Kamal Haasan’s Indian 2 Releasing on July 12th: లోక నాయకుడు కమల్ హాసన్ – శంకర్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమా గురించి తెలుగు ప్రేక్షకులకు సైతం గుర్తుచేయాల్సిన అవసరం లేదు. లంచం తీసుకొనే అధికారులకు సింహస్వప్నంలా సేనాపతి మారడం.. కన్నకొడుకును కూడా లెక్కచేయకుండా కాల్చి చంపడం ఇంకా మైండ్ లో మెదులుతూనే ఉంటుంది.
ఇక దాదాపు 28 ఏళ్ల తరువాత సేనాపతి తిరిగివస్తున్నాడు. ఇన్నేళ్ల తరువాత భారతీయుడు కు సీక్వెల్ ప్రకటించారు. కమల్ హాసన్ – శంకర్ కాంబోలో గతేడాది ఎప్పుడో ఈ సినిమా మొదలయ్యింది. ఇక మధ్యలో కొన్ని కారణాల వలన వాయిదాలు పడుతూ వస్తుంది. అయితే ఎట్టకేలకు అన్ని అడ్డంకులు తొలగి.. ఇండియన్ 2 కూడా రిలీజ్ డేట్ ప్రకటించింది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ అంచలనను పెంచాయి. అయితే ఈ పోస్టర్స్ లలో జూన్ లో ఇండియన్ 2 రిలీజ్ అవుతుందని చెప్పారు. అయితే ఇప్పుడు ఒక నెల ముందుకు జరిగి జూలై 12 న ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ్ లో రిలీజ్ కానుందని తెలిపారు. ఇక దీంతో పాటు మరో అప్డేట్ ను కూడా మేకర్స్ అందించారు. భారతీయుడు 2 నుంచి మొదటి పాట రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేసినట్లు కూడా తెలిపారు.
Also Read: Deepika Padukone: బేబీ బంప్ తో దీపికా.. ఓటు వేయడానికి వచ్చిన స్టార్ కపుల్
మే 22 న భారతీయుడు 2 నుంచి మొదటి సాంగ్ ను రిలీజ్ చేయనున్నట్లు తెలుపుతూ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్ లో కమల్.. గుర్రంపై వెనుక గొడ్డలి పెట్టుకొని అవినీతి పరుల అంతు చూడడానికి వస్తున్నట్లు కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ఈ కాంబో మరోసారి హిట్ అందుకుంటుందేమో చూడాలి.
Indian 2 – 1st single from may 22nd . Indian world wide from July 12th
@ikamalhaasan @anirudhofficial #indian2 pic.twitter.com/5BXfqx0mw6— Shankar Shanmugham (@shankarshanmugh) May 19, 2024