BigTV English

Ysrcp vs Tdp cadre Fighting: నామినేషన్ల రోజు ఘర్షణలు, టీడీపీ-వైసీపీ కార్యకర్తల ఫైటింగ్

Ysrcp vs Tdp cadre Fighting: నామినేషన్ల రోజు ఘర్షణలు, టీడీపీ-వైసీపీ కార్యకర్తల ఫైటింగ్

Ysrcp vs Tdp cadre Fighting: నామినేషన్ల సందడి ఇంకా మొదలుకాకముందే ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రధాన పార్టీలైన అధికార వైసీపీ- టీడీపీ అభ్యర్థుల ప్రచారంలో కేడర్ మధ్య  ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం వేదికైంది.


డీటేల్స్ లోకి వెళ్తే.. కల్యాణదుర్గం పట్టణంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ప్రచారంలో నిమగ్నమయ్యారు. అయితే వైసీపీ అభ్యర్థి తలారి రంగయ్య ఇంటి నుంచి వెళ్తుండగా ఈ గొడవ జరిగింది. టీడీపీ కార్యకర్తలు వెళ్తుండగా దారికి అడ్డంగా వాహనాలను పెట్టారు వైసీపీ కార్యకర్తలు.

Fight between Ysrcp vs Tdp cadre at Kalyandurg
Fight between Ysrcp vs Tdp cadre at Kalyandurg

వాటిని తీయాలని కోరడంతో ఇరు వర్గాల మధ్య మాటలు కాస్త వాగ్వాదానికి దారితీసింది. ఈ క్రమంలో టీడీపీ నేత, మున్సిపల్ మాజీ ఛైర్మన్ రమేష్‌బాబుపై దాడికి తెగబడ్డారు వైసీపీకి చెందిన కార్యకర్తలు. దీంతో ఆయన అక్కడిక్కడే పడిపోయారు.


రమేష్ తలకు గాయం కావడంతో వెంటనే ఆయన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ దాడికి ఖండిస్తూ టీడీపీ శ్రేణులు పోలీసుస్టేషన్ వద్ద నిరసన తెలిపాయి. వైసీపీ నేతలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చివరకు పోలీసుల జోక్యంతో వ్యవహారం సద్దుమణిగినట్టు తెలుస్తోంది.

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×