E-Paper
Advertisement

Team India New Coach: టీమిండియా ప్రధాన కోచ్ రేసులో ఎవరున్నారు..?

Team India New Coach: టీమిండియా ప్రధాన కోచ్ రేసులో ఎవరున్నారు..?
Advertisement

Who are in the Team India New Coach Race: టీమిండియా కోచ్ పదవికి పలువురు సీనియర్ క్రికెటర్లు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే బీసీసీఐ మదిలో ఏముందో ఎవరికి తెలియడం లేదు. ఎవరికి చెవిలో చెప్పి, అప్లై చేయమని సలహాలిస్తున్నారో కూడా తెలీడం లేదు. అయితే చాలామంది అనుకునేదేమిటంటే.. డైరెక్టుగా బీసీసీఐ నుంచి అనధికారికంగా అయినా ఫోను వస్తే, అప్పుడు చూద్దామనే లెక్కలో కొందరు ఉన్నారని అంటున్నారు.

వివివిఎస్ లక్ష్మణ్ కి ఆసక్తి ఉందా..? లేదా..?

ప్రస్తుతం లక్ష్మణ్ నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA) డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. అద్భుత‌మైన బ్యాటింగ్ క్రికెట్ ప్ర‌పంచంలో త‌న‌దైన ముద్ర‌వేసిన అత‌ను ద్రవిడ్ తర్వాత టీమిండియాకు ప్ర‌ధాన కోచ్ బహుశా లక్ష్మణ్ కావచ్చునని అంటున్నారు. ద్రవిడ్ సెలవులో ఉన్నప్పుడు లక్ష్మణ్ భారత జట్టుకు కోచ్‌గా కూడా పనిచేశాడు.

జస్టిన్ లాంగర్ అయితే బెటర్..?
Advertisement

ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్. అలాగే 2023 వన్డే వరల్డ్ కప్ ఆస్ట్రేలియా సాధించడంలో కోచ్ గా తన పాత్ర ఎంతో కీలకంగా ఉంది. అంతేకాదు ఆస్ట్రేలియా పలు విజయాల్లో జస్టిన్ లాంగర్ పాత్ర ఉంది. గతంలో విదేశీ కోచ్ లు ఉన్నప్పుడే మనవాళ్లు ఐసీపీ ట్రోఫీలు గెలిచారు. అందుకని ఈసారి విదేశీ కోచ్ లని తీసుకోవాలని అనుకుంటే మాత్రం జస్టిన్ లాంగర్ బెటర్ ఛాయిస్ అని అంటున్నారు.

Also Read: రిటైర్మెంట్ తర్వాత నేను మీకు కనిపించను.. విరాట్ కోహ్లీ సంచలన కామెంట్స్

చెన్నై కోచ్.. స్టీఫెన్ ఫ్లెమింగ్..
Advertisement

న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ అయిన స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రస్తుతం ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ గా ఉన్నాడు. ధోనీతో మంచి కెమిస్ట్రీ ఉండటంతో చెన్నయ్ ని తొమ్మిదిసార్లు ఫైనల్ వరకు తీసుకువెళ్లాడు. అంతేకాదు ఐదుసార్లు ట్రోఫీ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తన ప్లానింగ్, ఆలోచనలు, వ్యూహాలు కలిసి రావడం వల్లే చెన్నయ్ ఇప్పుడు కూడా ప్లే ఆఫ్ రేస్ లోనే ఉండటం విశేషం. అయితే మహేంద్ర సింగ్ ధోనీ కూడా ఫ్లెమింగ్ పేరుని బీసీసీఐకి రికమండ్ చేశాడనే టాక్ ఒకటి నెట్టింట వినిపిస్తోంది.

ఫైర్ బ్రాండ్ గౌతమ్ గంభీర్..

గొప్ప క్రికెట్ బుర్రగా అందరూ కొనియాడే గౌతమ్ గంభీర్ కూడా భారత హెడ్ కోచ్ రేస్ లో ఉన్నాడు. కాకపోతే నోటి దురద బాగా ఎక్కువ. చిన్నా పెద్దా చూసుకోడు. ముందూ వెనుకా చూసుకోడు. మంచీ చెడ్డా చూసుకోడు. తనకి ఆ క్షణం ఏదనిపిస్తే అది అనేస్తాడు. తర్వాత ఎంత రచ్చయినా పోరాడతాడు తప్ప వెనుకడుగు వేయడు. అలాంటి మొండి ఘటం కోచ్ గా కరెక్టేనా? అంటున్నారు. అయితే కెప్టెన్ రోహిత్ శర్మతో మంచి అనుబందం ఉంది. కొహ్లీతో గొడవలున్నా సర్దుకున్నారు. కోల్ కతా కెప్టెన్ గా ఉండి రెండుసార్లు ట్రోఫీ అందించాడు. ప్రస్తుతం మెంటార్ గా ఉండి ప్లే ఆఫ్ కి తీసుకువెళ్లాడు.

Also Read: RCB vs CSK Match Preview : ఆర్సీబీ వర్సెస్ చెన్నై.. ఉండేదెవరు ? వెళ్లేదెవరు ?

ఫాస్ట్ బౌలర్.. ఆశిష్ నెహ్రా..

ఇండియన్ క్రికెట్ లో ఒకనాటి ఫాస్ట్ బౌలర్లలో ఆశిష్ నెహ్రా కూడా ఒకడు. అయితే సౌమ్యుడు, వివాదాలకు దూరంగా ఉంటాడు. ఒకసారి మహేంద్ర సింగ్ ధోనీ తనని బూతులు తిట్టాడని అన్నాడు. కాకపోతే ఇలా అంతర్గత వ్యవహారాలని ఎప్పుడైనా బయటపట్టే మనస్తత్వం ఉన్నవాళ్లని కోచ్ గా తీసుకోరని అంటారు. ఎందుకంటే భవిష్యత్తులో భారత్ క్రికెట్ బొక్కలన్నీ బయటకి వస్తే ప్రమాదమని భావిస్తే, నెహ్రాకి అవకాశం ఉండకపోవచ్చు. ప్రస్తుతం గుజరాత్ హెడ్ కోచ్ గా ఉన్నాడు. హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో గుజరాత్ కి ట్రోఫీ అందించడమే కాదు, ఒకసారి ఫైనల్ కి కూడా తీసుకువెళ్లాడు.

వీరే కాకుండా ఢిల్లీ కోచ్ గా ఉన్న రికీ పాంటింగ్ పేరు కూడా బీసీసీఐ లిస్టులో ఉందని అంటున్నారు. మరి ఎవరికి అవకాశం వస్తుందో ఎదురుచూడాల్సిందే.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ ఇంజ‌మామ్ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×