Big Stories

Barley Water: ఈ నీరు రోజు ఒక గ్లాసు తాగితే వడదెబ్బ భయమే ఉండదు..

 

- Advertisement -

Barley Water: వేసవి కాలంలో ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటి పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు మండుతున్న ఎండలకు అల్లాడిపోతున్నారు. అయితే ఇక ముందు కూడా మరింత ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ తరుణంలో బయటకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. మండుతున్న ఎండల కారణంగా వడదెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి. అందువల్ల సరైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.

- Advertisement -

నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లు, పండ్ల రసాలను తీసుకోవాలి. అయితే ఎండల కారణంగా బాడీ డీహైడ్రేట్ కాకుండా ఉండేందుకు నిపుణులు సూచనలు చేస్తున్నారు. బార్లీ గింజలు నానబెట్టిన నీటిని తాగడం వల్ల ఎండ తీవ్రత, వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతున్నారు.

బార్లీ గింజలు పోషకాలతో నిండి ఉంటాయి. బార్లీలోని కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్, జింక్, కాపర్, మాంగనీస్ వంటివి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల బార్లీ నీళ్లు తాగితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా వేసవిలో బార్లీ నీళ్లు తీసుకోవడం చాలా మంచిది అని నిపుణులు చెబుతున్నారు. బార్లీలో ఉండే బీటా గ్లూకాన్ అనే ఫైబర్ చెడు కొలస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. అంతే కాదు మంచి కొలస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అందువల్ల గుండె సంబంధింత జబ్బులు తగ్గించడంలో సహాయపడుతుంది.

బార్లీలో ఉండే ఎలక్ట్రోలైట్లు శరీరం నుంచి కోల్పోయిన ఎలక్ట్రోలైట్లను తిరిగి భర్తీ చేసేందుకు ఉపయోగపడతాయి. అందువల్ల బాడీ డీహైడ్రేట్ కాకుండా తోడ్పడుతుంది. మరోవైపు క్రమం తప్పకుండా బార్లీ నీటిని తీసుకోవడం వల్ల డయాబెటీస్ వంటి సమస్యల నుంచి కూడా తప్పించుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News