BigTV English

JR NTR Approaches High Court: ల్యాండ్ వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన హీరో ఎన్టీఆర్..!

JR NTR Approaches High Court: ల్యాండ్ వివాదం.. హైకోర్టును ఆశ్రయించిన హీరో ఎన్టీఆర్..!

Jr. NTR Approached Telangana High Court on Land Dispute: ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగిన మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్.. ఓ ల్యాండ్ వివాదంపై హై కోర్టును ఆశ్రయించారు. సుంకు గీతలక్ష్మి అనే మహిళ నుంచి 2003లో ఒక స్థలాన్ని కొనుగోలు చేశారు. ఆ సమయంలో స్థలంపై ఒక బ్యాంకులో లోన్ ఉన్నట్లు చెప్పింది గీత. దానిని క్లియర్ చేసి.. స్థలాన్ని కొనుగోలు చేశారు ఎన్టీఆర్. కానీ ఆ తర్వాత 3,4 బ్యాంకులు తమ వద్ద లోన్ తీర్చకపోవడంతో ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు యత్నించారు. గీత ఫేక్ డాక్యుమెంట్లతో ఆయా బ్యాంకుల నుంచి మార్ట్ గెజ్ ద్వారా లోన్ పొందింది.


ఈ క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ 2019లో ఆయా బ్యాంకుల మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. 1996లో ఈ స్థలాన్ని తనఖా పెట్టి ఒక బ్యాంకులో మాత్రమే లోన్ తీసుకున్నట్లు చెప్పిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. 1996లోనే తమ వద్ద గీతలక్ష్మి స్థలం పేపర్లు తాకట్టు పెట్టి లోన్లు తీసుకున్నట్లు బ్యాంకులు ట్రైబ్యునల్ ను ఆశ్రయించగా.. బ్యాంకులకు అనుకూలంగా తీర్పు వచ్చింది.

తనను మోసం చేసి స్థలం విక్రయించారని సుంకు గీతలక్ష్మి పై జూనియర్ ఎన్టీఆర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా ఎన్టీఆర్ కు DRT రావడంతో హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 3 లోగా DRT డాకెట్ ఆర్డర్ ను సబ్మిట్ చేయాలని హై కోర్టు ఆదేశించింది. దీనిపై జూన్ 6వ తేదీన విచారణ చేపట్టనుంది.


Also Read: జూనియర్ ఎన్టీఆర్ ఆగ్రహం.. వైరలవుతున్న వీడియో

కాగా.. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్నారు. రెండు పార్టులుగా వస్తోన్న దేవర.. బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా రూపొందుతోంది. మరోవైపు హృతిక్ రోషన్ హీరోగా తెరకెక్కుతోన్న వార్ 2 లోనూ ఎన్టీఆర్ నటిస్తున్నారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×