Big Stories

Diabetes: డయాబెటిస్ బారిన పడుతున్న యువత .. కారణాలేంటో తెలుసా !

Diabetes: ఆధునిక కాలంలో జీవనశైలి మారడం వల్ల చాలా మంది డయాబెటిస్ బారిన పడుతున్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న వ్యాధుల్లో ఇది ముందుంటుంది. నేడు ప్రతి ఇంట్లో ఒకరైనా డయాబెటిస్ బారిన పడుతున్నారు. భారతదేశంలో రోజు రోజుకు డయాబెటిస్ బారిన పడే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇందులో ఎక్కువగా యువతే ఉంటున్నారు. ఇందుకు గల కారణాలు చాలానే ఉన్నాయి.

- Advertisement -

డయాబెటిస్ అనేది అది తీవ్రమైన సమస్య. ఒక్క సారి మధుమేహం వచ్చిందంటే అదుపులో ఉంచుకోవడం తప్ప. పూర్తిగా తగ్గించుకోవడం చాలా కష్టం అని డాక్టర్లు చెబుతుంటారు. అంతే కాకుండా ఒక సారి డయాబెటిస్ వస్తే దీని వల్ల ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే వ్యాధి రాక ముందే జాగ్రత్తగా ఉండాలి. రక్తంలో చక్కెర స్థాయి పెరగడం వల్ల మధుమేహ వ్యాధి వస్తుంది. డయాబెటిస్ రావడానికి గల కారణాలు నివారణ మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

మధుమేహం అంటే ఏమిటి ?

శరీరంలోని రక్తంలో చెక్కర స్థాయి పెరిగితే ఈ సమస్యను డయాబెటిస్ అంటారు. వాస్తవానికి ఇన్సులిన్ శరీరంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రిస్తుంది. దీని వల్ల రక్తంలో తగినంత ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. ఫలితంగా గ్లూకోజ్ స్థాయి పెరిగి మధుమేహం సమస్య ప్రారంభం అవుతుంది. అందుకే దీనిని ముందుగా గుర్తించడం వల్ల చెక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. మధుమేహ వ్యాధి రాకుండా ఉండాలంటే ఆరోగ్యకరమైన జీవన శైలి పాటించాలి.

మధుమేహం రకాలు :

మధుమేహ వ్యాధిని ప్రధానంగా రెండు రకాలుగా విభజించారు. టైప్ -1, టైప్ -2. ప్యాంక్రియాజ్ లో లోపం కారణంగా చిన్నతనం నుంచి ఇన్సులిన్ ఉత్పత్తి కానప్పుడు టైప్ -1 డయాబెటిస్ కు గురవుతుంటారు. తద్వారా శరీరం ఇన్సులిన్ ఉత్పత్తి చేయదు. దీంతో జీవితాంతం ఇన్సులిన్ ఇవ్వాల్సి ఉంటుంది. టైప్ – 2 లో అనారోగ్య జీవనశైలి కారణంగా మధుమేహ వ్యాధి వస్తుంది. ఇది వయసు పెరిగే కొద్ది మరిన్ని సమస్యను తెచ్చిపెడుతుంది. కానీ ఈ రోజుల్లో యువత అనారోగ్య జీవనశైలి కారణంగా చిన్న వయసులోనే టైప్- 2 డయాబెటీస్ బారిన పడుతున్నారు.

డయాబెటిస్ రావడానికి కారణాలు:

ఒత్తిడి
అనారోగ్య జీవనశైలి
జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం
తక్కువ శారీరక శ్రమ
ఊబకాయం
క్రమరహిత జీవనశైలి

Also Read: ఆస్తమా గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

నివారణ మార్గాలు:

జీవనశైలి మెరుగుదల
ఆరోగ్యకరమైన పోషక ఆహారం తీసుకోవడం
తగినంత నీరు తాగడం
ఆకుపచ్చని కూరగాయలు, పండ్లు తినడం
ఒత్తిడిని తగ్గించుకోవడం
రోజు వ్యాయామం, వాకింగ్ చేయడం

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News