BigTV English

CM Revanth Reddy on Kargyzstan Issue: కిర్గిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్థాన్‌లో భారతీయ విద్యార్థుల పరిస్థితిపై సీఎం రేవంత్ ఆరా!

CM Revanth Reddy on Kargyzstan Issue: కిర్గిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్థాన్‌లో భారతీయ విద్యార్థుల పరిస్థితిపై సీఎం రేవంత్  ఆరా!

 CM Revanth Reddy on Kargyzstan Incident: కిర్గిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్థాన్‌ రాజధాని బిష్కెక్ లో జరిగిన ఘటనలపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉన్నతాధికారులు బిష్కెక్‌లోని భారత రాయబారి అరుణ్ కుమార్ ఛటర్జీని సంప్రదించి వివరాలు సేకరించారు.


భారతీయ విద్యార్థులందరూ సురక్షితంగా ఉన్నారని అరుణ్ కుమార్ ఛటర్జీ తెలిపారు. ఏదైనా అత్యవసర పరిస్థితులకు స్పందించడానికి ఎంబసీ హెల్ప్‌లైన్ పూర్తిగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ప్రస్తుతం విద్యార్థులకు పరీక్షలు కొనసాగుతున్నాయి..భారతీయ విద్యార్థులందరూ ప్రిపరేషన్ మోడ్‌లో ఉన్నారని తెలిపారు. కిర్గిజ్ స్థాన్ ఘటనలో భారతీయ విద్యార్థులెవరూ గాయపడలేదని, ఆసుపత్రిలో చేరలేదని తెలిపారు. సోషల్ మీడియా పోస్ట్‌లు వాస్తవం కాదని భారత రాయభారి ధృవీకరించారు.

కిర్గిజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌స్థాన్‌ రాజధాని బిష్కెర్ లో భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ విద్యార్ధులు ఉంటున్న హాస్టళ్లపై దాడులు జరుగుతున్నాయి. అయితే గొడవలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇక్కడ వైద్య విద్యను అభ్యసించేందుకు వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కిర్గిజ్ స్థాన్ ఘటనపై అధికారులను ఆరా తీసారు.


Also Read: తెలంగాణ కేబినెట్ భేటీకి అనుమతి ఇచ్చిన ఈసీ..

కిర్గిజ్ స్థాన్ రాజధాని బిష్కెక్ లో విదేశీ విద్యార్థులపై జరుగుతున్న దాడులపై మాజీ మంత్రి హారీష్ రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. బిష్కెక్ లో విద్యార్థులపై జరుగుతున్న హింసాత్మక దాడులు ఆందోళనలు కలిగిస్తున్నాయి. భారతీయ విద్యార్థులతో పాటు పలువురు విదేశీ విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు. విద్యార్థులపై దాడులు చేయడంతో పరిస్థితి దయనీయంగా మారింది. తెలంగాణ విద్యార్థుల భద్రత కోసం అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని హరీష్ రావు కోరారు. అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులకు వారి భద్రతపై భరోసా ఇవ్వాలని కోరారు.

Tags

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×