BigTV English

Uber Buses: ఉబర్ బస్సులు వచ్చేస్తున్నాయ్.. ఎప్పట్నుంచంటే?

Uber Buses: ఉబర్ బస్సులు వచ్చేస్తున్నాయ్.. ఎప్పట్నుంచంటే?

Uber Becomes First to get Aggregator License to Operate Buses: ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ అయినటువంటి ఉబర్ సంస్థ మరిన్ని సేవలను అందుబాటులోకి తీసుకరానున్నది. త్వరలోనే బస్సు సేవలను కూడా ప్రారంభించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీలో ఈ సేవలను తొలుతగా ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఢిల్లీ ప్రీమియం బస్ స్కీమ్ కింద ఈ బస్సులను నడపనున్నది. ఇందుకు సంబంధించి ఢిల్లీ రవాణా మంత్రిత్వ శాఖ నుంచి తాజాగా లైసెన్స్ ను అందుకున్నది ఉబర్ సంస్థ. ఈ తరహా లైసెన్స్ జారీ చేసిన తొలి రవాణా శాఖగా ఢిల్లీ నిలిచింది. అదేవిధంగా ఇటువంటి లైసెన్స్ ను అందుకున్న తొలి అగ్రిగేటర్ గా ఉబర్ నిలిచింది.


ఢిల్లీలో బస్సులకు అధిక డిమాండ్ ఉన్నట్లు తాము గుర్తించామని, అధికారికంగా తమ సేవలను ఢిల్లీలో ప్రారంభించబోతున్నామంటూ ఉబర్ షటిల్ ఇండియా హెడ్ అమిత్ దేశ్ పాండే తెలిపారు. అయితే, బస్సు సర్వీసుల కోసం ప్రయాణికులు వారం ముందు నుంచే బుక్ చేసుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. ఉబర్ బస్సులకు సంబంధించి వివరాలు.. బస్సు ఎక్కడ ఉంది..? బస్సు చేరుకునే సమయం, బస్సు ప్రస్తుతం ఎక్కడ ఉంది..? బస్సు రూట్లకు సంబంధించి వివరాలు.. ఇలా బస్సులకు సంబంధించిన అన్ని వివరాలను ఎప్పటికప్పుడు ఉబర్ యాప్ ద్వారా తెలుసుకోవొచ్చని తెలిపారు. ఒక ఉబర్ బస్సులో 19-50 మంది వరకు ప్రయాణించడానికి వీలుంటదని పేర్కొన్నారు. ఉబర్ టెక్నాలజీ సాయంతో స్థానిక ఆపరేటర్ల ఉబర్ బస్సులు నడుపుతారని ఆయన తెలిపారు.

ఢిల్లీలోని అన్ని ప్రాంతాలను కవర్ చేస్తూనే వ్యాపార జిల్లాల ప్రాంతాల్లో కూడా నడుస్తాయని ఆయన తెలిపారు. ఢిల్లీలో ఉబర్ బస్సు సేవలను త్వరలో అధికారికంగా అందుబాటులోకి తీసుకొస్తున్నందుగా ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా ఢిల్లీ-ఎన్ సీఆర్ తోపాటు కోల్ కతాలో కూడా ఉబర్ బస్సు సేవలను నడుపుతున్నట్లు అమిత్ దేశ్ పాండే పేర్కొన్నారు.


Also Read: ముగిసిన ఐదో దశ పోలింగ్.. ఎంత శాతం పోలింగ్ నమోదయ్యిందంటే..?

అయితే, ఉబర్ కు మంజూరు చేసినటువంటి లైసెన్స్ ఢిల్లీ ప్రభుత్వం యొక్క యాప్-ఆధారిత ప్రీమియం బస్ అగ్రిగేటర్ స్కీమ్ కింద గత నవంబర్ లో నోటిఫై చేయబడింది. ఇది ఎగువ మధ్య తరగతి ప్రజలను ప్రజా రావాణా వైపు మారేలా ప్రోత్సహించే విషయమై లక్ష్యంగా పెట్టుకుంది. అయితే, ఈ పథకం అగ్రిగేటర్లను డైనమిక్ ధరలను సెట్ చేసేందుకు అనుమతిస్తుంది. డీటీసీ ఎయిర్ కండీషన్డ్ బస్సుల గరిష్ట ఛార్జీల కంటే తక్కువగా ఉండకూడదు అనేది నిబంధన. వినియోగదారులు తమ యాప్ లో ఇతర మొబిలిటీ ఆప్షన్ లతోపాటుగా బస్ రైడ్ లను బుక్ చేసుకునే వీలు ఉండనున్నది ఉబర్ సంస్థ తెలిపింది. అయితే, ఈజిప్ట్ తరువాత యుఎస్ కంపెనీ ఉబర్ షటిల్ సర్వీస్ కింద బస్సులను నడపుతున్న రెండవ దేశంగా భారతదేశం నిలబోతున్నది. అయితే, ప్రస్తుతం ఉబర్ షటిల్ కోల్ కతాలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం ప్రకారం పనిచేస్తున్నది. కంపెనీ గతేడాది నుంచి ఢిల్లీ నగరంలో ఉబర్ షటిల్ కోసం పైలట్ ప్రోగ్రామ్ ను నిర్వహిస్తున్నది.

Tags

Related News

Bengaluru: బెంగుళూరులో ప్రధాని.. వందే భారత్ రైళ్లు ప్రారంభం, ఆ తర్వాత రైలులో ముచ్చట్లు

Rakhi Fest: ఈ టీచర్ గ్రేట్.. 15వేల మంది మహిళలు రాఖీ కట్టారు.. ఫోటో వైరల్

Delhi heavy rains: ఢిల్లీలో వరద భీభత్సం.. ఏడుగురు మృతి.. అసలు కారణం ఇదే!

Independence Day 2025: వారంలో ఆగస్టు 15.. స్వేచ్ఛా దినంలోని గాధలు..

BJP MLAs: గర్భగుడి వివాదం.. వద్దంటే వినని బీజేపీ ఎంపీలు.. కేసు నమోదు.. ఎక్కడంటే?

Flight delays: ఢిల్లీలో భారీ వర్షం.. ఆగిన విమానాలు..!

Big Stories

×