BigTV English

Lightning Strikes in Bengal: పశ్చిమ బెంగాల్ లో పిడుగుల వర్షం.. 11 మంది మృతి!

Lightning Strikes in Bengal: పశ్చిమ బెంగాల్ లో పిడుగుల వర్షం.. 11 మంది మృతి!

11 Dead in West Bengal due to Rain Lightning Strikes: పశ్చిమ బెంగాల్ లోని మాల్దా జిల్లాలో గురువారం మధ్యాహ్నం వర్షంతో పాటు పడిన పిడుగుల వర్షంలో 11 మంది మరణించగా.. అనేక మంది గాయపడినట్లు ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. మృతుల్లో ఇద్దరు మైనర్లు ఉన్నట్లు తెలిపారు. హరిశ్చంద్రాపూర్ లో పిడుగుపాటుకు దంపతులు మృతి చెందారు. పొలంలో పనులు చేస్తుండగా పిడుగు పడగా.. ఇద్దరూ అక్కడికక్కడే మరణించారు. మృతులు నయన్ రాయ్ (23), ప్రియాంక సింగ్ (20)గా గుర్తించారు.


అలాగే.. మాల్దాలోని సహపూర్ ప్రాంతంలో చందన్ సహాని (40), రాజ్ మృద్ధా (16), మనజిత్ మండల్ (21), అసిత్ సాహా (19) పిడుగుపాటుకు మరణించారు. మానిక్ చక్ లోని మహ్మద్ తోలాలో ఎనిమిదేళ్ల రాణా షేక్, హద్దటోలాలో అతుల్ మండల్ (65), షేక్ సబ్రుల్ (11), మిర్దార్ పూర్ లో సుమిత్ర మండల్ (45) ప్రాణాలు కోల్పోయారు. ఇంగ్లీషు బజార్ లోని మిల్కీలో పంకజ్ మండల్ (23) అనే వ్యక్తి కూడా మరణించాడు. అనేక మంది గాయాలపాలై చికిత్స పొందుతున్నారు.

Also Read: Bus catches fire in Haryana: హర్యానాలో ఘోరం, మంటల్లో బస్సు.. 10మంది సజీవ దహనం


పిడుగుపాటుకు ఇంతమంది మరణించడంపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఒక్కో మృతుని కుటుంబాలకు జిల్లా యంత్రాంగం రూ.2 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. బాధితులకు అవసరమైన అన్ని రకాల సహాయాన్ని అందించేందుకు జిల్లా యంత్రాంగం అందుబాటులో ఉంటుందని సీఎం మమతా తెలిపారు.

Related News

Raksha Bandhan 2025: రక్షా బంధన్ స్పెషల్.. మహిళలకు బంపరాఫర్, ఉచిత బస్సు ప్రయాణం

Rahul Gandhi: ఒక సింగిల్ బెడ్ రూం ఇంట్లో 80 మంది ఓటర్లు ఉన్నారట…

Jammu Kashmir: లోయలో పడిన ఆర్మీ వాహనం.. ఇద్దరు జవాన్లు మృతి, 12 మందికి గాయాలు..

Cloudburst: ఉత్తరాఖండ్‌లో ప్రళయం.. పదే పదే ఎందుకీ దుస్థితి.. కారణం ఇదేనా!

Sunil Ahuja: ఐటీ రైడ్స్ భయం.. దేశం వదిలిన సునీల్ ఆహుజా? ఏం జరిగింది?

Breaking: కుప్పకూలిన హెలికాప్టర్.. మంత్రులు మృతి

Big Stories

×