Preethi: వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ స్టూడెంట్ ప్రీతిది ఆత్మహత్యే అని పోలీసులు స్పష్టంచేశారు. ఆమె ఇంజెక్షన్ ద్వారా పాయిజన్ తీసుకున్నట్టు భావిస్తున్నామని వరంగల్ సీపీ రంగనాథ్ తెలిపారు. ప్రీతి శవపరీక్ష నివేదికను పరిశీలించి, వివరాలు వెల్లడించారు. ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ విద్యార్థి సైఫ్ ప్రధాన కారణమని అన్నారు. మరో పది రోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేస్తామని చెప్పారు.
మరోవైపు, సీపీ ప్రకటనపై ప్రీతి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. ప్రీతి పాయిజన్ తీసుకుందంటూ కొత్త నాటకం ఆడుతున్నారని తప్పుబట్టారు. మరి, ఏ విషం తీసుకుందో.. ఎలా తీసుకుందో చెప్పలేకపోతున్నారని విమర్శించారు. ప్రీతి పోస్టుమార్టం రిపోర్ట్ బయట పెట్టడానికి ఇంతకాలం ఎందుకు ఆలస్యం చేశారని ప్రశ్నించారు. పోలీసుల విచారణపైనా అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రీతి కేసులో ప్రధాన నిందితుడు కండిషనల్ బెయిల్‌పై బయటకు రావడంపైనా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.