Big Stories

Heart Disease with Noise Pollution: ధ్వని కాలుష్యంతో పెరుగుతున్న గుండె జబ్బులు.. ఎలానో తెలుసా..?

Heart Disease due to Noise Pollution: ప్రస్తుతం కాలంలో పెరుగుతున్న కాలుష్యం కారణంగా వివిధ రకాల జబ్బుల బారిన పడే పరిస్థితులు ఎదురయ్యాయి. ముఖ్యంగా కరోనా మహమ్మారి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసినప్పటి నుండి ఏదో ఒక వ్యాధి ప్రపంచాన్ని వణికిస్తునే ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా గుండె జబ్బుల సమస్య విపరీతంగా పెరిగిపోయింది. ఎక్కడ చూసిన గుండె సంబంధింత వ్యాధుల కేసులే నమోదవుతుండడం కలకలం రేపుతుంది. తాజాగా ఓ అధ్యయనం ప్రకారం ధ్వని కాలుష్యం వల్ల కూడా గుండె జబ్బులు ఏర్పడుతున్నట్లు నిపుణులు చెబుతున్నారు. మరి ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.

- Advertisement -

ట్రాఫిక్ నుంచి వచ్చే శబ్థం గుండె జబ్బులకు కారణం అవుతుందట. రోడ్లపై వాహనాలు, రైళ్లు, విమానాల నుంచి వచ్చే శబ్ధాలు కార్డియోవాస్కులర్ డిసీజ్, స్ట్రోక్, డయాబెటిస్ వంటి గుండె సమస్యల ప్రమాదాన్ని పెంచుతున్నాయని అధ్యయనాల్లో వెల్లడైంది. ట్రాఫిక్ శబ్ధం కారణంగా యూరప్ లో ప్రతి సంవత్సరం 1.6 మిలియన్ సంవత్సరాలకు పైగా ఆరోగ్యకరమైన జీవితం కోల్పోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది.

- Advertisement -

Also Read: Health Tips: నీరు ఎక్కువగా తాగితే.. బరువు తగ్గుతారా ?

ట్రాఫిక్ శబ్ధాలు రాత్రి నిద్రను కూడా గందరగోళానికి గురిచేస్తుందని అధ్యయనంలో పేర్కొన్నారు. ఒత్తిడి హార్మోన్లను పెంచుతుందని అన్నారు. అంతేకాదు, రక్త నాళాలు, మెదడుపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుందని తెలిపారు. ఇలా గుండె వాపు, అధిక రక్తపోటు, గుండె సమస్యలు వంటి వాటికి దారి తీస్తుందని అన్నారు. 10 డెసిబిల్స్ ట్రాఫిక్ శబ్ధం వల్ల 3.2 శాతం గుండె సమస్యలు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News