E-Paper
Advertisement

Prabhas Instagram Story: ‘వెయిట్ చేయండి డార్లింగ్స్.. మంచి న్యూస్ చెప్తానన్న ప్రభాస్’.. పెళ్లి అప్డేటా..?

Prabhas Instagram Story: ‘వెయిట్ చేయండి డార్లింగ్స్.. మంచి న్యూస్ చెప్తానన్న ప్రభాస్’.. పెళ్లి అప్డేటా..?
Advertisement

Prabhas Instagram Story about to His Marriage: పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ తన అభిమానులకు ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు. “డార్లింగ్స్.. చివరికి ఒకరు మన జీవితంలోకి రాబోతున్నారు. కాస్త వెయిట్ చేయండి చెప్తా” అంటూ ప్రభాస్ తన అధికారిక ఇన్ స్టా ఖాతాలో స్టోరీ పోస్ట్ చేశారు. అయితే ఇది డార్లింగ్ పెళ్లి వార్తకు సంబంధించిన విషయమేనంటూ ప్రభాస్ అభిమానులు ఎగ్సైట్ అవుతున్నారు. అన్నా.. వదినెవరో చెప్పు అంటూ.. పోస్టులు పెడుతున్నారు.

నాలుగు పదుల వయసు దాటినా.. మన డార్లింగ్ స్టిల్ బ్యాచిలర్ గానే ఉండిపోయారు. ప్రభాస్ ఊ కొడితే.. పెళ్లికోసం అమ్మాయిలంతా లైన్ లో నిలబడతారు. అలాంటి డార్లింగ్ పెళ్లికి ఎందుకంత దూరంగా ఉన్నారన్నదానిపై చాలా వార్తలొచ్చాయి. అందులో మెయిన్.. అనుష్కతో ప్రేమాయణమని. బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి -2 ఇలా వరుస సినిమాలు చేసిన వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని, పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇంకా పెళ్లి పీటలెక్కలేదని ఒకానొక టైమ్ లో వార్తలు గుప్పుమన్నాయి. కానీ ఇద్దరిలో ఎవరూ ఆ వార్తలపై రియాక్ట్ అవ్వలేదు. బాహుబలి సమయంలో తామిద్దరం మంచి స్నేహితులమని మాత్రం చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఆదిపురుష్ లో నటించిన కృతి సనన్ తోనూ డేటింగ్ లో ఉన్నారన్న రూమర్లు వచ్చాయి.

Advertisement

తాజాగా ప్రభాస్.. త్వరలో మన జీవితంలోకి కొత్త వ్యక్తి రాబోతున్నారని ఇన్ స్టా స్టోరీ పెట్టడంతో.. వదినమ్మ వచ్చేస్తుందంటూ అభిమానులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. కొందరు వదినమ్మ అనుష్కనే అంటూ.. మీమ్స్ కూడా చేసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఇంకొందరైతే అదేం కాదు.. మేనకోడలు పుట్టిందని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: స్టార్ డైరెక్టర్.. నా అంతు చూస్తా అని బెదిరించాడు

Advertisement

మరి నిజంగానే ప్రభాస్ ఒక వ్యక్తి గురించే చెప్తారా లేక.. ఇదేమైనా సినిమా స్టంటా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న కల్కి 2898AD సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న కల్కి నుంచి త్వరలోనే ఫస్ట్ సింగిల్ ను విడుదల చేస్తామని చిత్రయూనిట్ నిన్ననే ప్రకటించింది. దీనితో పాటు మారుతి దర్శకత్వంలో ది రాజా సాబ్ సినిమాలోనూ ప్రభాస్ నటిస్తున్నాడు. మరి ఈ రెండు చిత్రాల్లో ఏదైనా అప్డేట్ గురించి చెప్పడానికి డార్లింగ్ ఆ స్టోరీ పెట్టాడా అని కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఇవేవీ కాకుండా.. హీరోయిన్లు పెళ్లి చేసుకోకుండా, నవమాసాలు మోయకుండా బిడ్డల్ని కన్నట్టుగానే.. ప్రభాస్ కూడా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోవాలని ఫిక్సై.. సరోగసి ద్వారా బిడ్డను కంటున్నాడా ? అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. వీటిలో ప్రభాస్ దేని గురించి అప్డేట్ ఇస్తాడో వేచి చూడాలి. ఈ అప్డేట్ పెళ్లి గురించే అయితే.. డార్లింగ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మరో ట్రెండ్ ను సెట్ చేయడం ఖాయం.

Also Read: Kalki2898AD: ప్రభాస్ జీవితంలోకి వస్తున్న అమ్మాయి ఎవరో తెలిసిపోయిందిరోయ్..

Tags

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×