో బెంగళూరు నుంచి తీసుకొచ్చిన అభ్యర్థి కావడంతో వైసిపి నేతలు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు నందమూరి బాలకృష్ణ నాన్ లోకల్ అంటూ విమర్శించిన తాము ప్పుడు దీపికను ఎలా సమర్థిస్తామని ప్రశ్నించారు.

వైసీపీలోని వర్గ పోరుకు తోడు.. ఈ సారి పోలింగ్ శాతం కూడా గతం కంటే వన్ పర్సెంట్ పెరగడంతో బాలయ్య మెజార్టీపై టిడిపి నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. చివరి నిమిషంలో మహమ్మద్ ఇక్బాల్ పార్టీలోకి రావడం కూడా ప్లస్ అయింది అని టీడీపీ ధీమాగా ఉంది.రోవైపు టిడిపి, బిజెపి, జనసేన పొత్తు కూడా బాలకృష్ణకు కలిసి వచ్చి మెజారిటీ మరింతగా పెరిగే అవకాశం ఉందని వైసీపీ నేతలే వ్యాఖ్యానిస్తున్నాడం గమనార్హం. కూటమి రెబల్ అభ్యర్ధిగా పరిపూర్ణానందస్వామి బరిలో ఉన్నప్పటికీ యన ప్రభావం పెద్దగా ఉండదన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. దేమైనా హిందూపురం గురించి పూర్తి క్లారిటీ రావాలంటే రిజల్ట్ దాకా వేచి ఉండక తప్పదు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News