Big Stories

Global Lookout to Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణపై మరో కేసు.. గ్లోబల్ లుకౌట్ నోటీసులు జారీ

Global Lookout issued to Prajwal Revanna: లైంగిక వేధింపుల కేసులో జేడీ(ఎస్) లోక్‌సభ అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణపై మరో మహిళ ఫిర్యాదు చేసింది. ఇప్పటివరకు ప్రజ్వల్‌పై ఇద్దరు బాధిత మహిళలు ఫిర్యాదు చేశారు. ప్రజ్వల్ రేవణ్ణపై అశ్లీల వీడియోల కేసును విచారిస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) గురువారం ఆయనపై లుకౌట్ నోటీసు జారీ చేసింది.

- Advertisement -

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఇమ్మిగ్రేషన్ పాయింట్ల వద్ద సిట్ నోటీసు జారీ చేసింది. రేవణ్ణ ఏప్రిల్ 26న జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్‌కు పారిపోయాడని ఆరోపిస్తూ.. అనేక మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు చూపించే స్పష్టమైన వీడియోలు, ఛాయాచిత్రాలు ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.

- Advertisement -

కర్ణాటకలోని హాసన్ లోక్‌సభ అభ్యర్ధిగా జేడీఎస్ నుంచి ప్రజ్వల్ బరిలో నిలిచారు. కాగా ప్రజ్వల్ పై లైంగిక ఆరోపణలు వచ్చిన వెంటనే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ సీనియర్ నేత కుమారస్వామి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అటు జాతీయ మహిళా కమిషన్ కూడా ప్రజ్వల్ కేసుపై దృష్టి సారించింది. కేసు దర్యాప్తు వివరాలను ఇవ్వాలని కర్ణాటక డీజీపీకి జాతీయ మహిళా కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

Also Read: సత్యం త్వరలో గెలుస్తుంది.. అశ్లీల వీడియోలపై తొలిసారి స్పందించిన రేవణ్ణ..

కాగా బుధవారం ప్రజ్వల్ రేవణ్ణ ట్విట్టర్ వేదికగా సత్యం బయటపడుతుందని పేర్కొనడం గమనార్హం. ప్రజ్వల్ కేసును ప్రస్తావిస్తూ.. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడే వారితో బీజేపీ ఉండదని బుధవారం హుబ్బళ్లిలో అమిత్ షా అన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News