Big Stories

OnePlus Nord 4 Features: వన్‌ప్లస్ నుంచి న్యూ స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు లీక్.. నోరెళ్ళ బెడుతున్న యూసర్స్!

OnePlus Nord 4 Features Leaked: వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో భాగంగా కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేసేందుకు సిద్ధమైంది. గ్లోబల్ మార్కెట్‌లో త్వరలో OnePlus Ace 3V రీబ్రాండెడ్ వెర్షన్‌గా Nord 4‌ను తీసుకురానుంది. గత నెలలో చైనా మార్కెట్‌లో ఈ ఫోన్‌ను విడుదల చేశారు. ఫోన్‌లో ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌ ఉంటుంది. ఇందులో 12GB RAM ఉంటుంది. ఈ ఫోన్ ఇతర ఫీచర్లు గురించి తెలుసుకోండి.

- Advertisement -

ఇంటర్నెట్‌లోని సమాచారం ఆధారంగా.. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌లో రన్ అవుతుంది. ఇది మోడల్ నంబర్ CPH2621తో Geekbenchలో లిస్ట్ చేయబడింది. సింగిల్ కోర్ టెస్టింగ్‌లో 1,875 పాయింట్లు, మల్టీస్కోర్ టెస్టింగ్‌లో 4,934 పాయింట్లు సాధించింది. దీనికి 12 GB RAM మద్దతు ఉంటుంది.

- Advertisement -

ఇక ఫోన్ ప్రాసెసర్ గురించి చెప్పాలంటే వన్‌ప్లస్ నార్డ్ 4లో ఆక్టాకోర్ చిప్‌సెట్‌తో ఉంటుంది. దీని క్లాక్ స్పీడ్ 2.80GHz ఉంటుంది. Snapdragon 7+ Gen 3 SoC ప్రాసెసర్ ఫోన్‌ రన్ అవుతుంది. ఇది Qualcomm పవర్‌ఫుల్ చిప్‌సెట్. ఈ చిప్‌సెట్ ఏస్ 3విలో చూడొచ్చు. ఇది కొన్ని రోజుల క్రితం అనేక ఇతర సైట్‌లలో కూడా కనిపించింది.

Also Read: ఐఫోన్ కొనాలని చూస్తున్నారా తమ్ముళ్లూ.. అయితే మే 2 న రెడీగా ఉండండి!

ఇది పవర్ కోసం 5,500 mAh బ్యాటరీతో 80 వాట్ల వైర్డు ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. OnePlus Nord 4లోని FV5 డేటాబేస్ ప్రకారం 50 మెగాపిక్సెల్ OIS కెమెరాను f/1.9 ఎపర్చరుతో అందించవచ్చు. ఇది 26.4mm ఫోకల్ లెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో సెల్ఫీల కోసం 16-మెగాపిక్సెల్ షూటర్ ఉంటుంది.

OnePlus Nord 4 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), f/1.9 ఎపర్చరు, 26.4mm ఫోకల్ ప్రైమరీ కెమెరాను కలిగి ఉండొచ్చు. అయితే ఈ రూమర్డ్ స్పెసిఫికేషన్‌లు OnePlus Ace 3Vలో ఉండేవే.  Nord 4120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.74-అంగుళాల OLED ఫ్లాట్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది Snapdragon 7+ Gen 3 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

Also Read: రియల్ మీ P1 Pro 5G మొదటి సేల్ ఈరోజే.. ఆఫర్లు చూస్తే వదలడం కష్టమే!

కెమెరా సాంకేతికత పరంగా OnePlus Ace 3V డ్యూయల్-కెమెరా సెటప్‌లో OISతో 50-మెగాపిక్సెల్ Sony IMX882 సెన్సార్, 8-మెగాపిక్సెల్ Sony IMX355 కెమెరాను కలిగి ఉంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 16 మెగాపిక్సెల్స్. డ్యూయల్ స్టీరియో స్పీకర్లు IP65 రేటింగ్ రేటింగ్ కూడా Ace 3Vలో ఆఫర్‌ చేస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News