Anand Devarakonda’s Gam Gam Ganesha movie Trailer Out Now: బేబీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న యువ టాలీవుడ్ హీరో ఆనంద్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. బేబీ సినిమా మంచి హిట్ అందుకోవడంతో ఆనంద్ తదుపరి సినిమాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. అయితే తాజాగా ఆనంద్ హీరోగా తెరకెక్కనున్న గంగం గణేష సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. డైరెక్టర్ ఉదయ్ బొమ్మిశెట్టి తెరకెక్కిస్తున్న ఈ సినిమా మే 31వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. ఈ తరుణంలో తాజాగా మేకర్స్ నేడు ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఆనంద్ దేవరకొండ హీరోగా వస్తున్న గంగం గణేష సినిమా ట్రైలర్ అందరిని ఆకట్టుకుంటుంది. ట్రైలర్ చూస్తే మూవీ మొత్తం ఫన్నీ డ్రామా కాన్సెప్ట్ కింద తెరకెక్కించినట్లు అర్థం అవుతోంది. సినిమాలో గణేషుడి విగ్రహం చుట్టూ క్రైమ్ సీన్ జరగబోతుందని తెలుస్తుంది. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ కామెడీ టైమింగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. సినిమాలో ఆనంద్ దేవరకొండ దొంగతనాలు చేస్తాడు. దీంతో ఆ క్రైమ్‌తో ఆనంద్‌కు ఏంటి సంబంధం అనేది సినిమా కథ అని అర్థం అవుతుంది. దీనిపై ఆసక్తి నెలకొనేలా డైరెక్టర్ తెరకెక్కించనున్నాడు.
హీరోయిన్ తో వాడు సూపర్ మ్యాన్ అయితే నేను బ్యాట్ మ్యాన్ అంటూ ఆనంద్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. తమ పేరును టాటూ వేయించుకున్నా అంటూ ఆనంద్ మాయమాటలు చెప్పి అమ్మాయిలతో ఉన్న ఫన్నీ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాలో ఆనంద్ తో పాటు జబర్థస్త్ షోలో కమెడియన్ ఇమ్మాన్యుయేల్ కూడా నటించాడు.
Also Read: Naga Chaitanya: అక్కినేని గ్యారేజ్ లో మరో కారు.. ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే