BigTV English

Amit Shah on Reservations: రిజర్వేషన్లపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. బీజేపీ ఉన్నంత కాలం..

Amit Shah on Reservations: రిజర్వేషన్లపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు.. బీజేపీ ఉన్నంత కాలం..

Amit Shah Comments on Reservations: లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి మోదీ ప్రధాని అయితే రిజర్వేషన్లు తొలగిస్తారని కాంగ్రెస్ అసత్య ప్రచారం చేస్తుందని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం హర్యానాలోని ఘజర్ లో నిర్వహించిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. పార్లమెంట్ లో బీజేపీ ఉన్నంత కాలం రిజర్వేషన్లను ఎవ్వరూ కదిలించలేరని తెలిపారు.


ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టారని అనంతరం బైనాక్యులర్ తో వెతికినా కాంగ్రెస్ పార్టీ కనిపించదని లేదని ఎద్దేవా చేశారు. బీజేపీ రాజ్యాంగాన్ని మార్చివేస్తుంది, రిజర్వేషన్లను రద్దు చేస్తుందంటూ కాంగ్రెస్ నేతలు బీజేపీపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ ఆరు దశాబ్దాలుగా అధికారంలో ఉన్నప్పటికీ బుజ్జగింపు రాజకీయాల కోసమే ఆర్టికల్ 370 ని రద్దు చేయలేదని ఆరోపించారు. జమ్ము కశ్మీర్ లో ఉగ్రవాదం పెరిగినా కూడా కాంగ్రెస్ ఆర్టికల్ 370 రద్దు చేయలేదని తెలిపారు. పీవోకే తప్పకుండా భారత్ దేనని దాన్ని తిరిగి వెనక్కి తీసుకుంటామని చెప్పారు. మైనార్టీ ఓటు బ్యాంకును ప్రసన్నం చేసుకునేందుకు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్, సోనియా వంటి అగ్ర నేతలు అయోధ్య బలరాముడి ఆలయ శంకుస్థాపనకు రాలేదని అన్నారు.


Also Read: ఆప్ అంతం కోసం బీజేపీ ప్రయత్నం: కేజ్రీవాల్

మీరంతా మోదీని 2019 లో రెండో సారి ప్రధానిగా చేశారు. దీంతో ఆగస్టు 5, 2019 న మోదీ ఆర్టికల్ 370 రద్దు చేశారు. అందుకే ఇప్పుడు త్రివర్ణ పతాకం కశ్మీర్ లో సగర్వంగా రెపరెపలాడుతోందని వ్యాఖ్యానించారు. హర్యానా యువత కశ్మీర్ కోసం ప్రాణాలు అర్పించగలరు అమిత్ షా అని అన్నారు. మల్లిఖర్జున ఖర్గే ఇంత వరకు దేశాన్ని అర్థం చేసుకోలేదని విమర్శించారు.

Related News

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Income Tax Bill: వెనక్కి తగ్గిన మోదీ సర్కార్.. ఆ బిల్ విత్ డ్రా

Gold mining news: ఆ జిల్లాలో అంతా బంగారమే.. తవ్వితే చాలు వచ్చేస్తోంది.. ఎంత అదృష్టమో!

Big Stories

×