BigTV English

Murder in Tamil Nadu: దారుణం.. నరికి చంపుతున్నా చుట్టున్న జనాలు ఎవరూ ఆపలే..!

Murder in Tamil Nadu: దారుణం.. నరికి చంపుతున్నా చుట్టున్న జనాలు ఎవరూ ఆపలే..!

Man Killed with Machetes in Tamil Nadu: తమిళనాడు రాష్ట్రంలో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ వ్యక్తిని ఆరుగురు వ్యక్తులు కలిసి అత్యంత దారుణంగా నడిరోడ్డుపై నరికి చంపారు. ఆ వ్యక్తిని అడ్డగించి నరుకుతున్నప్పుడు చుట్టుపక్కల జనాలు ఉన్నప్పటికీ కూడా వారిలో ఏ ఒక్కరు కూడా ఆపేందుకు ప్రయత్నం చేయలేదు. తమిళనాడులోని తిరునేల్వేలిలో అనే ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.


ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులోని తిరునెల్వేలిలో ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. జనాలతో ఎప్పుడు ఆ ప్రాంతం రద్దీగా ఉంటుంది. అయితే, ఆ ప్రాంతంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంలో నడిరోడ్డుపై ఓ వ్యక్తిని ఆరుగురు వ్యక్తులు నరికి చంపారు. ఈ దాడి ఘటన ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యింది. దుండగులు మొదటగా అతడిపై దాడిచేశారు. ఈ క్రమంలో బాధితుడు వారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశాడు. పార్కు చేసిన కార్ల గుండా పరిగెత్తుతూ తప్పించుకునే ప్రయత్నం చేశాడు. అయినా కూడా వారు అతడి వెంటపడి మరీ కనికరం లేకుండా హత్య చేశారు. కత్తులతో కనీసం 12 సార్లు నరికిచంపారు. బాధితుడు విగతజీవిగా పడి ఉండడంతో వారు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, ఆ సమయంలో అక్కడ చుట్టూ జనాలు ఉన్నా కూడా ఏ ఒక్కరు కూడా ముందుకు రావలేదు. పాత కక్షలే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది.

Also Read: ఉబర్ బస్సులు వచ్చేస్తున్నాయ్.. ఎప్పట్నుంచంటే..?


విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సంఘటనా స్థలిని పరిశీలించారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డు అవడంతో వాటిని పరిశీలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్పారు. పాతకక్షలే హత్యకు కారణంగా పోలీసులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

Bhadradri bus accident: భద్రాద్రి కొత్తగూడెం వద్ద ప్రమాదం.. బస్సులో 110 మంది ప్రయాణికులు.. ఏం జరిగిందంటే?

Bengaluru : ఆ వెబ్ సిరీస్ చూసి.. బాలుడి సూసైడ్..

Cyber scam: 80 ఏళ్ల వృద్ధుడికి హాయ్ చెప్పి.. 8 కోట్లు నొక్కేసిన కి’లేడి’.. పెద్ద మోసమే!

Shamli News: భర్త వద్దన్నాడు.. అయినా భార్య వినలేదు, చివరకు ఏం జరిగిందంటే

Hyderabad incident: టిఫిన్ బాక్స్‌తో చిన్నారిపై టీచర్ దాడి.. తలకు 3 కుట్లు పడేలా కొట్టడమేంటి?

New Bride Incident: ఫ్రెండ్సే చంపేశారా? నవ వధువు కేసులో బిగ్ ట్విస్ట్!

Big Stories

×