BigTV English

Telugu States Weather Report: రాష్ట్ర ప్రజలకు సూచన.. వచ్చే మూడు రోజులు వర్షాలు!

Telugu States Weather Report: రాష్ట్ర ప్రజలకు సూచన.. వచ్చే మూడు రోజులు వర్షాలు!

Weather Report in Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిస్తే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం దక్షిణ కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగిన ఉపరితల ఆవర్తనం సోమవారం దక్షిణ కోస్తా, తమిళనాడు పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగిందని తెలిపింది.


ఈ నెల 22 నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 24వ తేదీ వరకు వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. దీంతో తెలంగాణలో రాగల మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

Also Read: తెలంగాణలో భారీ వర్షం.. ముగ్గురు మృతి..!


మంగళవారం భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, పెద్దపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యపేట, మహబూబాబాద్, వరంగల్, జనగాం, సంగారెడ్డి, మెదక్, హన్మకొండ జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. 22 వ తేదీ వికారాబాద్, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, రంగారెడ్డి, మేడ్చల్, భువనగిరి, మెదక్, హైదారాబాద్, వనపర్తి, జోగులాంబ గద్వాల, మహబూబ్ నగర్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

Tags

Related News

Telangana: భయం గుప్పిట్లో చందనపల్లి గ్రామం.. నెల రోజుల్లో 20 మంది బలి

CM Progress Report: దేశానికే ఆదర్శం టీ -ఫైబర్.. ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా తెలంగాణ

Telangana Bandh: ఈనెల 14న తెలంగాణ రాష్ట్రా బంద్.. ఎందుకంటే..?

Global Study Expo 2025: గ్లోబల్ స్టడీ ఎక్స్‌పో- 2025, తక్కువ ఖర్చుతో విదేశీ విద్య, స్టూడెంట్స్ మాటల్లో

Hyderabad Accident: ఎల్‌బీనగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదం, బైక్‌ని ఢీ కొట్టిన కారు, నుజ్జుయిన కారు

Innovation Hub: ఈ రెండు జిల్లాలకు గుడ్ న్యూస్.. త్వరలోనే ఇంక్యూబేషన్ కేంద్రాల ఏర్పాటు: శ్రీధర్ బాబు

Vemulawada Temple: రాజన్న దర్శనాల్లో తాత్కాలిక మార్పులు.. రేపటి నుంచి భీమేశ్వరాలయంలో దర్శనాలు

Janagam District: రియల్లీ గ్రేట్.. ఆటోలోనే పురుడు పోసిన ఆశా వర్కర్లు.. జనగాం జిల్లాలో ఘటన

Big Stories

×