BigTV English

Joint Pains at Young Age: చిన్న వయస్సులోనే కాళ్లు, కీళ్ల నొప్పులు రావడానికి కారణాలేంటో తెలుసా..?

Joint Pains at Young Age: చిన్న వయస్సులోనే కాళ్లు, కీళ్ల నొప్పులు రావడానికి కారణాలేంటో తెలుసా..?

Reasons for Leg and Joint Pains at Young Age: ఆధునిక ప్రపంచంలో శారీరక శ్రమ తగ్గింది. అన్నీ ఆన్‌లైన్‌లో దొరుకుతుండటంతో బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా పోతోంది. శారీరక శ్రమ తగ్గడంతో పాటు శరీరానికి వ్యాయామం కరువైంది. అందుకే చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. చిన్న వయస్సులోనే బీపీ షుగర్‌తో పాటు అనేక రకాల వ్యాధుల బారిన పడుతున్నారు.


చిన్న వయస్సులోనే చాలా మంది కాళ్ల నొప్పులు వస్తున్నాయని చెబుతుంటారు. అయితే దీనికి కారణం ఎముకల్లో పటుత్వం లేకపోవడం. 60 ఏళ్ల వయస్సు వారికి కీళ్ల నొప్పులు రావడం కామన్. కానీ అదే సమస్య యువతి యువకులకు వస్తుందంటే దానికి కారణాలేంటో తెలుసుకోవాల్సిందే.సరైన పోషకాహారం తీసుకోకపోవడం, ఉదయం బయటకు వెళ్లకపోవడంతో శరీరంపై సూర్యరశ్మి పడడం లేదు. శారీరక శ్రమ తగ్గడం కూడా వల్ల చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అందరికీ ఇలాంటి సమస్యలు వస్తున్నాయని డాక్టర్లు చెబుతున్నారు.

20 శాతం పెరిగిన సమస్యలు:


15 ఏళ్లలోపు వారిలో కాళ్లు, కీళ్ల నొప్పుల సమస్యతో బాధపడేవారి సంఖ్య 20% పెరిగినట్లు సర్వే లు చెబుతున్నాయి. ఆధునిక జీవన విధానంలో వచ్చిన మార్పుల వల్ల చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఇప్పుడు 50 ఏళ్లు పైబడిన వారిలో 95% మంది, 12 ఏళ్లలోపు వారిలో 15% మంద కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.

Also Read: Mobile Phone: ఫోన్ పక్కన పెట్టుకుని పడుకుంటున్నారా.. అయితే ఈ సమస్యలు తప్పవు !

శారీరక శ్రమ లేకపోవడం వల్ల కీళ్ల, ఎముకల సమస్య పెరుగుతుంది. చిన్నారులు నిద్ర లేవగానే హడావిడిగా తయారై ఆటోలు, బస్సుల్లో స్కూల్‌కు వెళ్తారు. సాయంత్రం ఇంటికి వచ్చింది మొదలు టీవీ చూస్తూనో.. మొబైల్ గేమ్స్ ఆడుతూ గడిపేస్తారు. వాళ్ళ శరీరానికి వ్యాయామం ఉండదు. ఇక పెద్దలంతా ఆఫీసుల్లో.. వయస్సు పైబడిన వాళ్లు ఇంట్లోనే తమ పనులకు పూర్తి సమయాన్ని గడుపుతున్నారు.

ఎముకల గట్టిదనానికి కావాల్సిన శ్రమ లేకపోవడం వల్ల ఎముకల్లో పటుత్వం తగ్గుతుంది. ఆలస్యంగా నిద్ర లేచి ఆఫీసులకు పరుగులు తీయడం వల్ల 10 నిమిషాలు కూడా వీరు ఎండలో ఉండరు. కాబట్టి విటమిన్ డి అందక ఎముకలు పెళుసు బారుతున్నాయి . అందుకే చిన్న ప్రమాదానికి డ్యామేజ్ అవుతున్నాయి.

Also Read: పోషకాల గని టెఫ్.. తింటే ఆ సమస్యలన్నీ మాయం..

ఆహారపు అలవాట్లు:
ఆర్థో సమస్యలు పెరగడానికి ఆహారపు అలవాట్లు కూడా ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ప్రస్తుతం కూరగాయలు పండించేందుకు రసాయనాలను ఎక్కువగా వాడుతున్నారు. వాటినే మనం తింటున్నాం. చాలా మంది పూర్తిస్థాయిలో పాలిష్ చేసిన ఆహార ధాన్యాలను తింటున్నారు. అయితే దీంతో ఎముకలకు కావాల్సిన పోషకాలు అందడం లేదు. అందుకే ఎముకల్లో పుటుత్వం తగ్గుతుంది. అనేక రకాల అనారోగ్య సమస్యలు రావడానికి ఇది కారణం అవుతోంది.

దీర్ఘకాలిక వ్యాధులు: 

బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో చాలా మంది సతమతమవుతున్నారు. వారిలో చాలా మందిని ఆర్థో సమస్యలు వేధిస్తున్నాయి. డయాబెటిక్ పేషెంట్స్, హైబీపీ, లోబీపీతో బాధపడేవాళ్లకు కీళ్లపై ఒత్తిడి పెరిగి కండరాలు, ఎముకల సమస్యలు వస్తున్నాయి. అధిక బరువు ఉన్నవాళ్లకు మోకాళ్ల నొప్పులు మరింత పెరుగుతున్నాయి.

Related News

Bald Head Regrowth: బట్టతల సమస్యకు చెక్.. ఇలా చేస్తే జుట్టు పెరగడం ఖాయం

Munagaku Benefits: మునగాకుతో మామూలుగా ఉండదు.. దీని బెనిఫిట్స్ తెలిస్తే..

Fenugreek Seeds Sprouts: మొలకెత్తిన మెంతులు తింటే.. ఈ సమస్యలు దూరం !

Avocado For Hair: అవకాడోతో మ్యాజిక్.. ఇలా వాడితే ఒత్తైన జుట్టు

Priyanka Tare: ఘనంగా SK మిస్సెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్ అందాల పోటీలు.. విజేత ఎవరంటే?

Chia Seeds: నానబెట్టిన చియా సీడ్స్ తింటే.. ఇన్ని లాభాలా ?

Big Stories

×