E-Paper
Advertisement

Sridevi Home on Rent: అద్దెకు శ్రీదేవి ఇల్లు.. చెన్నైలో క్యూ కట్టిన ఫ్యాన్స్!

Sridevi Home on Rent: అద్దెకు శ్రీదేవి ఇల్లు.. చెన్నైలో క్యూ కట్టిన ఫ్యాన్స్!
Advertisement

Actress Sridevi Home on Rent: అందాల అతిలోక సుందరి శ్రీదేవి నివసించిన ఇల్లు అద్దెకు దొరుకుంతుందా..? అంటే అవును అనే అంటున్నారు బోనీ కపూర్. చెన్నైలో శ్రీదేవి, బోనీ కలిసి నివసించిన ఇంటిని అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అప్పట్లో ఇండస్ట్రీ మొత్తం మద్రాస్ లో ఉండేదన్న విషయం తెల్సిందే. స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే శ్రీదేవి.. చెన్నైలో ఒక సొంత ఇల్లు కొనుగోలు చేసి.. తన టేస్ట్ కు తగ్గట్టు తయారుచేయించుకుంది.

ఇక బోనీ కపూర్ తో పెళ్లి అయ్యాక ఆమె ముంబైకు షిఫ్ట్ అయ్యింది. కానీ, ఈ ఇంటిని మాత్రం ఎంతో పదిలంగా కాపాడుకుంటూ వచ్చింది. చెన్నై వచ్చిన ప్రతిసారి ఆమె .. ఈ ఇంట్లోనే ఉండేది. అందాల భామ జాన్వీ కపూర్ చిన్నతనం మొత్తం ఇక్కడే గడిచింది.  ఇక్కడ కూడా శ్రీదేవి వచ్చిందంటే చాలు.. ఆ ఇంటిచుట్టూ అభిమానులు క్యూ కట్టేవారు. ఇక శ్రీదేవి మరణం తరువాత ఈ ఇంటి కళ మారిపోయింది. చెన్నై వచ్చి ఇంటి బాగోగులు చూసుకొనే పరిస్థితిలో బోనీ లేడు. ఈ మధ్యనే బోనీ ఈ ఇంటిని శుభ్రం చేయించాడు.

Advertisement

శ్రీదేవి ఉన్న ఈ ఇంటిని అమ్మడానికి మనసు ఒప్పక.. కొంత భాగాన్ని తన ఆఫీస్ గా ఉపయోగిస్తూ.. ఇంకొంతభాగాన్ని అద్దెకు ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఈ ఇంటి హోమ్ టూర్ చేస్తూ జాన్వీ మీరు కూడా ఈ ఇంట్లో ఉండాలనుకుంటున్నారా.. అయితే రండి అంటూ చెప్పుకొచ్చింది.

Also Read: Prasanth Varma PVCU: సినీ ఇండస్ట్రీకి పరిచయం కావాలని ఉందా.. ‘హనుమాన్’ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బంపరాఫర్..

Advertisement

ప్రస్తుతం శ్రీదేవి ఇల్లు రెంట్ కు ఇవ్వబడును అని తెలియడంతో ఆమె అభిమానులు ఇక్కడ క్యూ కట్టారు. ఆమె నడియాడిన ఆ ఇంట్లో తాము కూడా ఉండాలని, రెంట్ ఎంతైనా పర్లేదని చెప్పుకొస్తున్నారట. మరి శ్రీదేవి ఇంటికి అద్దెకు వెళ్లేవారు ఎవరో తెలియాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. ఇకపోతే బోనీ.. నిర్మాతగా కోలీవుడ్ లో కూడా బిజీగా మారుతున్నాడు. ప్రస్తుతం అజిత్ తో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు.

Related News

Neha Chaudhary : యాంకర్ నేహా నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా..?

Kissik Talks Show : ఉదయ్ కిరణ్ తో మూడు సినిమాలు మిస్ అయ్యాయ్…ఎమోషనల్ అయిన ఆనందం రేఖ !

పెళ్లయిన మూడోరోజే ఆసుపత్రిలో షణ్ముఖ్.. ఇదేం ట్విస్ట్.. ఏం జరిగిందంటే..?

యోగా అంటే తత్వమో, మతమో కాదు అదొక సైన్స్.. సద్గురు..

Kissik Talks Show : నా జీవితంలో కన్నీళ్లు తెప్పించే ఘటన ఇదే.. కొన్నేళ్లు మర్చిపోలేదు..

Kissik Talks Show : బిగ్ బాస్ 10 లో స్నో అక్కకు ఛాన్స్.. ఒక్కరోజుకు రెమ్యూనరేషన్ ఎంతంటే..?

Kissik Talks Show : శ్రీలీలతో ఆ ఒక్కటి చెయ్యాలని కోరిక.. స్నో అక్క ఇలా ఉందేంట్రా బాబు..

Kissik Talks Show: హీరోలు, డైరెక్టర్లు నా బ్లెస్సింగ్స్ తీసుకోవాల్సిందే.. ‘కిసిక్ టాక్స్ లో మౌనిష వైరల్ కామెంట్స్!

Big Stories

Advertisement
×