గోదావరి తీరంలో ఫ్లోటింగ్ బోట్ రెస్టారెంట్
ప్రారంభించిన మంత్రి కందుల దుర్గేష్
పర్యాటకులకు కనువిందు
రుచులను ఆస్వాదిస్తూ గోదావరి అందాల వీక్షణం
దేశంలోనే ప్రప్రధమంగా ఏర్పాటు
బోట్ లో ఒకేసారి 3 నుంచి 4 వందల మంది ప్రయాణం
బర్త్ డే, గెట్ టూగెదర్, కిట్టీ పార్టీలు
జరుపుకునేందుకు ఏర్పాట్లు
మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా షికార్
రాజమండ్రి, స్వేచ్ఛ:Minister Durgesh: ప్రకృతి అందాలను వీక్షించాలంటే ఏపీ పెట్టింది పేరు. అందునా ప్రత్యేకించి తూర్పు గోదావరి మరో ఆంధ్రా కేరళగా ప్రఖ్యాతి కాంచింది. గోదావరి అందాలను వీక్షించేందుకు దేశవిదేశాల నుంచి ఎందరో టూరిస్టులు వస్తుంటారు. మారేడుమిల్లి నుంచి కాకినాడ బీచ్, రాజమండ్రి బ్రిడ్జి వరకూ అన్నీ చూడదగ్గ ప్రదేశాలే. పర్యాటకులకు గోదావరి అందాలు అహ్లాదం పంచుతూ కనువిందు చేస్తాయి. ఇక ఈ ప్రాంతాలలోని పుణ్య క్షేత్రాలకు వెళ్లేందుకు ఏపీ ప్రభుత్వం ప్రత్యేక బస్సు సౌకర్యాలను కల్పించింది. అన్నింటికన్నా ముఖ్యంగా గోదావరి అందాలను వీక్షిస్తూ..గోదావరి ప్రాంత ఘుమఘుమలతో రుచికరమైన ఫుడ్డును ఆస్వాదించేందుకు ఏపీ ప్రభుత్వం గోదావరి అందాల మధ్య ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుచేసింది. త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు పర్యాటక శాఖ అధికారులు.
మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి గోదావరి తీరంలో మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం బోట్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ని ప్రారంభించారు. పర్యాటకులు గోదావరి ప్రయాణం చేస్తూ ఆహ్లాదకరమైన అందాలను వీక్షిస్తూ ఈ ఫ్టోటింగ్ రెస్టారెంట్ లో సేద తీరవచ్చు. ఒకేసారి మూడు వందలనుంచి నాలుగు వందల మంది ప్రయాణం చేసేవిధంగా బోటింగ్ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం దాకా ఈ బోటింగ్ లో ఎంజాయ్ చేయవచ్చ. కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా బోటింగ్ ఏర్పాట్లకు టూరిజం శాఖకు భాగస్వామ్యంగా ఉండేందుకు ముందుకు వచ్చాయి.
Also Read: Samyuktha Menon: బాలయ్య హాస్పిటల్ లో సంయుక్త.. ఏమైందంటున్న ప్రేక్షక లోకం..!
దేశంలోనే తొలిసారి ప్రయోగం
దేశంలోనే ఎక్కడా లేనివిధంగా తొలిసారిగా ఏపీలో ఫ్లోటింగ్ బోట్ రెస్టారెంట్ ని తీసుకురావడం విశేషం. ఇందులో నాన్ వెజ్ ప్రియులకు, వెజ్ ప్రియులకు వేర్వేరుగా రుచికరమైన వంటలు లభ్యం కానున్నాయి. ప్రత్యేకించి చిన్న సైజ్ గెట్ టూ గెదర్ ఫంక్షన్లు, పుట్టినరోజు వేడుకలు, వెడ్డింగ్ డే , కిట్టీ పార్టీలు జరుపుకోవచ్చు. సామాన్యులకు సైతం అందుబాటులో ఉంటాయి రేట్లు. స్టార్ హోటల్ లో తింటుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో ఈ ఫ్లోటింగ్ బోట్ రెస్టారెంట్లలో అలాంటి అనుభూతి కలుగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. గోదావరి ఇసుక తిన్నెల మధ్య నైట్ డిన్నర్ ఏర్పాట్లు కూడా ఉంటాయని చెబుతున్నారు.