BigTV English

RCB Playoff Chances: ఆర్సీబీకి సవాల్.. 18 పరుగులు లేదా 18.1 ఓవర్ లో.. అలా అయితేనే ప్లే ఆఫ్!

RCB Playoff Chances: ఆర్సీబీకి సవాల్.. 18 పరుగులు లేదా 18.1 ఓవర్ లో.. అలా అయితేనే ప్లే ఆఫ్!

Conditions for RCB to Reach Playoff in IPL 2024: తాజాగా హైదరాబాద్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ రద్దు కావడంతో ప్లే ఆఫ్ కి కోల్ కతా, రాజస్థాన్, సన్‌రైజర్స్ చేరుకున్నాయి. ఇక నాలుగో స్థానం కోసం చెన్నయ్, ఆర్‌సీబీ శనివారం నాడు తలపడనున్నాయి. అందులో గెలిచిన జట్టు ప్లే ఆఫ్ కి చేరుతుంది.


అయితే ఆర్సీబీ వెళ్లాలంటే మాత్రం 18 పరుగులు తేడాతో గెలవాలి. లేదా 18.1 ఓవర్ లో విజయం సాధించాలి. అలాగైతేనే చెన్నయ్ తో నెట్ రన్ రేట్ ను దాటి ప్లే ఆఫ్ కి చేరే అవకాశం ఉంది. లేదంటే చెన్నయ్ ప్లే ఆఫ్ కి చేరిపోతుంది. ఒకవేళ ఆర్సీబీ విజయం సాధించినా ఆ తేడా లేకపోతే ఫలితం లేదు.

ఎందుకంటే ఆల్రెడీ చెన్నై 14 పాయింట్లతో ఉంది. ఆర్సీబీ ప్రస్తుతం 12 పాయింట్లతోనే ఉంది. అందువల్ల ఆర్సీబీ గెలిస్తే 14 పాయింట్లతో సమానం అవుతుంది. అప్పుడు నెట్ రన్ రేట్ తీస్తారు. ఆ 18 తేడా లేకపోతే మాత్రం కష్టపడినా ఫలితం ఉండదు.


Also Read: ముంబై ఆఖరి పోరాటం.. ‌నేడు లక్నో సూపర్ జెయింట్స్‌‌తో మ్యాచ్

ఐపీఎల్ 2024 సీజన్ ప్రారంభంలో చాలా నిరాశజనకంగా ఆర్సీబీ మొదలుపెట్టింది. దాదాపు ఆరు మ్యాచ్ లు ఓడిపోయి, పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి చేరిపోయింది. అక్కడే చాలా కాలం ఉండిపోయింది. ఒక దశలో వరుసపెట్టి రెండు మ్యాచ్ లు గెలిచినా సరే, నెట్ రన్ రేట్ లేక పదో స్థానం నుంచి పైకి కదల్లేదు. తర్వాత ఒక్కసారి మూడో విజయం సాధించి 7వ స్థానానికి జంప్ చేసింది. తర్వాత మరో రెండు విజయాలు సాధించి 12 పాయింట్లతో ప్రస్తుతం 6వ స్థానంలో ఉంది.

నిజానికి వరుసగా ఐదు మ్యాచ్ లు విజయం సాధించడం కూడా ఒక రికార్డ్ గానే చెబుతున్నారు. ఎందుకంటే మొదటి నుంచి గెలవడం వేరు.. పడిపోయి మళ్లీ పైకి లేవడం వేరు. మొత్తానికి జట్టులో మార్పులు చేర్పులు చేసుకుంటూ స్ఫూర్తిమంతంగా ముందడుగు వేశారు.

Also Read: T20 World Cup 2024: టీ 20 ప్రపంచకప్ షురూ.. ఇండియా వార్మప్ మ్యాచ్ ఎప్పుడో తెలుసా..?

నిజంగా చెన్నయ్ తో గెలిస్తే మాత్రం.. ఐపీఎల్ 2024 సీజన్ లో చరిత్రలో నిలిచిపోతారు. ఇక్కడ నుంచి వరుసపెట్టి విజయాలు సాధించి ట్రోఫీ సాధిస్తే, అందరూ అన్నట్టు డబుల్ జోష్ లభిస్తుంది.

ఎందుకంటే ఆల్రడీ అమ్మాయిల జట్టు ట్రోఫీ సాధించింది. స్మృతి మంధాన సారథ్యంలో ఇదే సీజన్ లో విజయం సాధించింది. ఇటు పురుషుల జట్టు కూడా కొడితే ఆనందం రెట్టింపు అవుతుందని అప్పుడే నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

Related News

Mohammed Siraj : వివాదంలో మహమ్మద్ సిరాజ్.. ఆ వైన్ బాటిల్ వద్దన్నాడా.. ముస్లిం రూల్స్ కారణమా!

Sara Tendulkar: స్టార్ క్రికెటర్ కు రాఖీ కట్టిన సచిన్ కూతురు సారా

Rishabh Pant : దరిద్రం అంటే పంత్ దే… ఆసియా కప్ 2025 తో పాటు 3 సిరీస్ లకు దూరం

Virat – Anushka : విరాట్ కోహ్లీ దంపతులు పాములు వండుకొని తిన్నారా.. బీఫ్ కూడా?

Brick Lesnar : బ్రాక్ లెస్నర్ కూతురా మజాకా.. ఏకంగా నాలుగు మెడల్స్ సాధించిందిగా..?

Virat Kohli: తెల్ల గడ్డంతో విరాట్ కోహ్లీ…నెల రోజులకే ముసలోడు అయ్యాడా !

Big Stories

×