Big Stories

Anjeer: అంజీర్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే.. అస్సలు వదలరు !

Health Benefits Of Anjeer: ఈ మధ్య కాలంలో చాలా మంది డ్రై ఫ్రూట్స్ తినడానికి ఆసక్తి చూపిస్తున్నారు. వాటిలో ఉండే పోషకాలు శరీర పెరుగుదలతో పాటు ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయి. డ్రై ఫ్రూట్స్ లో అంజీర్ కూడా ఒకటి. దీనిలో ఎన్నో పోషకాలు ఉంటాయి.
అంజీర్ ను రాత్రంతా నానబెట్టి ఉదయం తింటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

అంజీర్ లో శరీరానికి కావాల్సిన పీచుపదార్థం, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. దీన్ని అత్తిపండు అని కూడా పిలుస్తారు. రోజుకు 2 లేదా 3 అంజీరాలను రాత్రంతా వాటర్‌లో నానబెట్టి ఉదయాన్నే తేనెతో కలిపి కలిపి తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి.

- Advertisement -

గుండె ఆరోగ్యం:
అంజీర్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం రెండు అంజీరాలను తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుందట.

మలబద్దకం తగ్గుతుంది:
అంజీర్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. నానబెట్టిన అంజీరాను మలబద్దకం సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయాన్నే తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దీని ద్వారా జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.

చెక్కర స్థాయి అదుపులో :

సహజసిద్ధంగానే అంజీర్ లు కొద్దిగా స్వీట్ గా ఉంటాయి. అయితే షుగర్ పేషెంట్లు కూడా అంజీర్ లను తీనవచ్చని డాక్టర్లు సూచిస్తున్నారు. మధుమేహ వ్యాధితో బాధపడేవారు నానబెట్టిన అంజీర్ లను ఉదయాన్నే తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

బరువు తగ్గొచ్చు:

అంజీర్ లో క్యాలరీలు తక్కువగా, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునేవారు అంజీర్ లను తినాలని చెబుతుంటారు. అంజీర్ తినడం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లు అనిపించి ఎక్కువ సేపు ఆకలి కాకుండా ఉంటుంది.

నిద్ర కోసం :
రాత్రి పడుకునే ముందు ప్రతిరోజు రెండు నానబెట్టిన అంజీర్ పండ్లను తిన్న వారు ఎక్కువ సేపు నిద్రపోయినట్లు పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధన టర్కీలో ఓ యూనివర్సిటీలో జరిగింది. రోజు పడుకునే ముందు రెండు నానబెట్టిన అంజీర్ లను తినడం వల్ల ఎక్కువసేపు నిద్రపడుతుందని టర్కీ యూనివర్సిటీ న్యూరోలజీ ప్రొఫెసర్ మెహ్మెట్ గుల్ తెలిపారు.

Also Read: డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. కారణాలేంటో తెలుసా !

అంజీర్ ప్రయోజనాలు:

అంజీర్ లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంజీర్ తినడం వల్ల ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి.మెనోపాజ్ లోకి అడుగు పెడుతున్న మహిళలు ప్రతి రోజు వీటిని తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అంజీర్ తినడం వల్ల చర్మం కాంతివంతంగా ఉండటంతో పాటు యవ్వనంగా ఉంటుంది.
అంజీర్ లో ఉండే ఔషధ గుణాలు పెద్ద పేగు క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వంటివి రాకుండా అడ్డుకుంటాయి

 

 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News